Jabardasth Shabeena : ఆయనతో మొదటి సారి చేశా!.. పెళ్లి కాక ముందే కాబోయే మొగుడితో జబర్దస్త్ షబీనా రచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Shabeena : ఆయనతో మొదటి సారి చేశా!.. పెళ్లి కాక ముందే కాబోయే మొగుడితో జబర్దస్త్ షబీనా రచ్చ

Jabardasth Shabeena : జబర్దస్త్ బ్యూటీ షబీనా గురించి పరిచయం అక్కర్లేదు. ఆ మధ్య కెవ్వు కార్తీక్‌తో ట్రాక్ నడిపించింది. కలిసి రీల్ వీడియోలు చేసేవారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తెగ సందడి చేసేవారు. ఇక ఆ తరువాత పొట్టి నరేష్‌తో షబినా ట్రాక్ వేయించారు. అది వర్కవుట్ అవ్వదని అందరికీ తెలిసినా.. ఏదో ఒకటి క్రియేట్ చేశారు. అలా జబర్దస్త్ షోలో నరేష్ షబినా కలిసి కొన్ని ఫన్నీ స్కిట్లు చేశారు. షబినా బుగ్గలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,7:40 pm

Jabardasth Shabeena : జబర్దస్త్ బ్యూటీ షబీనా గురించి పరిచయం అక్కర్లేదు. ఆ మధ్య కెవ్వు కార్తీక్‌తో ట్రాక్ నడిపించింది. కలిసి రీల్ వీడియోలు చేసేవారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తెగ సందడి చేసేవారు. ఇక ఆ తరువాత పొట్టి నరేష్‌తో షబినా ట్రాక్ వేయించారు. అది వర్కవుట్ అవ్వదని అందరికీ తెలిసినా.. ఏదో ఒకటి క్రియేట్ చేశారు. అలా జబర్దస్త్ షోలో నరేష్ షబినా కలిసి కొన్ని ఫన్నీ స్కిట్లు చేశారు. షబినా బుగ్గలు గిల్లుతూ ఆమె ఒళ్లో కూర్చుంటూ నరేష్ కాస్త ఓవర్ యాక్షన్ చేసేవాడు. మొత్తానికి షబినా మాత్రం బాగానే ఫేమస్ అయింది. అంతకు ముందు బుల్లితెరపై సీరియల్స్ చేసినా కూడా ఇంత గుర్తింపు అయితే రాలేదు…

కస్తూరీ సీరియల్‌లో షబినాకు మంచి పాత్ర దక్కింది. పొట్టి బట్టల్లో కనిపిస్తూ అందాలు ప్రదర్శించే ఆ పాత్రలో బాగానే నటించింది షబినా. ఆ తరువాత ఆ క్రేజ్‌తో గృహలక్ష్మీ సీరియల్‌లో కొన్ని రోజులు నటించింది. ఓ స్పెషల్ పాత్రను పోషించి కొన్ని వారాల పాటు ఆ సీరియల్లోనూ కనిపించింది. అయితే బుల్లితెరపై ధారావాహికలతో మాత్రం షబినాకు అంతగా గుర్తింపు రాలేదు. స్పెషల్ ఈవెంట్లు, జబర్దస్త్ షోలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక చివరకు ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 17న ఈ బ్యూటీని నిశ్చితార్థం అయింది. ఈ విషయాన్ని షబినా తన ఇన్ స్టాగ్రాం వేదికగా ప్రకటించింది. ఎంతో స్పెషల్ మెమరబుల్ డే అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది.

Jabardasth Shabeena First Reel With Her Fiancee Munna

Jabardasth Shabeena First Reel With Her Fiancee Munna

Jabardasth Shabeena : కాబోయే భర్తతో షబినా సందడి..

ఎంగేజ్మెంట్ రింగులను కూడా చూపించింది. దాంతో పాటు తనకు కాబోయే భర్త పేరుని కూడా ట్యాగ్ చేసింది. మున్నా రాక్ అంటూ ఓ ఇన్ స్టా ఐడిని కూడా షబినా ట్యాగ్ చేసింది. అలా మొత్తానికి తనకు కాబోయే భర్త వివరాలను అలా చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈ జంట రోడ్ల మీద షికార్లు కొడుతోంది. పెళ్లి కాక ముందే ఇలా చక్కర్లు కొట్టేస్తున్నారు. తనకు కాబోయే భర్తతో ఇలా మొదటి సారిగా రీల్ చేస్తున్నా.. అంటూ షబినా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ ఇద్దరూ బైకులో లాంగ్ డ్రైవ్ వెళ్తోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు రీల్ వీడియోలు చేయడమే ట్రెండ్ అన్న సంగతి మరోసారి షబినా గుర్తు చేసింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది