Jabardasth Varsha : లంగా ఓణిలో నిండైన అందంతో మెరిసిపోతున్న వ‌ర్ష‌.. ఆ అందానికి మంత్ర ముగ్ధులు కావ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: February 12, 2022, 10:00 am

Jabardasth Varsha : తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప‌రిచ‌యం అవుతున్నారు. ముఖ్యంగా జ‌బ‌ర్ధ‌స్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తో మంచి పాపుల‌రాటీ తెచ్చుకుంటున్నారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో వర్ష ఒకరు. చాలా రోజులుగా ఆ షోలో సందడి చేస్తోన్న ఆమె అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ప‌రికిణీలో హోయ‌లు పోతూ అంద‌రిని మంత్ర ముగ్ధులు చేసింది. లంగా ఓణీలో ఈ ముద్దుగుమ్మ అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు అందులో బిజీగా గడిపింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింంది. ఈ క్రమంలోనే ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో చేస్తోంది. వీటిలో అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ సత్తా చాటుతోంది. గెస్టుగా జబర్ధస్త్‌లోకి ప్రవేశించిన వర్ష.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Jabardasth Varsha glamorous pics viral

Jabardasth Varsha glamorous pics viral

Jabardasth Varsha : వ‌ర్ష అందాల ఆర‌బోత‌…

ప్ర‌స్తుతం వ‌ర్ష క్రేజ్ మాములుగా లేదు. పలు స్పెషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. వీటితో పాటు అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ అనే షోలోనూ భాగమైంది. రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.వీరిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతాయి.

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp