Janaki Kalaganaledu 03 September 2022 Episode : జెస్సి ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయమంటున్న అఖిల్.. అఖిల్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన జానకి..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 3, 2022, 10:30 am

Janaki Kalaganaledu 03 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 381 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి నుండి తప్పించుకుని తిరుగుతు ఉంటాడు అఖిల్. అంతలో జెసి ఫోన్ చేసి జానకిని అక్క నేను మాట్లాడం అన్నది ఏం చేశావు మాట్లాడావా అని అడుగుతుంది. అప్పుడు జానకి నీకు నేను సరియైన న్యాయం చేస్తా.. నాకు ఆ ఫోటోలని పంపించావు కదా.. నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా చాటుగా చూస్తూ ఉంటాడు అఖిల్. అప్పుడు కంగారుపడుతూ జానకి ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలని జానకి పడుకున్న తర్వాత వాళ్ళ రూం లోకి వెళ్లి నెమ్మదిగా ఆ ఫోటోలను డిలీట్ చేసేసి బయటికి వస్తూ ఉండగా జ్ఞానంబ అఖిల్ ని చూసి ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతుంది. అప్పుడు నేను చదువుకుంటున్నాను అమ్మ అని ఒక డ్రామా ప్లే చేసి తనని నమ్మిస్తాడు. అప్పుడు ధ్యానం తనకోసం ఒక టీం చేసి తీసుకొని వచ్చి ఇస్తుంది.

అప్పుడు అఖిల్ తన ప్రేమను చూసి అమ్మకి నా ప్రేమ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే జానకి లేచి ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఫోన్ తీసుకొని ఫోన్లో ఉన్న ఫోటోలు చూస్తూ ఉండగా అవి డిలీట్ అయి ఉంటాయి. ఇందులో ఉన్న ఫోటోలు ఎలా డిలీట్ అయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. అఖిల్ అంతకుముందే జెసికి ఫోన్ చేసి నువ్వు మా వదినకి ఎందుకు అంత చెప్పావు అని తనని బెదిరిస్తూ.. నీ ఫోన్లో ఉన్న ఫోటోలను డిలీట్ చెయ్ జెస్సి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు జెసి అఖిల్ మీద ఉన్న ప్రేమతో తన చెప్పిన పనిని చేస్తుంది. తర్వాత జానకి మళ్ళీ జెసికి ఫోన్ చేసి ఫోటోలు పంపించావా నాకు రాలేదు అని అంటుంది. అప్పుడు పంపించాను కదా అక్క నా దాంట్లో నేను డిలీట్ చేశాను అని అంటుంది. అప్పుడు జానకికి అఖిల్ మీద అనుమానం వస్తుంది. అప్పుడు అఖిల్ దగ్గరికి వెళ్లి నువ్వు నా ఫోన్ లో ఫోటోలు ఎందుకు డిలీట్ చేసావ్. నాకు జరిగిందంతా జెస్సీ చెప్పింది. అని అంటుంది. అప్పుడు అఖిల్ ఏదో ఒక సాకు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు..

Janaki Kalaganaledu 03 September 2022 Full Episode

Janaki Kalaganaledu 03 September 2022 Full Episode

కానీ నోరు ముయ్… నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా.. ఎందుకు ఇట్లా చేస్తున్నావ్ నీ మీద మీ అన్నయ్య, మీ అమ్మానాన్నలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నీకేమైనా అర్థమవుతుందా.. నువ్వు ఈ పని చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించావా నీ తొందరపాటు నిర్ణయం వల్ల ఎన్ని జీవితాలు ఆగమవుతున్నాయో అర్థం అవుతుందా.. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్… మళ్లీ పై తిరిగి నువ్వు తప్పు చేసి తనని బలి చేశావు. మళ్లీ అదే కాకుండా మళ్ళీ తనని ప్రెగ్నెంట్ తీసేపిచ్చుకోమని చెప్తావా బుద్ధి లేదా అఖిల్ నీకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా నేను అత్తయ్య గారికి చెప్పేస్తాను.. నువ్వు తనని పెళ్లి చేసుకో అని చెప్తుంది. అప్పుడు అఖిల్ జానకి కాల మీద పడి వద్దు వదిన అమ్మకు చెప్పొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. కానీ జానకి వినదు జ్ఞానాంబకి చెప్పాలని వెళుతూ ఉంటుంది. మల్లిక విష్ణుని గాజులు తీసుకోవడానికి వెళ్దామని విష్ణుతో గొడవ పడుతూ ఉంటుంది.ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp