KGF Movie and hero yash inspired serial killer in madhya pradesh
KGF Movie : సినిమా అనేది సమాజం మీద అధికంగా ప్రభావం చూపిస్తుంది, సినిమాలో చూపించినట్లుగా తామ చేయాలని.. సినిమాలో కనిపించినట్లుగా తాము కనిపించాలని యువత భావిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా సినిమాలను చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా జరుగుతుంది. కనుక సమాజం తప్పుదోవ నడవకుండా ఉండేలా సినీ మేకర్స్ బాధ్యతహితంగా సినిమాలను తీయాలంటూ పెద్దలు అంటూ ఉంటారు. ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా హింసాత్మక సన్నివేశాలతో సినిమాలను తీయడం, యువత పెడద్రోవ పట్టే విధంగా అసాంఘిక కార్యక్రమాలను సినిమాల్లో చూపించడం పరిపాటి అయింది..
తాజాగా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ అనే 19 ఏళ్ల కుర్రాడు వరుసగా నలుగురి సెక్యూరిటీ గార్డులను చంపేశాడు. మొదట హత్యలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో పోలీసులకు అర్థం కాలేదు. ఇటీవలే పోలీసులు వరుస హత్యలకు పాల్పడుతున్న శివ ప్రసాద్ ని పట్టుకున్నారు. అతడిని ఎంక్వయిరీ చేసిన సమయంలో అతడు చెప్పిన విషయాలకు పోలీసులు నోరు వెళ్ళ బెట్టారు. నీతో ఎలాంటి సంబంధం లేని ఆ నలుగురిని ఎందుకు నువ్వు చంపావు వారితో ఏమైనా గొడవ ఉందా నీకు అంటూ పోలీసులు ప్రశ్నించగా వారితో తనకు ఎలాంటి గొడవ లేదని వారు తనకు తెలియనే తెలియదు అని అతడు చెప్పాడు.
KGF Movie and hero yash inspired serial killer in madhya pradesh
మరి ఎందుకు చంపావు అంటూ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అప్పుడు శివ ప్రసాద్ అసలు విషయాన్ని చెప్పాడు. తనకు కేజీఎఫ్ సినిమా అంటే ఇష్టమని అందులో రాఖీ బాయ్ ఎలా అయితే గ్యాంగ్‌స్టర్ గా మారాడు తాను కూడా అలాగే గ్యాంగ్‌స్టర్ గా మారాలి అనుకొని వరుస హత్యలు చేస్తున్నానని, అలా చేయడం వల్ల తాను బయటకు వెళ్ళినప్పుడు నలుగురు భయపడతారని అలా తాను రౌడీగా గ్యాంగ్ స్టర్ గా మారినట్లు అవుతుందని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. అతడి మాటలకు పోలీసులు మాత్రమే కాకుండా ఇప్పుడు దేశం మొత్తం నోరు వేళ బెడుతోంది. మరి కేజిఎఫ్ టీం ఈ క్రైమ్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.