Home » Entertainment » Jabardasth Rohini Breakup Story In Mana Oori Rangasthalam
Entertainment

Jabardasth Rohini : రోహిణి బ్రేకప్ స్టోరీ.. వామ్మో అంత మోసం జరిగిందా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 3, 2022, 4:02 pm
Advertisement

Jabardasth Rohini : బుల్లితెరపై రోహిణికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీరియల్స్‌లో కామెడీ పాత్రలు చేస్తూ వచ్చేది. ఆ తరువాత బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్లో రోహిణి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ ఇంట్లో శివ జ్యోతి, రోహిణి, అషూ, రవికృష్ణ ఇలా అందరూ ఒకే గ్యాంగ్‌లో ఉండేవారు. బయటకు వచ్చాక కూడా కలిసే ఉన్నారు. హిమజ, రోహిణి, శివజ్యోతి బాగానే సందడి చేస్తుంటారు. ఈ మధ్య రోహిణి ఎక్కువగా మల్లెమాల ఈవెంట్లలోనే కనిపిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆమె వేసే స్కిట్లు, స్టెప్పులు వైరల్ అవుతుంటాయి.

Advertisement

ఇక ఆ మధ్య జబర్దస్త్ షోలో అయితే ఆమెకు ప్రత్యేకంగా ఓ టీం కూడా ఇచ్చారు. మధ్యలో కొన్ని స్కిట్లకు టీం లీడర్‌గానూ వ్యవహరించింది. కానీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయింది. గలాట గీతూ, రోహిణి ఇలా అందరూ కలిసి ఓ టీంగా స్కిట్లు చేస్తుండేవారు. రోహిణిని ఎక్కువగా ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కౌంటర్లతో ఆడుకుంటూ ఉంటారు. లావుగా ఉందని, అంద విహీనంగా ఉందన్నట్టుగా సెటైర్లు వేస్తుంటారు. కానీ రోహిణి మాత్రం వాటిని పట్టించుకోదు. నెట్టింట్లో రోహిణి ఫుల్ బిజీగా ఉంటుంది. తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది.

Jabardasth Rohini Breakup Story in Mana Oori Rangasthalam

Advertisement

ఎప్పుడూ అందరినీ నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక ఆమె తన యూట్యూబ్ చానెల్‌లోనూ రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రోహిణి జీ తెలుగు ఈవెంట్లో కనిపించింది. మన ఊరి రంగస్థలం అంటూ జరపబోతోన్న ఈవెంట్లో రోహిణి తన బ్రేకప్ స్టోరీని చెప్పేసింది. ఒకరిని రోహిణి డీప్‌గా లవ్ చేసిందట. అతను కూడా ఆమెను బాగానే లవ్ చేశాడట. కానీ ఓ ఆరు నెలల తరువాత తనకు అసలు విషయం తెలిసిందట. ఆల్రెడీ అంతకు ముందు నుంచే అతనికి వేరే అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉండేదట. మొత్తానికి అలా మోసపోయానంటూ చెప్పకనే చెప్పేసింది రోహిణి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి