janaki kalaganaledu 1 april 2022 full episode
Janaki Kalaganaledu 1 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 270 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి చదువుకున్న తెలివితేటలు ఎలాంటివో కళ్లారా చూశాను అంటుంది జ్ఞానాంబ. ఇంటి ముందు గుడిసె వేసుకొని ఉండటం నామూషీ అనిపించి.. చదువు లేని వాడిని పెళ్లి చేసుకున్నా అనే అవమానం జానకి మనసులో ఉంది కదా. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రామాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందేమో అంటుంది జ్ఞానాంబ. ఆవిడ అలా అవస్థలు పడటం వెనుక కూడా ఏదో ఒక నాటకం ఉండే ఉంటుంది. ఆవిడ నుంచి, ఆవిడ అవస్థల నుంచి నన్ను నేను కాపాడుకుంటాను అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 1 april 2022 full episode
జానకి అలాంటిది కాదు.. అని గోవింద రాజు ఎంత చెప్పినా జ్ఞానాంబ మాత్రం వినకుండా వెళ్లిపోతుంది. మరోవైపు జానకి బట్టలు పిండి ఆరేయడం గోవింద రాజు చూస్తాడు. అమ్మా జానకి.. మన కుటుంబం అనే బంధం తప్ప నేను అనే స్వార్థం నీకు తెలియదమ్మా. తెలిస్తే నువ్వు ఇలా కష్టాలను భరించవు. మీ అత్తయ్య కళ్లకు అపార్థం అనే తెర కమ్ముకుంది. అందుకే తను నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతోంది అని అనుకుంటాడు గోవింద రాజు. మరోవైపు మల్లిక.. అత్తయ్య నామాటే వింది.. అని తెగ సంతోషిస్తుంది.
జానకి దండెం మీద బట్టలు ఆరేయడంతో.. తన బట్టలను తీసేస్తుంది మల్లిక. ముక్కు మొహం తెలియని వాళ్లు మా దండెం మీద బట్టలు ఆరేస్తే మేము ఎక్కడ ఆరేయాలి అని వాళ్ల బట్టలు తీసి కింద పడేసి వెళ్తుంది మల్లిక. ఆ తర్వాత తన బట్టలను ఆరేస్తుంది.
మనిషి అన్నాక కాస్త అయినా పౌరుషం ఉండాలి అని అంటుంది. అదే నేను అయితే ఒక్క క్షణం కూడా ఉండేదాన్న కాదు అని అంటుంది మల్లిక. ఇంతలో గోవింద రాజు ఒక తాడు తీసుకొచ్చి మరో దండెం కడుతాడు. జానకి ఒక్క నిమిషం అమ్మ.. అయిపోతుంది అని చెప్పి దండెం కడతాడు.
ఇక నుంచి నీ బట్టలన్నీ ఈ తాడు మీద ఆరేసుకో అంటాడు గోవింద రాజు. దీంతో థ్యాంక్స్ మామయ్య గారు అంటుంది జానకి. తన దగ్గర ఉన్న డబ్బులను ఇచ్చి తీసుకో అంటాడు. నువ్వు తీసుకోకపోతే నేను బాధపడతాను అంటాడు. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది.
దీంతో జానకిని ఇదిగో మీ బట్టలు మీ దండెం మీద ఆరేసుకోవాలి. మా దండెం మీద ఆరేయకూడదు. అర్థం అయిందా. మా దండెం మీద బట్టలు ఆరేస్తే నేను ఊరుకోను.. అంటూ గట్టిగా తనకు వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇంట్లోకి వస్తాడు గోవింద రాజు.
మరోవైపు జానకి.. రామాకు బాక్స్ ఇస్తుంది. కానీ.. ఖార్ఖానాలో పని ఒత్తిడి వల్ల మధ్యాహ్నం భోజనం చేయలేకపోతాడు. దీంతో దాన్ని జానకి చూస్తే బాధపడుతుందని దాన్ని పడేస్తాడు. రామా.. భోజనాన్ని పడేయడం చూసి జ్ఞానాంబ తల్లడిల్లుతుంది. రామా ఎందుకు భోజనం తినలేదు. ఈవిడ చేసిన వంట రామాకు నచ్చడం లేదా.. అని బాధపడుతుంది జ్ఞానాంబ.
నిన్ను ఎంత అపురూపంగా పెంచుకున్నాను. నువ్వు ఇలా తిండి తిప్పలు లేకుండా కష్టపడుతుంటే ఈ అమ్మ గుండె తరుక్కుపోతుందిరా అని అనుకుంటుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి అంట్లు తోముతూ ఉంటుంది. ఇంతలో రామా వస్తాడు. ఆ క్యారేజ్ ఇలా ఇవ్వండి. దాన్న కూడా కడిగేస్తాను అంటుంది జానకి.
కనీసం తిన్నావా అని కూడా అడగడం లేదు రామాను అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఎంతైనా కన్నపేగు కన్నపేగే.. పరాయి వాళ్లు పరాయి వాళ్లే అనుకుంటుంది. జానకి గారు భోజనం బ్రహ్మాండంగా ఉంది అండి. అదిరిపోయాయి అంటాడు రామా.
మరోవైపు నేనే వంట చేశాను.. భోం చేద్దురు కానీ రండి అని అడుగుతుంది మల్లిక. నేను తర్వాత తింటాను.. నువ్వు వెళ్లు అంటుంది జ్ఞానాంబ. ఈ పోలేరమ్మ.. భోజనం మానేసి మరీ ఇంతగా ఎందుకు బాధపడుతుంది. అక్కడ కొడుకు తిన్నాడో లేదో అని బాధపడుతున్నట్టుంది.
కరిగిన మనసుతో కొడుకును, కొడుకు కోసం కోడలును ఇంట్లోకి పిలిచినా పిలుస్తుంది. అది జరగకుండా ఉండాలంటే మనలో ఉన్న లేడీ విలన్ ను బయటికి తీయాలి అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు రామా, జానకి.. ఇద్దరూ కలిసి బయట పొయ్యి మీద రొట్టెలు చేస్తూ ఉంటారు.
ఇంతలో రామాకు ఏదో గుర్తుకు వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది జానకి. దీంతో అమ్మ గుర్తొచ్చింది అంటాడు రామా. అమ్మా నేను ఎప్పుడు ఇలాగే చపాతీలు కాల్చేవాళ్లం అంటాడు. అమ్మకు వేడి వేడి చపాతీలు అంటే ఇష్టం అని చెబుతాడు రామా.
మరోవైపు డోర్ వేద్దామని డోర్ దగ్గరకు వచ్చిన జ్ఞానాంబ… రామా రొట్టెలు చేయడం చూస్తుంది. తిండి కూడా తినకుండా.. పగలంతా ఖార్ఖానాలో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డావు. ఆ జాలి కూడా లేకుండా ఇప్పుడు నీతో వంట చేయిస్తోంది అని బాధపడుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.