Janaki kalaganaledu 1 october 2021 friday episode 140 highlights
Janaki kalaganaledu 1 october 2021 friday episode 140 highlights
Janaki Kalaganaledu 1 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ శుక్రవారం హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి గదిలో ట్యాబ్లెట్లను చూస్తుంది జ్ఞానాంబ. దీంతో జానకిని తిడుతుంది. కానీ.. ఇదంతా జానకికి తెలియదు. అది మల్లిక ప్లాన్. ఉదయం ట్యాబ్లెట్లు తీసుకోవడానికి వెళ్లిన మల్లిక 500 నోటు దొరకడంతో చిల్లర తీసుకోకుండా వస్తుంది. ఆ ట్యాబ్లెట్లు కొన్నది మల్లిక కాబట్టి.. చిల్లర ఇవ్వడానికి జ్ఞానాంబ ఇంటికి వస్తాడు మెడికల్ షాప్ అతడు. మల్లికకు చిల్లర ఇస్తాడు. వెంటనే జ్ఞానాంబ అతడిని ఆపి.. ఆ ట్యాబ్లెట్లను చూపిస్తుంది. ఇవే ట్యాబ్లెట్లా మల్లిక మీ కొట్టులో తీసుకుంది అని అడుగుతుంది. దీంతో అవును అంటాడు అతడు.
దీంతో జ్ఞానాంబకు చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్లి జ్ఞానాంబ కాళ్లు పట్టుకుంటుంది మల్లిక. అత్తయ్య గారు నేను చేసింది తప్పే. క్షమించరాని తప్పే అంటుంది మల్లిక. మనవడి కోసం మీరెంత ఆరాట పడుతున్నారో నాకు తెలుసు. నేను ఇలా చేయడం వల్ల మీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. కానీ.. నేను ఎందుకు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నానో.. వేసుకోవాల్సి వచ్చిందో చెబుతాను. ఈ 40 కిలోల బక్క ప్రాణానికి కడుపులో 4 కిలోల బిడ్డను మోసే శక్తి లేదు. ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగితే కనే ఓపిక లేక చచ్చిపోతాను. అందుకే.. కాస్త ఒళ్లు వచ్చాక పిల్లలను కందామని అనుకున్నాను అంటుంది మల్లిక. నా ప్రాణం గురించి ఆలోచించి ట్యాబ్లెట్లు మింగుతున్నాను కానీ.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు అత్తయ్య.. అంటుంది మల్లిక.
దీంతో గోవింద రాజులుకు కోపం వస్తుంది. అబ్బబ్బ.. ఏం నాటకం ఆడుతున్నావు అంటాడు. ఇప్పటికిప్పుడు ఎలా కథలు అల్లేస్తున్నావు అంటాడు. చిన్న పిల్లవు కదా.. తెలిసీ తెలియని టింగరి తనం అనుకున్నాం. నువ్వు ఏదో ఒక రోజు మారుతావు అని అనుకున్నాం కానీ.. నీ మనసులో ఇంత విషం ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు తప్పు చేసి జానకి మీద నెట్టేస్తావా? నీకు ఇంత కుట్ర ఎందుకు అంటుంది. దీంతో మళ్లీ కట్టుకథ అల్లుతుంది మల్లిక.
అత్తయ్య మీద భయపడే నేను ఇలాంటి పనిచేశాను మామయ్య గారు. జానకిని బలి చేయాలని కాదు మామయ్య గారు అంటుంది మల్లిక. ఇక చాలు ఆపవమ్మా.. అంటాడు. తన మీద సీరియస్ అవుతాడు. దీంతో మామయ్య సీరియస్ అవుతున్నాడు. ఏం చేయాలో తెలియక వెంటనే జానకి వద్దకు వెళ్లి.. జానకి నువ్వే నన్ను రక్షించాలి. నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ మీద నింద వేశాను. నువ్వే నాకు శిక్ష వెయ్యాలి. ఏం శిక్ష వేస్తావో చెప్పు అంటుంది మల్లిక. దీంతో చెప్పు జానకి అంటుంది జ్ఞానాంబ.
Janaki kalaganaledu 1 october 2021 friday episode 140 highlights
తను నీ గదిలో ట్యాబ్లెట్లను దాచి పెట్టి నీ మీద వేసిన కుట్రకు నువ్వు ఏం శిక్ష వేస్తావో చెప్పు జానకి అని అడుగుతుంది జ్ఞానాంబ. పిల్లల విషయంలో ఇన్నాళ్లు తను అబద్ధం చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేసింది. తన మాటల వెనుక బాధ ఉందని అనుకున్నాను కానీ.. ఇంత మోసం ఉందని తెలియదు. ఇది నాకు భరించరాని బాధ. తన కోసం.. నిన్ను బలి చేయాలని అనుకోవడం క్షమించరాని తప్పు. నీ విషయంలో తను ఇలా ఇంకోసారి చేయకుండా ఉండాలంటే నువ్వే తనకు శిక్ష వేయాలి అంటుంది జ్ఞానాంబ. ఆ శిక్ష తనకు గుణపాఠం అవ్వాలి అంటుంది జానకి. ఏ శిక్షతో తనకు గుణపాఠం చెబుతావో చెప్పు అంటుంది.. దీంతో తనేదో తెలిసీ తెలియక అంటుంది జానకి.
Janaki kalaganaledu 1 october 2021 friday episode 140 highlights
నమ్మిన వాళ్లకు అబద్ధం చెప్పడం తెలిసీ తెలియకపోవడమా? ఇలాంటి సున్నిత విషయాల్లో మోసం చేయడం తెలిసీ తెలియకపోవడమా? పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకునే హక్కు మీకు కూడా ఉంది కానీ.. నేనేమీ మిమ్మల్ని శాసించడం లేదే? అబద్ధాలతో నన్నెందుకు పిచ్చిదాన్ని చేయడం.. అంటుంది జ్ఞానాంబ.
నీకు నేను ఏం తక్కువ చేశాను. నువ్వు నన్ను వెర్రిదాన్ని చేశావు. నిన్ను కట్నకానుకలు తెమ్మని చెప్పానా? పొలాలు కావాలన్నానా.. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి ఉండే కోడళ్లు కావాలని అనుకున్నాను కానీ.. కట్నం తెచ్చే కోడళ్లను కాదు. మిమ్మల్ని నేను ఏనాడూ కోడలుగా కాదు.. కూతురుగా చూసుకున్నాను.. అంటుంది జ్ఞానాంబ. మనందరం కలిసి ఉండాలనే ఆరాటం తప్ప అది కోపం కాదు.. అంటుంది జ్ఞానాంబ. మొత్తం మీద మల్లిక మీద సీరియస్ అవుతుంది.
నీ మనసులో కూడా ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు జానకి. ఎందుకంటే నువ్వు తనలా మోసం చేయవని బలమైన నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ నువ్వు కూడా మల్లికలా మోసం చేస్తే.. ఆ మోసాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు.. అంటుంది జ్ఞానాంబ. చెప్పు జానకి.. తను నీమీద వేసిన కుట్రకు నువ్వు ఏ శిక్ష వేస్తావో చెప్పు అంటుంది. కానీ.. నేను కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాను.. నాకు మల్లికకు శిక్ష వేసే హక్కు లేదు అని తనలో తానే అనుకుంటుంది.
Janaki kalaganaledu 1 october 2021 friday episode 140 highlights
మంచేదో.. చెడు ఏదో మీకే తెలుసు. నాకు ఆస్థాయి లేదు.. అని జానకి చెబుతుంది. దీంతో నా చేతుల్లో నుంచి వాళ్లను వదిలేస్తున్నాను. మల్లిక.. నువ్వు మీ ఆయన ఇంట్లోంచి వెళ్లిపోండి అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు. విష్ణు వెంటనే వచ్చి అమ్మా.. ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటాడు. వేరు కాపురం ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటామనుకున్నారు. మల్లిక ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలాగే చేస్తుంది. అది వాళ్లకి మన కుటుంబానికి అస్సలు బాగోదు. మనసుకు ఎంత కష్టమైనా సరే.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటుంది జ్ఞానాంబ. ఎవరు ఎంత చెప్పినా జ్ఞానాంబ వినదు.
మరోవైపు అత్తయ్య గారి ముందు నిజం దాస్తూ ఐఏఎస్ కలను నేను నిజం చేసుకోలేను అని నిద్రపోయిన రామా ముందు వాపోతుంది జానకి. ఇక.. నా వల్ల కాదు. నేను పెద్ద తప్పు చేస్తున్నాను. అత్తయ్య గారి ముందు తప్పు చేసిన దానిలా ఉండలేను.. అని చెప్పి ఐఏఎస్ పుస్తకాలను తీసుకెళ్లి తగులబెట్టబోతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
This website uses cookies.