Home » Entertainment » Jabardasth Rocking Rakesh And Jordar Sujatha Love Story
Entertainment

Jabardasth Rocking Rakesh : అయితే.. జబర్దస్త్‌ రాకేష్ జోర్దార్‌ సుజాత లవ్ లవ్‌ నిజమే అంటావా?

Authored By
Himanshi
The Telugu News | Updated on: February 15, 2022, 4:20 pm
Advertisement

Jabardasth Rocking Rakesh : జబర్దస్త్ ప్రారంభం అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఇటీవలే 9 ఏళ్లు పూర్తి చేసుకున్న జబర్దస్త్ ఇంకా కూడా సక్సెస్ ఫుల్ కామెడీ షో గానే దూసుకు పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జబర్దస్త్ షో లో మొదట అమ్మాయిలు కనిపించ లేదు. అమ్మాయిల పాత్రలను అబ్బాయిలే చీరలు కట్టుకొని వేసేవారు. కానీ కాల క్రమేణా పెరిగిన పోటీ నేపథ్యంలో అమ్మాయిలను రంగంలోకి దించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా అమ్మాయిల కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎంతో మంది అమ్మాయిలు జబర్దస్త్ స్టేజీపై సందడి చేశారు. రాకింగ్ రాకేష్ తో కలిసి మొదట రోహిణి కామెడీ చేయగా ప్రస్తుతం సుజాత కామెడీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

రాకేష్ మరియు సుజాత ల కాంబినేషన్ లో కామెడీ బాగుంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే ప్రచారం మొదలైంది. ఇద్దరికి సంబంధించి స్కిట్స్‌ సమయంలో లవ్ సింబల్స్ వేసి వీరి ప్రేమ ను ప్రమోట్ చేసేలా జబర్దస్త్ ఎడిటర్స్ కష్టపడుతున్నారు. అయితే ఇమాన్యుల్ – వర్ష మరియు సుధీర్ – రష్మీ ల ప్రేమ మాదిరిగానే సుజాత రాకేష్‌ ల ప్రేమ అయి ఉంటుందని ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా రాకేష్ తాజా ఎపిసోడ్ లో మాట్లాడుతూ తనకు సుజాత అంటే ప్రాణం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన అమ్మ తర్వాత అమ్మ సుజాత అని అతడు చేసిన వ్యాఖ్యలు అతడి ప్రేమలో నిజాయితీ చూపిస్తున్నాయి. అంతే కాకుండా సుజాత కూడా మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా ప్రేమను తేల్చేసింది.తనకు నాన్న అంటే చాలా ఇష్టం.. నాన్న స్థానంలో రాకేష్‌ ఉండి నాకు ప్రేమను అందిస్తాడనే నమ్మకం ఉంది.

jabardasth rocking rakesh and jordar sujatha love story

Advertisement

నాన్న స్థానంలో రాకేష్‌ ఉండి నాకు ప్రేమను అందిస్తాడనే నమ్మకం ఉంది. అందుకే అతడి ప్రేమ ఆస్వాదిస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంటే ఆమెకు కూడా ఇష్టం ప్రేమ ఉంది అని క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరూ నిజంగా ప్రేమ లో ఉన్నట్లుగా తేలిపోయింది. కానీ ఇప్పటి వరకు జబర్దస్త్ స్టేజి పై ఎన్నో ఫేక్ లవ్ స్టోరీ లు సృష్టించడం వల్ల అసలైన లవ్ స్టోరీ అయినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా రాకేష్ మరియు సుజాత అది నిజమైన ప్రేమ అయ్యి ఉంటుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి అయ్యే వరకు వారి ప్రేమను సగం మంది అనుమానంగానే చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జబర్దస్త్ వారు ప్రేమ అంటే నమ్మకం పోయేలా చేశారు. ఎవరిది నిజమైన ప్రేమ ఎవరిది ఫేక్ ప్రేమ అనేది క్లారిటీ లేకుండా అయిపోయింది. అందుకే సుజాత రాకెట్ల ప్రేమ వ్యవహారం క్లారిటీ వచ్చినా కూడా నమ్మకం కలగటం లేదంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి