Janaki Kalaganaledu 08 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 384 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి, అఖిల్ విషయాన్ని జ్ఞానాంబకి చెప్పాలి అని చూస్తూ ఉంటుంది. అఖిల్ జానకి సైగలను చూసి మల్లిక, రామ వాళ్ళని అడుగుతారు. తర్వాత జ్ఞానాంబ కూడా ఏమైంది జానకి అని అడుగుతుంది. అప్పుడు జానకి అఖిల్ తన చదువు గురించి కంగారు పడుతున్నారు దాని గురించి తనకి చెప్తున్నాను నేను అనిఅంటుంది. అప్పుడు అఖిల్ చెప్పు వదిన అని సరిగా చేస్తూ ఉండగా జానకి జ్ఞానాంబకి చెప్పబోతూ ఉండగా.. అంతలో లీలావతి వస్తుంది. అప్పుడు జ్ఞానాంబ రా లీలావతి భోజనం చేద్దువు గాని అని అంటుంది. అప్పుడు నేను తినే వస్తున్న అని చెప్పి అఖిల్ కి ఒక సంబంధం ఉంది అని చెప్తూ ఉంటుంది. నువ్వు సరే అంటే మాట్లాడతాను అని అంటుంది.
అప్పుడు జ్ఞానాంబ వాడు చిన్నపిల్ల గాడు చదువుకుంటున్నాడు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు నాలుగు సంవత్సరాల తర్వాత తన పెళ్లి చేస్తాను అని అంటుంది. అప్పుడు జానకి అత్తయ్య గారు పెళ్లయిన తర్వాత కూడా అఖిల్ స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు తన భార్య తోడు ఉంటుంది కదా అని ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ పెళ్లయితే తన చదువు మీద దృష్టి పెట్టడు అఖిల్ చదివి అయిపోయే వరకు పెళ్లి ప్రస్తావన లేదు జానకి అని ఉంటుంది. అప్పుడు రామా కూడా అప్పుడే వీడికి పెళ్లేంటి చిన్న వయసులోనే బాధ్యతలు అన్ని నెత్తి మీద పెట్టడం అవసరమా చెప్పండి అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ నీ లక్ష్యం నెరవేరాలని చెప్పి వినాయకునికి నీ చేతి మీద పూజ చేయించాలి అనుకుంటున్నాను. అలాగే బట్టలు కూడా పంచి పెడదాము అనుకుంటున్నాను.. ఆ ఏర్పాట్లు చూడండి అని అంటుంది. అప్పుడు మల్లికా లీలావతి పెద్దమ్మతో డ్రామా ఆడిస్తే వీళ్ళిద్దరి నాటకం ఏంటో బయటపడింది అనుకుంటే అది బయటపడేలా లేదుగా అని అనుకుంటూ ఉంటుంది.
జానకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది. జానకి రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉండగా రామ వస్తాడు అప్పుడు జానకి నా ఫ్రెండ్ కి ఒక సమస్య వచ్చిందని అఖిల్ విషయాన్ని చెప్తుంది. అప్పుడు రామ దానికి ఒక పరిష్కారం దొరికేలా ఒక వేదాంతం చెప్తాడు. అప్పుడు జానకి అత్తయ్య గారు ముందు కోప్పడిన తర్వాత ఆలోచన చేస్తారు.. చెప్పాలి అని అనుకుంటుంది. ఇక వినాయకుని తీసుకొచ్చి పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మల్లిక తను పనులు చేయకుండా తప్పించుకున్నందుకు సంబరపడిపోతూ అందరికీ పనులు చెబుతూ ఉంటుంది. అంతలో చికితా వచ్చి ఏదో ఒక పని చేయొచ్చు కదా ఖాళీగా ఉన్నారు ఎందుకు అని అంటుంది. అప్పుడు అత్తయ్య గారు నన్ను ఏ పని చేయొద్దని చెప్పింది అందుకే చేయడం లేదు.. అని ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. అంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి మల్లికను చూస్తుంది. అప్పుడు మల్లికా భయపడి అత్తయ్య గారు కొంచెం నీరసంగా ఉందని తింటున్నాను అని అంటుంది. ఆ పర్లేదులే తిను అని అంటుంది.
ఇక జానకి జెసి వాళ్ళ అమ్మానాన్నలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మల్లిక అరటి తొక్క వేసి జానకిని కింద పడేయాలి. జ్ఞానాంబతో తిట్టించాలి అని చూస్తూ ఉంటుంది. అప్పుడు జానకి బయటికొస్తూ అరటి తొక్క మీద కాలేసి కింద పడిపోతుండగా రామ వచ్చి పట్టుకుంటాడు. ఆ పూలన్నీ వినాయకుడి మీద వాళ్ల మీద పడుతూ ఉండగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటారు.తర్వాత జ్ఞానంభ ఏంటి జానకి దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడుగుతుంది. లేదు అత్తయ్య గారు అని అంటుంది. ఇక మల్లిక తనని తిట్టించాలి తన తప్పు కొట్టించాలి కొట్టి వేయండి అత్తయ్య గారు అని అంటుండగా జ్ఞానంబ తనని తిడుతుంది. గోవిందరాజు కూడా మల్లికను తిడతాడు. ఇక జ్ఞానాంబ జానకిని నువ్వెందుకు కంగారు పడుతున్నావ్… భయపడుతున్నావ్… పూజంతా నీ చేతుల మీదుగానే జరగాలి నువ్వు ఏమి ఆలోచించకుండా ఆ పని చూడు అని అంటారు. అప్పుడు జానకి నామీద అత్తయ్య గారు చాలా నమ్మకంగా ఉన్నారు తన బాధపడకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వెచి చూడాల్సిందే…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.