Salaar Movie : ‘సలార్’ ఫస్ట్ లుక్‌.. బీభత్సమైన అవతారంలో జగపతిబాబు.. పూనకాలు రావాలంతే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Salaar Movie : ‘సలార్’ ఫస్ట్ లుక్‌.. బీభత్సమైన అవతారంలో జగపతిబాబు.. పూనకాలు రావాలంతే..

Salaar Movie ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు jagapathi babu ‘లెజెండ్’ సినిమాకు ముందర అవకాశాలు లేక ఖాళీగానే ఉండిపోయారు. హీరోగా దాదాపు ఆయన కెరీర్ అయిపోయిన సమయంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.అంతే ఇక.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోనే బిజియెస్ట్ యాక్టర్ అయిపోయాడు. స్టైలిష్ విలన్‌గా మారిపోయి విలనిజానికి కేరాఫ్‌గా నిలిచాడు జగపతిబాబు jagapathi babu . టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అంతటా పలు సినిమాల్లో నిలిచిపోయే క్యారెక్టర్స్ ప్లే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 August 2021,12:15 pm

Salaar Movie ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు jagapathi babu ‘లెజెండ్’ సినిమాకు ముందర అవకాశాలు లేక ఖాళీగానే ఉండిపోయారు. హీరోగా దాదాపు ఆయన కెరీర్ అయిపోయిన సమయంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.అంతే ఇక.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోనే బిజియెస్ట్ యాక్టర్ అయిపోయాడు. స్టైలిష్ విలన్‌గా మారిపోయి విలనిజానికి కేరాఫ్‌గా నిలిచాడు జగపతిబాబు jagapathi babu .

jagapathi babu Salaar Movie First Look

jagapathi babu Salaar Movie First Look

టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అంతటా పలు సినిమాల్లో నిలిచిపోయే క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు జగపతి. తాజగా మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు జగపతి. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

భయంకరమైన ‘రాజమనార్’గా..  Salaar Movie First Look

‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టర్ ప్రభాస్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సలార్’ Salaar Movie . ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రంలో ‘రాజమనార్’గా జగ్గూభాయ్ నటించబోతున్నారు.

jagapathi babu Salaar Movie First Look

jagapathi babu Salaar Movie First Look

ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హోంబలె ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో జగపతిబాబు కనిపించనున్నారు. వైట్ గడ్డంతో బీడి కాలుస్తూ ఉన్న జగపతి బాబు లుక్ భయంకరంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే జగపతి బాబు ఈ సారి విలన్‌గా అదరగొడతారనే అనిపిస్తోంది. ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తి చేసింది మూవీ యూనిట్.

prashanth neel is going to you use same back drop for prabhas Salaar

prashanth neel is going to you use same back drop for prabhas Salaar

తెలంగాణలోని రామగుండంలో ప్రభాస్, శ్రుతి హాసన్‌పై పలు కీలక సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉండగా, తాజాగా రివీల్ అయిన ‘రాజమనార్’లుక్ తో ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేశారు మేకర్స్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో ‘బసిరెడ్డి’గా కనిపించారు జగపతిబాబు. ఆ సినిమాలో కంటే వైలెంట్ లుక్ ‘సలార్’లో ఉందని అనిపిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది