jabardasth : ఆమె వల్ల అందరూ చచ్చిపోతోన్నారు.. ఇంద్రజపై రోజా సంచలన కామెంట్లు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 26, 2021, 5:50 pm

jabardasth  : జబర్దస్త్ జడ్జిగా రోజా చేసే సందడి మాములుగా ఉండదనే తెలిసిందే. స్కిట్స్ జడ్జ్‌మెంట్ ఇవ్వడమే కాకుండా.. మధ్యలో ఆమె పంచులు కూడా వేస్తుంది. అయితే కొందరు మాత్రం రోజా ఓవర్ చేస్తుందని.. మరికొందరు మాత్రం ఆమె చేసే కామెంట్స్ భలేగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్కిట్స్‌లో కనిపించి సందడి చేస్తుంది. ముఖ్యంగా ఆది స్కిట్స్‌లో పలుమార్లు కనిపించిన రోజా.. అలరించిందనే చెప్పాలి. అలాగే స్పెషల్ ఈవెంట్స్‌లో రోజా ఫుల్ జోష్‌లో అందరిపై పంచులు వేస్తుంది.

తాజాగా హైపర్ ఆది స్కిట్‌లో కనిపించిన రోజా.. ప్రియమణి, ఇంద్రజ, పూర్ణ, మన్నార్ చోప్రాపై సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఇటీవల రోజాతో పాటు వీరు నలుగురు దీపావళి స్పెషల్ ఈవెంట్ తగ్గేదెలేలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక, ఆది స్కిట్‌లో అత్త క్యారెక్టర్ చేసిన రోజా.. సామి సామి సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె వద్దకు వచ్చిన అనసూయ.. మీ ఐదుగురు హీరోయిన్స్ కలిసి చేసిన కామెడీ గురించి చెప్పండి అని ప్రశ్నించింది.

jabardasth roja sensational comments on indraja

jabardasth roja sensational comments on indraja

jabardasth : ఇంద్రజపై రోజా సెటైర్లు..

‘ప్రియమణి ఉందే ఒక్కసారి మదర్ క్యారెక్టర్ చేసినందుకు మదర్ థెరిసా కన్నా పెద్దదాన్ని చేసింది. ఇంద్రజ ఏమో చాలా స్వీటుగా మాట్లాడింది.. ఆ స్వీట్‌కు సెట్‌లో ఉన్న అందరికి షుగర్ వచ్చి అందరూ చచ్చిపోయేలా ఉన్నారు. పూర్ణ ఉందే ఆమె మీద పంచ్ వేసిన వేస్ట్.. ఎందుకంటే అర్ధం కాదుగా. మన్నారా చోప్రా ఓన్లీ దేకుంగి.. మేము కరుంగి’ అని రోజా అందరిపై పంచులు వేసేసింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp