janaki kalaganaledu 01 july 2022 full episode
Janaki Kalaganaledu 01 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 01 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 335 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన అసైన్ మెంట్ ను రాత్రంతా కూర్చొని పూర్తి చేస్తుంది జానకి. తన కోసం టీ చేసుకొని తీసుకొచ్చి ఇస్తాడు రామా. అల్లం టీ తాగండి. ఇది తాగాక.. మిమ్మల్ని నిద్ర పలకరించదు పారిపోతుంది అంటాడు రామా. దీంతో రామా గారు.. మనం ప్రేమించే వాళ్ల కంటే.. మనల్ని ప్రేమించే వాళ్లతో జీవితం బాగుంటుందని పెద్దవాళ్లు అంటారు. నన్ను ప్రేమగా చూసుకోవడంతో పాటు కంటిపాపగా చూసుకునే భర్త నాకు దొరికాడు. ఇది నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. మీరు నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అంటుంది జానకి. దీంతో ముందు టీ తాగండి అంటాడు రామా. దీంతో టీ తాగుతుంది జానకి. టీ చాలా బాగుంది అంటుంది జానకి. టీ కప్పు తీసుకొని బయటికి వెళ్తాడు రామా. ఇక చదువుకోండి అంటాడు రామా. మీరు పడుకోండి అంటుంది జానకి. దీంతో మీరు చదువుకోండి.. రాయండి రాసుకోండి అంటాడు రామా. తను చదువుకుంటూ ఉంటే.. తననే చూస్తూ ఉంటాడు రామా.
janaki kalaganaledu 01 july 2022 full episode
మీరు ఉదయం నుంచి లడ్డూలు చూస్తూ అలసిపోయారు. ముందు మీరు పడుకోండి అంటుంది జానకి. దీంతో ఏం మీరు మాత్రం ఖాళీగా ఉన్నారా? మీరు కూడా అలసిపోయారు కదా అంటాడు రామా. ఆ తర్వాత రాస్తూ రాస్తూ జానకి అలాగే నిద్రపోతుంది. రామా కూడా కూర్చొని అలాగే నిద్రపోతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. రామా నిద్రలేచి జానకిని చూస్తాడు. తను అలాగే నిద్రపోతూ ఉంటుంది. దీంతో తన చేతుల్లో ఉన్న పుస్తకాలను అన్నింటినీ తీసేస్తాడు. మెల్లగా తనను పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు రామా. దీంతో తను నిద్రపోతూ ఉంటుంది. ఓవైపు ఇంటి పనులు చేస్తూ మరోవైపు చదువుకుంటూ మీరు చాలా అలసిపోతున్నారు జానకి గారు అని మనసులో అనుకుంటాడు రామా.
మరోవైపు మల్లిక పొద్దెక్కినా కూడా ఇంకా పడుకొని ఉంటుంది. దీంతో ఇది ఇంకా పడుకొని ఉందా.. దీని తిక్క కుదుర్చాలని అనుకొని జ్ఞానాంబ వాయిస్ తో ఎంత సేపు పడుకుంటావే.. లే అంటాడు విష్ణు. నిజంగానే జ్ఞానాంబ పిలిచిందని అనుకొని వెంటనే లేస్తుంది మల్లిక. తీరా చూస్తే విష్ణు తనను నిద్రలేపాడని అనుకొని అతడిని కొట్టబోతుంది. ఇంతలో తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు విష్ణు.
కట్ చేస్తే.. నిద్రలేస్తుంది జానకి. లేచి చూసి షాక్ అవుతుంది. అసైన్ మెంట్ వర్క్ ఇంకా బాకీ ఉంది. అయ్యో ఎలా అని అనుకుంటుంది జానకి. రామా గారు మీరు ఏంటి చేసిన పని. నా అసైన్ మెంట్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. నన్ను ఎందుకు నిద్రలేపలేదు అని అడుగుతుంది.
మీ ఆరోగ్యం ఏమౌతుంది చెప్పండి. రాత్రంతా రాస్తూ కూర్చొన్నారు కదా అంటాడు రామా. కోడలుగా ఇంటి పని చేయడం నా బాధ్యత. చదువు నా కల. ఒకదాని కోసం మరొకటి నేను త్యాగం చేయలేను అంటుంది జానకి. దీంతో నాకు నా భార్య ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం జానకి గారు అంటాడు రామా.
నేను వెళ్లి స్వీట్స్ ఇచ్చి వస్తాను. ఈలోగా మీరు చకచకా రాసేసి.. టకటకా రెడీ అయి ఉండండి. వెంటనే వెళ్లి మనం ఆ కాగితాలు ఇచ్చేసి వద్దాం అంటాడు. ఇంతలో జ్ఞానాంబ పిలుస్తుంది. స్వీట్లు అన్నీ కారులో పెడతారు. విష్ణు, మల్లిక ఇద్దరూ కారులో వాటిని పెడతారు.
స్వీట్లు ఇచ్చి రావడానికి కారులో బయలుదేరుతాడు రామా. జానకిని ఎదురు రమ్మంటాడు. దీంతో జానకి ఎదురు వస్తుంది. మరోవైపు తన అసైన్ మెంట్ పూర్తి చేయడం కోసం తన రూమ్ లో కూర్చొని రాస్తుంటుంది జానకి. తన అసైన్ మెంట్ పూర్తవుతుంది.
మరోవైపు పాత పేపర్లను అమ్ముతూ ఉంటుంది మల్లిక. దీంతో రెండు కిలోలకు 100 గ్రాములు తక్కువవుతాయి. దీంతో ఉండు ఆ 100 గ్రాములకు పాత పేపర్లు ఏవైనా ఉంటే తీసుకొస్తా అంటుంది జానకి. ఇంట్లో అక్కడా ఇక్కడా వెతుకుతుంది. జానకి రూమ్ లో ఏవైనా బుక్స్ ఉన్నాయేమో చూద్దా అని తన రూమ్ కు వెళ్తుంది మల్లిక.
తన రూమ్ లో జానకి అప్పుడే రాసి అక్కడ పెట్టిన అసైన్ మెంట్ పేపర్లు కనిపిస్తాయి. దీంతో వాటిని తీసుకొని పాత పేపర్లలో కలిపి తీసుకెళ్తుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ తనకు ఎదురుపడుతుంది. తనను చూసి షాక్ అవుతుంది మల్లిక. ఏంటవి అని అడుగుతుంది.
దీంతో పాత పేపర్లు.. ఇల్లంతా చిందరవందరగా ఉన్నాయని అమ్మేస్తున్నాను అంటుంది మల్లిక. దీంతో సరే అని వెళ్లిపోబోతూ.. ఆగు అని అంటుంది జ్ఞానాంబ. ఆ కాగితాలు ఇలా ఇవ్వు అంటుంది జ్ఞానాంబ. ఎందుకు అత్తయ్య గారు అని అంటుంది మల్లిక.
దీంతో వాటిని చూస్తుంటే కొత్త కాగితాల్లా అనిపిస్తున్నాయి.. ఇలా ఇవ్వు అని చెప్పి జ్ఞానాంబ రాసిన అసైన్ మెంట్ పేపర్లను చూస్తుంది జ్ఞానాంబ. ఇంతలో అక్కడికి గోవిందరాజు వస్తాడు. ఒరేయ్ అఖిల్ ఇలారా అని పిలిచి.. ఈ కాగితాల్లో ఏదో రాసి ఉంది. ఇవి ఎవరివో ఒక సారి చూడు అని అఖిల్ కు చెబుతుంది జ్ఞానాంబ.
దీంతో అఖిల్ ఆ పేపర్లను చూస్తాడు. దాన్ని చదివి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
This website uses cookies.