Jagapathi Babu : రామ్ గోపాల్ వర్మ‌ను అంతమాటన్న జగపతిబాబు.. వీరిద్దరికి ఎక్కడ చెడిందంటే?

Authored By mallesh | The Telugu News | Published on: January 26, 2022, 4:30 pm

Jagapathi Babu : టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా పేరు గాంచిన జగపతిబాబు ప్రస్తుతం భయంకరమైన విలన్‌గా మారిపోయారు. స్టైలిష్ విలన్ రోల్స్ ప్లే చేస్తూనే అవసరమైతే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపైన విలనిజం పండించడంలో ఎక్స్‌పర్ట్ అయిపోయాడు జగ్గుభాయ్. ‘లెజెండ్’ చిత్రంతో విలన్‌గా బారిన జగపతి బాబు ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అప్పట్లో రొమాంటిక్ హీరోగా ఎంత పేరు సంపాదించుకున్నాడో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పేరు విలన్ గా నటించి సంపాదించుకున్నాడు జగ్గుభాయి.ఫ్యామిలీ హీరోగా సక్సెస్ అయిన జగపతిబాబు విలన్‌గానూ..సక్సెస్ అయ్యాడు.

అలా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జగపతిబాబు దూసుకుపోతున్నాడు. ఇకపోతే జగపతిబాబు తన కెరీర్‌లో చాలా మంది డైరెక్టర్స్‌తో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తను వర్క్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ఊహించని కామెంట్ చేశాడు జగ్గుభాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గాయం’ సినిమా షూటింగ్ టైంలో తనకు, ఆర్జీవీకి మధ్య జరిగిన డిస్కషన్, వార్ గురించి జగ్గుభాయి చెప్పాడు.డైరెక్టర్ వర్మ ఒక తిక్కలోడని, తాను కూడా అలాంటి వాడినేనని అన్నాడు జగపతిబాబు. ‘గాయం’ ఫిల్మ్ షూటింగ్ టైంలో తాను వర్మ వద్దకు వెళ్లి ఊర్మిళకు,

jagapathi babu comments on rgv

jagapathi babu comments on rgv

Jagapathi Babu : హీరోయిన్ విషయమై ఇద్దరి మధ్య వార్..

తనకు మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడం లేదని చెప్పానని అన్నాడు. దాంతో వర్మ ఊర్మిళతో తనకు హీరోయిన్ అంటే ఇష్టం లేదని చెప్పేశాడు. అలా తనకు, ఊర్మిళకు మధ్య గొడవ పెట్టేశాడు వర్మ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనను ఊర్మిళ ఎందుకు నచ్చలేదో చెప్పాలని అడిగిందని గుర్తుచేసుకున్నాడు జగ్గుభాయి. ఈ క్రమంలోనే తానే మళ్లీ వర్మ వద్దకు వెళ్లి నీకు శ్రీదేవి అంటే ఇష్టం కానీ, నాకు శ్రీదేవి అంటే ఇష్టం లేదని చెప్పానని అప్పుడు.. వర్మ గుడ్ .. అందుకే నువ్వు నాకు ఇష్టం అని అన్నాడని జగపతి బాబు వివరించాడు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp