Home » Entertainment » Jabardasth Show Anarchy Is True Kirak Rp Interview Seen
Entertainment

Jabardasth Kiraak RP : జబర్దస్త్ షో అరాచకాలు నిజమే.. కిరాక్ ఆర్ పి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అర్థమైంది..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 15, 2022, 1:20 pm
Advertisement

Jabardasth Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో ఈ షోలో చేసే కామెడీతో అందర్నీ అలరిస్తారు. ఈ ప్రోగ్రాం ఎంతో పాపులర్ అయింది. దీనిని మొదట్లో నాగబాబు, రోజా గారు జడ్జెస్ గా చేశారు. తర్వాత కొన్ని ఎపిసోడ్లు తర్వాత ఇలా చాలామంది మారారు. ఈ ప్రోగ్రాం లో చేసే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా. నవ్వుకోవాల్సిందే. ఈ ప్రోగ్రాం ఎన్నో ఏండ్ల గా వస్తూనే ఉన్నది. దీనికి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఆ ప్రోగ్రాం నుంచి చాలామంది కమెడియన్స్ బయటికి వచ్చేసారు. వేరే ప్రోగ్రాములు చేసుకుంటున్నారు. అయితే ఇది ఇలా ఉండగా, కిరాక్ ఆర్ పి జబర్దస్త్ పై కొన్ని ఆరోపణలు చేశాడు. జబర్దస్త్ ప్రోగ్రాం గురించి అలాగే ప్రసాద్ రెడ్డి గురించి, అలాగే మల్లెమాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నేను చెప్పేది అంతా నిజమే అన్నాడు. రాకేష్ మాస్టర్ నాకు ఈ షోలో చాలా అనుభవం ఉంది. అని అన్నాడు. నేను పది ఎపిసోడ్లలో ఉన్నాను.

Advertisement

నాకు అన్ని తెలుసు అని వివరంగా చెప్తాడు. ఈ ప్రోగ్రాం చేసే అరాచకాలు బయట పెట్టేశాడు. ఆర్ పి చెప్పేదంతా నిజమే అక్కడ పెట్టే భోజనం చాలా దరిద్రంగా ఉండేది. నేను భాస్కర్ టీం లో ఉండేవాడిని, నన్ను భాస్కర్ బాబాయ్ అని పిలుస్తూ ఉండేవాడు. మా బాబాయ్ ని సరిగా చూసుకోండి భోజనం మంచిగా పెట్టండి. అంటూ ఉండేవాడు. నేను రమ్మంటే వచ్చాడు తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేవాడు. అయితే ఒకరోజు భాస్కర్ రాలేదు. భోజనం లేట్ అయింది. అయితే నేను వెళ్లి అక్కడ క్యూలో నిలుచున్నాను. అక్కడ వడియాలు బారుగా, గొట్టల్లాగా ఉన్నాయి. అలాగే సాంబార్ కూడా దారుణంగా ఉన్నది. భోజనం చాలా దరిద్రంగా ఉన్నది.

Jabardasth show Anarchy is true Kiraak RP interview seen

Advertisement

ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు, కిరాక్ ఆర్ పి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అర్థమైంది. అక్కడ ఫుడ్ బావుంటే బయట ఫుడ్ ఎందుకు తెచ్చుకుంటారు. భాస్కర్ బయట నుంచి తనకు తన టీంకు ఫుడ్ తెప్పించేవాడు. ఈ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ప్రసాద్ కి అమ్మాయిలు అంటే పిచ్చి, అమ్మాయిలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. డైరెక్షన్ టీం కూడా సరిగా ఉండేది కాదు. అలాగే అక్కడికి డైరెక్టర్ వస్తే అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. లేచి నిలబడాలి అని అనేవాడు. ఒకరోజు రిహాసల్స్ కి పిలిచి రోజు మొత్తం వెయిట్ చేయించాడు. ఆయన అమ్మాయిలతో మాత్రం సోషల్ మీడియా లైవ్ ప్రోగ్రాం చేసుకునేవాళ్లు, అక్కడే వాళ్లను ఒక రేంజ్ లో క్లాస్ పీకాను, ఇది ఇలా ఉండగా డి ప్రోగ్రాం టైంలో శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు అక్కడికి వచ్చేవాడు. కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్లో మాత్రం ఏ రోజు నాకు కనిపించలేదు. అని రాకేష్ మాస్టర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి బయటపెట్టేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి