Janaki Kalaganaledu 09 September 2022 Episode : కేస్ పెట్టొద్దు అని జెస్సి పేరెంట్స్ ని కాన్వెంట్స్ చేస్తున్న జానకి… జెసి ఎక్కడ ఇంటికి వస్తుందో అని కంగారు పడుతున్న అఖిల్…

Janaki Kalaganaledu 09 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 385 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జ్ఞానంబ జానకిని ఎందుకు భయపడుతున్నావ్ కంగారు పడకు.. పూజ అంతా నీ చేతుల మీద గానే జరగాలి ఆ కార్యక్రమం చూడు అని అంటుంది. అప్పుడు మల్లికా నేను ఒకటి అంటుకుంటే ఇంకొకటి జరిగింది అని కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి అత్తయ్య గారు నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నారు. అత్తయ్య గారు బాధపడకుండా ఆ విషయం సాల్వ్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులుగారు వస్తాడు పూజ జరిపిస్తూ ఉంటూ ప్రసాదాలు తీసుకురమ్మని చెప్తాడు. ఇక జ్ఞానంభ జానకిని ప్రసాదాలు తీసుకొని రమ్మని చెప్తుంది. సరే అని జానకి వెలుతుంది. కట్ చేస్తే జెస్సి తల్లిదండ్రులు జానకికి ఫోన్ చేస్తూ ఉంటారు.

తనకిచ్చిన గడువు అయిపోయింది. మమ్మల్ని నమ్మించి మోసం చేసింది అని అంటారు. అప్పుడు జెస్సి అక్క అలాంటిది కాదు అని అంటుండగా.. గట్టిగా తనపై కోప్పడి నిన్ను మమ్మల్ని పిచ్చి వాళ్లని చేసింది. అని జెసి వాళ్ల నాన్న అంటూ ఉండగా. జెస్సీ వాళ్ళ అమ్మ ఏదో ఒకటి చేయండి మీరే అని అంటుంది. అప్పుడు ఇక చేసేదేమీ లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే అని జెసి ని తీసుకొని వెళ్తూ ఉండగా.. వద్దు నాన్న అని అంటుంది జేసి. ఇక వస్తావా లేదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అప్పుడు డ్రెస్ మార్చుకొని వస్తా అని జరిగిందంతా జానకికి మెసేజ్ రూపంలో పెడుతుంది. కట్ చేస్తే జానకి జెస్సి పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ వాళ్లకి ఫోన్ చేయాలి అని వెళ్లి ఫోన్ చూసుకుంటుంది. అప్పుడు జానకి వాళ్ళ చేసిన కాల్స్ చూసి అయ్యో ఏమనుకుంటారో ఏంటి అని జెస్సి పెట్టిన మెసేజ్ ను వింటుంది. అప్పుడు జానకి వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ. రామాకి నాకు అర్జెంటు పని ఉంది అత్తయ్య గారికి మీరే చెప్పండి అని అంటుంది.

Janaki Kalaganaledu 09 September 2022 Full Episode

అప్పుడు రామ అంత అర్జెంట్ ఏంటండీ. నేను కూడా రానా అని అంటాడు. అయ్యో వద్దులేండి నేను పది నిమిషాల్లో వస్తాను వచ్చినకా జరిగిందంతా చెప్తాను అని అంటుంది. ఇక జానకి వెళ్తుండగా లీలావతి వాళ్లు జానకిని చూసి పిలుస్తూ ఉండగా తను పలకకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు లీలావతి ఇంటికి వచ్చి మల్లికకు ఆ విషయాన్ని చెబుతుంది. ఇక మల్లికాకు చాన్స్ దొరికిందని వెళ్లి జ్ఞానాంబకు చెప్తుంది. అప్పుడు జ్ఞానాంబ జానకి పై కోప్పడుతూ రామానీ అడుగుతుంది. అప్పుడు అర్జెంటు పని అంట అమ్మ వెళ్ళింది వెంటనే వస్తానంది అని చెప్తాడు. కట్ చేస్తే జెస్సి పేరెంట్స్ ని జెస్సీ కాన్వెంట్స్ చేయాలని చూస్తుంది కానీ జెసి పై గట్టిగా కోప్పడుతూ ఉంటారు. జానకి ఒక దగ్గర ఆగి జెసి పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్లు వస్తూ ఉండగా.. జానకి వాళ్ళని ఆపుతుంది.

అప్పుడు జానకిని చూసి వాళ్ళు కార్ దిగి వస్తారు. అప్పుడు జానకి సారు మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి ఈరోజు వినాయక చవితి పండుగ జరుగుతుంది ఆ పనిలో ఉండి నేను ఫోన్ చూసుకోలేదు.. నేను తప్పకుండా మా అత్తయ్య గారితో మాట్లాడుతాను. మీరు ఆవేశపడి కేసు పెడితే మీ అమ్మాయిని లేనిపోని మాటలు అంటూ ఉంటారు అందరూ. పదిమందిలోకి ఈ విషయాన్ని లాగితే బాధపడేది జెసి నే అందుకే ఆవేశ పడకండి నాకు కాస్త అవకాశం ఇవ్వండి నేను దానికి పరిష్కారం చూపిస్తాను అని అంటుంది. అప్పుడు జెస్సి వాళ్ళ అమ్మ అలా అయితే మా జెసిని నీతో పాటు తీసుకెళ్ళు మీ అత్తయ్య గారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించు అని అంటుంది. అప్పుడు జెస్సి వాళ్ళ నాన్న అలా చేయలేదు మేరీ. అలా చేస్తే వాళ్ళ పరువు పోతుందని ఆలోచిస్తుంది.

పోలీసులు తీసుకెళ్తే గాని వాళ్ళు మన మాట వినరు అని అంటాడు.అప్పుడు జానకి ఆలోచించి సరే నేను జెస్సిని తీసుకెళ్తాను మా అత్తయ్య గారితో మాట్లాడతాను అని జానకి అంటుంది.ఇంటిదగ్గర జానకి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మల్లికా కి ఛాన్స్ దొరికిందని జానకి మీద జ్ఞానాంబకి కోపం వచ్చేలా..మాటలు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జ్ఞానంబా మల్లికను తిడుతుంది. ఇక పూజకు వచ్చిన ముత్తైదువులు కూడా జానకిని మాటలు అంటూ ఉంటారు. అఖిల్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజు ఇదిగో లీలావతి మీరు వచ్చింది పూజకు మాత్రమే మా ఇంట్లో సంతోషాన్ని పోగొట్టడానికి కాదు అని తిడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Recent Posts

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

54 minutes ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

2 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

3 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

4 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

12 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

13 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

14 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

14 hours ago