Home » Entertainment » Neetu Chandra Said That She Was Offered By A Business Man
Entertainment

Neetu Chandra : నెల‌కు పాతిక ల‌క్ష‌లు ఇస్తా, భార్య‌గా ఉండ‌మ‌న్నాడు అంటూ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: July 15, 2022, 12:40 pm
Advertisement

Neetu Chandra : ఇటీవ‌లి కాలంలో చాలా మంది హీరోయిన్స్ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. 2003లో మంచు విష్ణు హీరోగా పరిచయమవుతూ విష్ణు టైటిల్ తో మూవీ విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంతో నీతూ చంద్ర నటిగా వెండితెరకు పరిచయయ్యారు. తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గోదావరి చిత్రంలో కీలక రోల్ చేశారు. అలాగే రాజశేఖర్ సత్యమేవ జయతే మూవీ చేయడం జరిగింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ మనం మూవీలో ఎయిర్ హోస్టెస్ గా కనిపించింది.

Advertisement

నీతూ చంద్ర చివరిగా కనిపించిన తెలుగు చిత్రం మనం కావడం విశేషం. బాలీవుడ్‌లో ఓ లెవల్‌ వరకూ వెళ్లిన నటి నీతూ చంద్ర క్యారెక్టర్స్‌ పోషించడానికి కూడా ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. అయితే ఇప్పుడు మాత్రం తన దగ్గర ఎలాంటి సినిమా అవకాశాలూ, డబ్బూ లేవని నీతూ చెబుతోంది. ఇదే అదునుగా ఓ బిజినెస్‌మ్యాన్‌ తనను నెలవారీ జీతం కింద భార్యగా రమ్మన్నట్లు కూడా ఆమె చెప్పడం విశేషం. నేను గొప్ప గొప్ప నటులతో పని చేశాను. వారిలో 13 మంది నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాను. అలాంటి నాకు ఇప్పుడు సినిమాలు లేవు. ఓ వ్యాపార వేత్త శాలరీడ్ వైఫ్ గా ఉండమన్నాడు. తన భార్యగా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానన్నాడు.

neetu chandra said that she was offered by a business man

Advertisement

Neetu Chandra : నీతూ సంచ‌ల‌న కామెంట్స్..

నా నిస్స‌హాయ‌త చూసి ఇలాంటి ఆఫ‌ర్స్ ఇవ్వ‌డం చాలా బాధ క‌లిగించింది. మంచి సినిమాల‌లో న‌టించినా కూడా నాకు ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం బాధంగా ఉంది. ఓ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ అయితే ఆడిషన్‌ సమయంలోనే అంటే ఒక గంటలోనే నన్ను వద్దని చెప్పాడు. అతని పేరు నేను చెప్పదలచుకోలేదు. సారీ నీతూ.. వద్దు అని చెప్పాడు. నన్ను ఆడిషన్‌ చేసి మరీ నా కాన్ఫిడెన్స్‌ దెబ్బతీయడానికి నో చెబుతారా అంటూ నీతూ ప్రశ్నించింది. బీహార్ కి చెందిన నీతూ చంద్ర గరం మసాలా, ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, అపార్ట్మెంట్ 13 బి చిత్రాల్లో నటించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి