janaki gives warning to mallika for her fake pregnency
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 14 నవంబర్ 2022, ఎపిసోడ్ 431 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ కళ్లు తిరిగి పడిపోవడంతో అందరూ టెన్షన్ పడిపోతారు. దీంతో ఇప్పుడే నీ బాధను తీర్చే పరిష్కారం చూస్తాను అని జానకి దగ్గరికి వెళ్లిన రామా.. తనను కేసు వాపసు తీసుకో అంటాడు. కానీ.. జానకి మాత్రం కేసు వాపసు తీసుకోను అంటుంది. అలా చేస్తే అఖిల్ ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తాడు అని చెబుతుంది జానకి. అయినా కూడా రామా వినకుండా తనను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లబోతాడు. దీంతో తన చేయిని వదిలేయాలంటూ సీరియస్ అవుతుంది జానకి.
janaki gives warning to mallika for her fake pregnency
దీంతో రామా తన చేయిని వదిలేస్తాడు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అందరి ముందే చెప్పేస్తుంది జానకి. దీంతో రామాకు ఏం చేయాలో తెలియక.. విష్ణును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లబోతాడు. దీంతో మేము కూడా వస్తాం అని ఇంట్లో వాళ్లంతా పోలీస్ స్టేషన్ కు బయలు దేరుతారు. జ్ఞానాంబ, జెస్సీ, గోవిందరాజు, రామా, విష్ణు.. అందరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐని బతిమిలాడుతారు. కానీ.. ఎస్ఐ మాత్రం వినడు. మా వాడిని ఎలా బయటికి తీసుకురావాలో చెప్పండి అంటాడు రామా.
దీంతో ఇప్పుడు ఏం చేయలేం. ఇప్పటికే అతడి మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది అంటాడు ఎస్ఐ. మీరు ఏదున్నా కోర్టులోనే తేల్చుకోవాలి అంటాడు. మీరు లాయర్ ను పెట్టుకొని కోర్టులో తేల్చుకోండి అంటాడు.
కోర్టులో తేల్చుకోవాలనేసరికి అందరూ షాక్ అవుతారు. నా తమ్ముడు కోర్టుకు వెళ్లకూడదు. నేరస్థుడిలా బోనులో నిలుచోకూడదు అంటాడు రామా. వాడిని ఇట్నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్లాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అంటాడు రామా.
మా అమ్మ.. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు అంటాడు. మీకు దండం పెడతాను. ఎలాగైనా మా తమ్ముడు బయటికి వచ్చే మార్గం చెప్పండి అంటాడు రామా. ఊళ్లో పరువుగల కుటుంబం మాది అంటాడు రామా.
అర్థం చేసుకొని మా తమ్ముడిని బయటికి పంపించండి సార్ అంటాడు. దీంతో ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక మా చేతుల్లో ఏం ఉండదు. మీరు ఒక లాయర్ ను పెట్టుకొని కోర్టులో చూసుకోవాల్సిందే అంటాడు ఎస్ఐ.
ఒక్కసారి మా అబ్బాయితో మాట్లాడి వెళ్తాం అంటాడు గోవిందరాజు. అందరూ అఖిల్ దగ్గరికి వెళ్తారు. అసలు నీ మీద ఈ నిందలు ఏంట్రా అని అడుతుంది జ్ఞానాంబ. దీంతో నువ్వు తలదించుకునే పని ఎన్నడూ చేయను అంటాడు అఖిల్.
నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను ఎలాగైనా బయటికి తీసుకురా అని జ్ఞానాంబను వేడుకుంటాడు అఖిల్. దీంతో ఏం చేయాలో జ్ఞానాంబకు అర్థం కాదు. మరోవైపు ఈ ఇంటి పెద్దకోడలు స్థానాన్ని అడ్డుపెట్టుకొని నీ తెలివి తేటలతో అత్తయ్య గారి ముప్పు పొంది నా బతుకు మునిసిపాలిటీ కుప్పదొడ్డి చేసేశావు కదా ఇన్నాళ్లు. బావ గారికి నీ మీద ఉన్న ఇష్టాన్ని నువ్వే అవుట్ చేసుకున్నావు అని జానకితో అంటుంది మల్లిక.
దీంతో నీ ఫేక్ ప్రెగ్నెన్సీ బయట పెట్టేలోపు అఖిల్ సమస్య ముందుకొచ్చింది అంటుంది జానకి. అది పరిష్కారం కాగానే నెక్స్ ట్ లైన్ లో నువ్వే అంటుంది జానకి. సిక్సే కొడితే స్టేడియం అవతల పడతావు అని మల్లికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Married Woman : వివాహేతర సంబంధాలు జీవితాలను చీల్చిపారేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ తరహా…
Fish Venkat : ఫిష్ వెంకట్ .. తన సినిమాలతో ఎంతో మెప్పించిన నటుడు. కానీ ఆ నటుడు చివరికి…
Jana Sena TDP : రాజకీయంగా కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆశించిన దిశలో సాగక, కూటమి పార్టీల…
Eatala Rajendar : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన స్వగ్రామం హుజురాబాద్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
Fish Venkat : పలు సినిమాల్లో కామెడీతో నవ్వులు పంచిన నటుడు ఫిష్ వెంకట్ Fish Venkat, తన చివరి…
YCP : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా మారుతున్నట్లు స్పష్టంగా…
Manchu Vishnu Ramayana : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రామాయణం ఆధారంగా రూపొందించబోయే సినిమా కోసం ఇప్పటికే ఓ…
Goat Milk Benefits : ప్రతి ఒక్కరు కూడా పాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది.గేదె పాలు, ఆవు పాలు.ఈ రెండు…
This website uses cookies.