
Jabardasth Varsha emotional video
Jabardasth Varsha : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు అయ్యారు. ఒకప్పుడు జబర్దస్త్ లో మగవాళ్ళు మాత్రమే కమెడియన్స్ గా నటించేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ కూడా తమెంటో నిరూపించుకుంటున్నారు. మగవాళ్లే కాదు మేము కూడా నవ్వించగలం అని వాళ్లకు పోటీగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లలో ఒకరు జబర్దస్త్ వర్ష. ఈ షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక జబర్దస్త్ లో మరొక కమెడియన్ ఇమ్మాన్యూయల్ టీం లో లేడీ కమెడియన్గా వర్ష ఫుల్ పాపులర్ అయింది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే వర్ష పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇక వర్ష సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో కొంచెం వర్ష ఎమోషనల్ అయినట్లుగా కనిపిస్తుంది.
Jabardasth Varsha emotional video
తాజాగా వర్ష సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. తాను అప్పుడే గుడికి వెళ్లి వచ్చానని తనకోసం ఓ అభిమాని నెలరోజులుగా అక్కడే తిరుగుతున్నాడని, తనను కలవడానికి సెక్యూరిటీ వాళ్లు నిరాకరించారని చెప్పుకొచ్చింది. అయితే వర్ష ఎమోషనల్ అవుతూ నాపై ప్రేమ ఇష్టం ఉంటే దయచేసి ఇలా చేయకండి, నా కోసం ఇలా టైం వేస్ట్ చేసుకోకండి, ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను, అంతేకానీ ఇలా టైం వేస్ట్ చేసుకోకండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…
Poha | ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…
This website uses cookies.