Janaki Kalaganaledu Their uncle helped Janaki study Rama mistake and not Gnanamba
Janaki Kalaganaledu 1 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 313 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోవిందరాజు వేసుకునే ట్యాబ్లెట్లను మల్లిక.. జ్ఞానాంబ ట్యాబ్లెట్ల బాక్స్ లో పెడుతుంది. అప్పుడు జ్ఞానాంబ వస్తుండటంతో తలుపు చాటున దాక్కొని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది మల్లిక. తర్వాత జ్ఞానాంబ… తన ట్యాబ్లెట్ల బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తుంది. అందులో మల్లిక పెట్టిన ట్యాబ్లెట్లను వేసుకుంటుంది. దీంతో సూపర్ అనుకుంటుంది మల్లిక. ఇంకాసేపట్లో అసలు కథ మొదలు కాబోతోంది. డోంట్ మిస్ అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. మరోవైపు రామా, జానకి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధం అవుతారు. రాముడు కావాల్సినవన్నీ సర్దుకున్నారు కదా. ఏం మరిచిపోలేదు కదా అని అంటుంది.
janaki kalaganaledu 1 june 2022 full episode
మరోవైపు జ్ఞానాంబను పిలుస్తాడు గోవిందరాజు. అబ్బాయి వాళ్లు బయలుదేరుతున్నారు అని అంటాడు గోవిందరాజు. చికిత ఆ టిఫిన్ బాక్స్ తీసుకురా అంటుంది జ్ఞానాంబ. పులిహోర తినండి అని చెప్పి బాక్స్ ఇస్తుంది జ్ఞానాంబ. జానకి ఎలాగూ వైజాగ్ వెళ్తున్నారు కదా.. బీచ్ కు వెళ్లి పీచుమిఠాయి తినండి అంటుంది మల్లిక. టైమ్ అవుతోంది మీరు ఇక బయలుదేరండి అంటాడు గోవిందరాజు. అత్తయ్య గారు మేము వెళ్లొస్తామండి అంటుంది జానకి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అంటుంది జ్ఞానాంబ. మరోవైపు జ్ఞానాంబ ఇంకెప్పుడు పడిపోతుంది అని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబకు కళ్లు తిరుగుతాయి. రామా పట్టుకుంటాడు. ఏమైంది అమ్మ.. అని అడుగుతాడు రామా. తనను తన రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఏమంది అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో ఎప్పటిలాగానే బలం ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంతలోనే ఇలా అయింది అని అంటుంది జ్ఞానాంబ.
రామా ఫోన్ తీసుకొని డాక్టర్ కు ఫోన్ చేస్తుంది జానకి. అత్తయ్య గారు ఎప్పుడూ వేసుకునే ట్యాబ్లెట్లే వేసుకున్నారా మీరు అని అడుగుతుంది జానకి. దీంతో ఏదో చెప్పబోతుంది జ్ఞానాంబ కానీ.. చెప్పలేకపోతుంది. ఇంతలో అక్కడికి వెళ్లి జ్ఞానాంబ ట్యాబ్లెట్ల బాక్స్ ను చూసి తను వేసుకుంది బీపీ ట్యాబ్లెట్ అని తెలుసుకుంటుంది జానకి.
వెంటనే వంటగదిలోకి వెళ్లి గ్లాస్ లో వాటర్ పోస్తుండగా.. లూసీ ఫోన్ చేసి.. రేపు ఉదయం 9 కల్లా చెఫ్ కాంపిటిషన్ కు రావాలని చెబుతుంది. దీంతో సరే వస్తాం అని చెబుతుంది జానకి. పోలేరమ్మ ఏంటి ఇలా గుడ్లు తేలేస్తోంది అని భయపడుతుంది జానకి.
ఇంతలో జానకి నీళ్లు తీసుకొచ్చి తాగండి అంటుంది. జానకి గారు అమ్మకు ఏమౌతుందో అని చాలా భయంగా ఉంది అంటాడు రామా. దీంతో మీరేం కంగారు పడకండి రామా గారు.. అత్తయ్య గారికి బీపీ డౌన్ అయింది. ఈ ఉప్పు నీళ్లు తాగించాం కదా. అత్తయ్య గారు కాసేపట్లో నార్మల్ అవుతారు అంటుంది జానకి.
కానీ.. జ్ఞానాంబకు ఏమౌతుందో అని అందరూ టెన్షన్ పడుతుంటారు. జానకి వెళ్లి జ్ఞానాంబ కాళ్లు రద్దుతుంది. దీంతో మల్లిక కూడా వెళ్లి కాళ్లు రుద్దుతుంది. ఒరేయ్ విష్ణు మీ అమ్మకు ఏంట్రా ఇలా అయింది అంటాడు గోవిందరాజు. ఇంతలో డాక్టర్ వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది డాక్టర్.
దీంతో విటమిన్ ట్యాబ్లెట్స్ బదులు.. బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు అని చెబుతుంది జానకి. సాల్ట్, స్వీట్ వాటర్ ఇచ్చాను అంటుంది జానకి. దీంతో వెరీగుడ్ ప్రాపర్ గా ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటుంది డాక్టర్. తర్వాత డాక్టర్ తనకు ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటుంది.
ఇక.. మల్లిక ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. మా అత్తయ్య గారిని ఎలాగైనా కాపాడండి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. తనకు బీపీ చెక్ చేస్తుంది. కాస్త బీపీ డౌన్ అయింది. మీరు సాల్ట్ వాటర్ తగ్గించడం వల్ల రిస్క్ తగ్గింది అంటుంది డాక్టర్.
కాసేపట్లో కుదుటపడుతుంది అంటుంది డాక్టర్. మరోవైపు ఆమె కోలుకునేవరకు టెన్షన్ తో హైదరాబాద్ వెళ్లకుండా అలాగే ఉండిపోతారు రామా, జానకి. వైపు చీకటి పడుతుంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో డాక్టర్ ట్రీట్ మెంట్ చేసి బయటికి వస్తుంది.
టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మీ అమ్మగారు క్షేమంగానే ఉన్నారు అంటుంది డాక్టర్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
This website uses cookies.