Revanth Reddy – Malla Reddy : తెలంగాణలో ‘రెడ్డి’ కుంపటి… మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement

Revanth Reddy – Malla Reddy  : రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం అది. ఆ సామాజిక వర్గ పెద్దలంతా కలిసి, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి మల్లారెడ్డి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు పాల్గొని, తమ అభిప్రాయాల్ని ఈ వేదిక ద్వారా కుండబద్దలుగొట్టారు.. సామాజిక వర్గ అభివృద్ధి విషయమై కొన్ని సూచనలూ చేశారు. అయితే, మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ఆందోళన చేశారు. రెడ్డి కార్పరేషన్‌కి 5 వేల కోట్లు కేటాయించాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయ్యింది.

Advertisement

ఆ విషయమై మంత్రి మల్లారెడ్డి నుంచి సరైన స్పష్టత రాలేదనీ, కేవలం రాజకీయ ప్రసంగంతోనే ఆయన సరిపెట్టారనీ ఆ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, వ్యక్తులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డిపై దాడికి యత్నించారు కొందరు. పోలీసులు సకాలంలో స్పందించారు.. అదే సమయంలో, నిర్వాహకులూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మొత్తానికి మల్లారెడ్డి ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లోనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మల్లారెడ్డి కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి రేవంత్ రెడ్డి కారణమనీ, ఆయన్ని జైల్లో పెట్టిస్తాననీ మంత్రి మల్లారెడ్డి తాజాగా శపథం చేసేశారు.

Advertisement

Revanth Reddy vs Malla Reddy Reddys Panchayati In Telangana

అయితే, ఈ కార్యక్రమానికీ రేవంత్ రెడ్డికీ ప్రత్యేకంగా ఎలాంటి సంబంధం లేదనీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకుల్లానే రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చారనీ, సామాజిక వర్గ ప్రముఖులు, నిర్వాహకులు అంటున్నారు. తెలంగాణలో రెడ్ల మధ్య నడుస్తున్న ఈ పంచాయితీ, రాజకీయంగా కాక రేపింది. దీన్ని ఓ సామాజిక వర్గంలో ఆధిపత్య పోరులా కాకుండా, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయితీగానూ చూసే ప్రయత్నం జరుగుతోంది. మరోపక్క, రెడ్లను దొరలు తొక్కేస్తున్నారంటూ రెడ్డి సామాజిక వర్గంలో కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కుల పంచాయితీలు ఎక్కువ. అవి తెలంగాణకీ పాకినట్టున్నాయ్

Advertisement

Recent Posts

AP Government : బిగ్ బ్రేకింగ్‌.. ఏపీలో సంక్రాంతి సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు…!

AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…

40 minutes ago

Rakul Preet Singh : పింక్ ష‌ర్ట్‌లో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్..!

Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…

3 hours ago

Daaku Maharaaj : గేమ్ చేంజర్ టాక్ డాకు మహారాజ్ కి కలిసి వస్తుందా..?

Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…

4 hours ago

PM Modi : నేను మనిషిని దేవుడిని కాదు : ప్రధాని మోదీ

PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో Nikhil Kamath క‌లిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…

5 hours ago

HMPV : భారత్‌లో పెరుగుతున్న‌ HMPV వైరస్ కేసుల‌పై డబ్ల్యూహెచ్ఓ స్పంద‌న‌

HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…

6 hours ago

TGSRTC : ప్ర‌యాణికుల‌కు టీజీఎస్ఆర్‌టీసీ షాక్‌.. ప్ర‌త్యేక‌ బస్సుల్లో టికెట్ ధరలు పెంపు

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను 1.5% పెంచుతున్నట్లు ప్రకటించింది.…

7 hours ago

Delhi Assembly Elections : సందిగ్ధంలో కాంగ్రెస్‌.. ఢిల్లీ దంగ‌ల్‌లో ఇండియా కూట‌మి పార్టీల మ‌ద్ద‌తు ఆ పార్టీకే

Delhi Assembly Elections : భారత కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి అనుకూలంగా ముందుకు…

8 hours ago

Red Sandalwood : ఎర్రచందనం ఉపయోగాలు తెలిస్తే షాక్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకా…. షాక్..?

Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…

9 hours ago

This website uses cookies.