Home » Entertainment » Jagapati Babu Interesting Comments On Salaar Movie
Entertainment

Salaar Movie : ప్రభాస్ ఎంట్రీ కి ఇండియా మొత్తం షాక్ అవుతాది.. ‘ సలార్ ‘ సినిమాపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Authored By
aruna
The Telugu News | Updated on: December 21, 2023 9:01 pm
Advertisement

Salaar Movie : సలార్ మూవీ రివ్యూప్రభాస్ సలార్  సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ , టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. ఇప్పటికే అభిమానులంతా టికెట్ల కోసం పడి కాపులు కాస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులలో ఉత్కంఠత నెలకొంది. మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే సలార్ సినిమాలో నటించిన జగపతిబాబు ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Advertisement

జగపతి బాబు మాట్లాడుతూ. ఈ సినిమా కోసం నేను ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సాలీడ్ హిట్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో జగపతిబాబు చెప్పిన మాటలకు గూస్ బంప్స్ వస్తున్నాయి అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగపతిబాబు చేసిన రాజమన్నార్ పాత్ర క్యాలిక్యులేటేడ్ గా ఉంటుందని, నా పాత్ర లుక్ అద్భుతంగా ఉంటుందని, ఈ పాత్ర ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ అనేది చాలా స్పెషల్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఏదో తెలియని ఆసక్తి నెలకొంది అని జగపతిబాబు అన్నారు.

ఇంకా ప్రభాస్ గురించి చెబుతూ ప్రపంచంలో అందరికీ ప్రభాస్ డార్లింగే. ప్రభాస్ చాలా మంచివాడు ఆయనకు ఇవ్వటమే తప్ప తీసుకోవడం తెలియదు. అందరిని బంగారం, డార్లింగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం కాలంలో ప్రభాస్ చాలా అరుదైన వ్యక్తి. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్ వేరేలా ఉంటుంది. ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆర్టిస్టులను కూడా ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టారు. అతడితో వర్క్ చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది అని జగపతిబాబు అన్నారు. ఇక మలయాళ స్టార్ పృధ్విరాజ్ కూడా అద్భుత నటుడని ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుందని జగపతిబాబు తెలిపారు మొత్తానికి అయితే ఈ సినిమాపై జగపతిబాబు అంచనాలను పెంచేశారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి