Prabhas will Chances are announced at any time
Prabhas : సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె..డార్లింగ్‌కి హిట్టిచ్చే సినిమా ఏదీ..? అంటే సమాధానం సున్నా..అని కొందరు కామెంట్స్ చేయడం ఇప్పుడు ఊహించనిది. దీనికి కారణం సాహో, రాధే శ్యామ్ సినిమాలే. బాహుబలి తర్వాత ఎప్పటికప్పుడు ప్రభాస్ ఈ సినిమాతో హిట్ ఇస్తాడు, ఈ సినిమాతో హిట్ ఇచ్చేస్తాడు అంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాము. కానీ, ప్రభాస్ కనీసం ఒక యావరేజ్ హిట్ సినిమానైనా ఇస్తాడా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న పెద్ద సందేహం. బాహుబలి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ దక్కలేదు. ఒక్కసారిగా తన ఇమేజ్ పెరగడంతో చేసే అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే ప్రాజెక్ట్స్ కమిటవుతున్నాడు. కానీ, కథల విషయంలో ప్రభాస్ చాలా వీక్ గా అనిపిస్తున్నాడు.రాజమౌళి వల్ల ప్రభాస్ కి పాన్ ఇండియా గుర్తింపు ఏ రేంజ్‌లో వచ్చిందో అందరికీ తెలిసిందే.
దాదాపు బాహుబలి అంత బడ్జట్ తోనే తెరకెక్కిన సాహో సినిమాని ప్రభాస్ ఇమేజ్ కాపాడలేకపోయింది. హిందీలో డబ్బులొచ్చినా, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలని మిగిలించింది. బాహుబలి తర్వాత కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడమే తప్పు అనుకుంటే, పాన్ ఇండియా సినిమా చేయడం ప్రభాస్ చేసిన అతిపెద్ద తప్పు. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్, రాధే శ్యామ్ సినిమా చేయడం మరో బిగ్ మిస్టేక్. అసలు జాతకాలు చెప్పడం అనే కాన్సెప్ట్ ఏంటి..? అంటూ నేషనల్ వైడ్ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.ప్రభాస్ ఈ సినిమా ఎందుకు చేసాడో..ఇన్ని కోట్లు ఎందుకు కేటాయించారో కూడా అర్ధం కాని ప్రశ్న. రాదే శ్యామ్ సినిమా చూసి ఇది పాన్ ఇండియా సినిమానా..? అని తల బాదుకున్నవారూ లేకపోలేదు. ప్రభాస్ చేసిన రెండు సినిమాల స్టొరీ విషయం పక్కన పెడితే.. సాహో, రాదే శ్యామ్ సినిమాల్లో ప్రభాస్ లుక్ పరంగానే ఆకట్టుకోలేకపోయాడు. ప్రభాస్ ఈ రెండు సినిమాల్లో నీరసంగా కనిపించాడు.
Salar, Adipurush, Project K No hit movie for Prabhas
ఏదైనా అద్భుతమైన పాయింట్ ఉంటే ఆ కథలో నటించి ముందు ఓ రీజనల్ హిట్ అందుకోవడం బెస్ట్ అనే స్థాయిలో కామెంట్స్ మొదలయ్యాయి. కానీ, ప్రభాస్ మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రభాస్ సలార్ తో ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ.. సలార్ ఒక యాక్షన్ సినిమా, పైగా ప్రశాంత్ నీల్ సినిమా. సో మూవీ అంతా యాక్షన్ సీన్స్ మాత్రమే ఉంటాయి. మేకింగ్ తో ఫైట్స్ తో మాత్రమే సినిమా హిట్ అవుతుంది. ఇక్కడ తేడా కొడితే ఢమాలే. ఇక ఆదిపురుష్ అంటూ రామాయణ ఇతిహాసం నుంచి మూలకథను తీసుకొని చేస్తున్నారు. ప్రభాస్ ను రాముడిగా చూస్తారా అంటే సగానికి సగం సమాధానం లేకుండా ఉండిపోతున్నారు. ఇక ప్రాజెక్ట్ కె సినిమా హాలీవుడ్ రేంజ్ అంటున్నారు. సైన్ ఫిక్షన్ స్టోరీ. ఇలాంటి స్టోరీ మన వాళ్ళను ఎంతవరకూ మెప్పిస్తుందో రిలీజ్ అయ్యేవరకూ చెప్పడం ఎవరి వల్లా కాదు.
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.