
Jabardasth Kiraak RP Shares His Love Story In Party cheddham Pushpa
Jabardasth Kiraak RP : జబర్దస్త్ వేదిక మీద కిరాక్ ఆర్పీ బాగానే ఫేమస్ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా ఆర్పీ ఇది వరకు ఎన్ని సినిమాల్లో కనిపించినా.. జబర్దస్త్ షో వల్లే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆర్పీ మాత్రం మధ్యలోనే షోను వదిలేసి వెళ్లాడు. నాగబాబు పక్క షోకు వెళ్లడంతో ఆర్పీ కూడా వెళ్లిపోయాడు. అదిరింది, బొమ్మ అదిరింది షోలో నాగబాబుతో పాటుగా ఆర్పీ కూడా వచ్చేశాడు. మధ్యలో నాగబాబు కూడా వదిలేసి వెళ్లిపోడంతో.. ఆర్పీ కూడా పోయాడు. చివరకు ఆ షో కూడా మూతపడిపోయింది. ఆ తరువాత కిరాక్ ఆర్పీ సినిమాలతో బిజీగా అయిపోయాడు.అయితే గత కొన్ని రోజులుగా కిరాక్ ఆర్పీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి.
లక్కీ అనే అమ్మాయితో ఆర్పీ ప్రేమలో పడ్డాడు. ఆర్పీ, లక్కీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. అయితే వారిద్దరు కూడా తమ ప్రేమను ఎప్పుడూ బయట పెట్టలేదు. మొత్తానికి సడెన్‌గా ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేశారు. దీంతో కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం పిక్స్ నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. జబర్దస్త్ ఆర్టిస్టులు, కామెడీ స్టార్స్ ఆర్టిస్టులు ఆ నిశ్చితార్థానికి వచ్చారు. మొత్తానికి ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్ చేశారు. పార్టీ చేద్దాం పుష్ప అంటూ.. ఓ ప్రోగ్రాం చేశారు. అందులో తన లవ్ స్టోరీని చెప్పేశాడు. ఓ పర్ఫామెన్స్ చేస్తూ తన ప్రేమకథను చెప్పేశాడు.
Jabardasth Kiraak RP Shares His Love Story In Party cheddham Pushpa
సెల్ఫీ కోసం ఆమె తన వద్దరకు వచ్చిందని, వెంటనే ఫోన్ నంబర్ ఇస్తావా? అని అడిగాడట. అలా వారిద్దరి మధ్య ప్రేమ పుట్టేసిందట. కానీ ఇంట్లో వాళ్లు మాత్రం ప్రేమకు ఒప్పుకోలేదట. దీంతో అందరి కాళ్లు పట్టుకుని మరీ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చేశాడట. అలా అందరి సమక్షంలో మరోసారి నిశ్చితార్థం చేసినట్టు కనిపిస్తోంది. కిరాక్ ఆర్పీ మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. కానీ పెళ్లి డేట్ మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం కిరాక్ ఆర్పీ జోడి అదరగొట్టేసింది. రొమాంటిక్ పర్ఫామెన్స్‌తో అందరినీ మెప్పించేశాడు. ఇక కిరాక్ ఆర్పీ చేసిన పనికి నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.