Janaki Kalaganaledu 05 August 2022 Episode : జ్ఞానంభ, జానకి చదువుకోడానికి పెట్టిన షరతులు రామ ఒప్పుకుంటాడా.?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 August 2022, 11:00 am

Janaki Kalaganaledu 05 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయ్యింది.358ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి తన చదువు ఆపేస్తాను అని రామాకు చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామ చదువు పుస్తకాలను తీసుకొని జ్ఞానంబ దగ్గరికి వెళ్లి అమ్మ ఇక నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జానకి చదువు ఆపేసింది. తన కలని చంపేసుకుంది. ఈ పెన్ను చూసావా.. వాళ్ళ నాన్న చనిపోయే ముందు నాకు ఇచ్చి నా కూతురు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ పెన్ను ఇవ్వు అని చెప్పాడు. అప్పుడు నాకు తెలియదు అమ్మ తన బాధ్యత అంతా నాకు ఇచ్చాడు అని. తను ఇప్పుడు కూడా తన కూతురి కల ఆగిపోయినందుకు బాధపడుతూ ఉంటాడమ్మా. నువ్వు నా గురించి భయపడటం లో అర్థం ఉంది. కానీ ఎప్పుడు అలాగే జరుగుతుంది.

అని ఎందుకు అనుకుంటావ్ అమ్మ.నీ కోడలు ఈ ఇంటి గౌరవాన్ని తన భర్త పరువు ని తీయదమ్మ. తను ఐపీఎస్ దూరమై జీవితాంతం బాధపడాలి అమ్మ. తను ఐపిఎస్ అయితే సమాజానికి మంచి జరుగుతుందమ్మ. నా భార్య చిరునవ్వు వెనక బాధను చూసి నేను ఎలా సంతోషంగా ఉండగలనమ్మా. అని అంటాడు రామ. గోవిందరాజు చూడు జ్ఞానం నేను మంచాన పడినప్పుడు రామ ఈ ఇంటి బాధ్యతలను భుజాలపై వేసుకొని తన చదువు ని త్యాగం చేశాడు. ఆ విషయం గురించి నువ్వు ఇప్పటికి బాధపడుతూనే ఉంటావు కదా.. మరి నీకు ఒక కన్న తండ్రి కల అర్థం కావడం లేదా జ్ఞానం అని అంటాడు. అప్పుడు రామ బుక్స్ తీసుకొని ఈ బుక్స్ తనకి ఉపయోగపడతాయి అనుకున్నాను.. కానీ పొట్లాలు కట్టడానికి ఉపయోగపడతాయని నేను అనుకోలేదు అని బాధపడుతూ అక్కడ నుంచి పుస్తకాలను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా.. జ్ఞానాంబ పిలిచి నేను జానకి చదువుకోడానికి ఒప్పుకుంటున్నాను.

Janaki Kalaganaledu 05 August 2022 Full Episode

Janaki Kalaganaledu 05 August 2022 Full Episode

అని అనగానే అందరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. కానీ మల్లిక షాక్ కి గురవుతుంది. ఇంతలో జ్ఞానంబ మళ్లీ జానకి, కొన్ని షరతులు ఒప్పుకుంటేనే, నేను జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటాను అని అంటుంది. అప్పుడు రామ చదువుకోడానికి షరతులు ఏంటమ్మా.. నీకోసమే నువ్వు ఒక మాట అన్నావు.. నా భార్య చిరునవ్వు వేనక బాధను చూసి నేను ఎలా సంతోషంగా ఉంటాను అన్నావు. నేను నా కొడుకు కోసం అలాగే బాధపడుతూ ఉన్నాను నా కొడుకు ఎక్కడ నా తమ్ముడు లాగా అవుతాడు అని నా భయం నాకు ఉంది అని అంటుంది. అప్పుడు జానకి జ్ఞానంబ దగ్గరికి వచ్చి. అత్తయ్య గారు ఈ ఇంటి కోసం ఈ ఇంటి గౌరవ ,మర్యాదల కోసం రామగారి కోసం నేను ఎలాంటి షరతులకైనా ఒప్పుకుంటాను అని అంటుంది.

అప్పుడు జ్ఞానాంబ నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు వి నా తర్వాత నువ్వే అన్ని బాధ్యతలు తీసుకోవాలి. నీ భర్త ప్రేమ అనురాగాలకి నీ చదువు అడ్డు కావద్దు. అలాగే ఈ ఇంటికి వారసులు ను ఇవ్వడానికి నీ చదువు అడ్డు కావద్దు. అలాగే ఈ ఇంటి గౌరవ, మర్యాదలకు మచ్చ తీసుకురావద్దు. అదేవిధంగా ఈ మధ్యన వెన్నెల విషయంలో జోక్యం చేసుకున్నావు. అలాంటి విషయాలలో నువ్వు తల దూర్చొద్దు. వీటిలో ఒక్కదాన్ని నువ్వు తప్పిన కూడా నేను ఆరోజు తీసుకునే నిర్ణయానికి నువ్వు తలవంచాలి. నన్ను ఎదురు ప్రశ్నించొద్దు. అని జ్ఞానాంబ జానకికి చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి