Jabardasth Varsha : ఫైమా.. వర్ష ల్లో ఎవరికి ఎక్కువ పారితోషికం తెలుసా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 May 2022, 10:00 am

Jabardasth Varsha : జబర్దస్త్ లో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్ వర్ష మరియు ఫైమా. వీరిద్దరూ కూడా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో కొనసాగుతున్నారు. వర్ష కి ఇమాన్యుల్ వల్ల గుర్తింపు వచ్చింది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇమాన్యుల్ తో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా చేస్తోంది. ఎన్ని చోట్ల చేసినా కూడా ఆమె పారితోషికం ఎంత అంటే చాలా కొంతే అనేది చాలా మంది అభిప్రాయం. గతంలో సీరియల్స్లో నటించిన ఈమె ఈ మధ్య కాలంలో పూర్తిగా జబర్దస్త్ పరిమితమైంది. అప్పుడప్పుడు బయట స్టేజీ కార్యక్రమాల్లో కనిపిస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వర్ష ఈ మధ్య కాలంలో కాస్త ఫేడ్‌ ఔట్‌ అవుతుంది. అందుకు కారణం ఫైమా అనే టాక్ ప్రముఖంగా వినిపిస్తుంది. వీరిద్దరూ కలిసి ఒకే స్కిట్ లో ఉంటే పూర్తిగా వర్ష ని ఫైమా డామినేట్‌ చేస్తూ వస్తుంది. తన టాలెంట్ తో ఫైమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. కనుక ఈటీవీ మల్లె మాల వారు ఈమెతో సంవత్సరపు అగ్రిమెంట్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమతో సుదీర్ఘ కాలం పాటు కంటిన్యూ అవ్వాలి అనుకునే వారికి పారితోషికం కూడా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి సంవత్సరంపాటు అగ్రిమెంట్ చేసుకొని తమతోనే ఉంచుకోవాలని జబర్దస్త్ వారు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక టాక్ ఉంది.

Jabardasth Varsha and faima remuneration for episode

Jabardasth Varsha and faima remuneration for episode

ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ కి ఫైమా కు రూ. 50 వేల రూపాయలు ఇచ్చి మరీ అగ్రిమెంట్ చేసుకొని తమ వద్ద ఉంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వర్ష విషయానికి వస్తే ఆమెకు ఇప్పటికి కూడా రోజు వారి రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట. ఒక్కో ఎపిసోడ్‌ కు 10 వేల నుండి 15 వేల రూపాయల వరకు ఆమె దక్కించుకున్నట్లు బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రోజా మరియు ఇతర జబర్దస్త్ టీం మెంబర్స్ అందరికీ కూడా ఫైమా కామెడీ అంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆమెకి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసి మల్లెమాల వారు అగ్రిమెంట్ చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. వేరే ఛానల్ కు వెళ్ళిపోకుండా ఆమెను కాపాడుకోవాలని మల్లెమాల వారు అగ్రిమెంట్ తో రెడీ అయ్యారట.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి