Janaki Kalaganaledu 10 Feb Today Episode : చనిపోయేముందు జానకికి ఫోన్ చేసిన వెన్నెల.. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ‌, రామా షాక్.. వెన్నెల, దిలీప్ సూసైడ్ చేసుకుంటారా?

Janaki Kalaganaledu 10 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 234 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిద్దరం చచ్చిపోదాం వెన్నెల అంటాడు దిలీప్. కలిసి బతకాలని కలలు కన్నాం. కానీ.. ఆ దేవుడు మనకు ఆ అదృష్టం ఇవ్వలేదు. అందుకే కలిసి చనిపోదాం వెన్నెల అంటాడు. ప్రేమ మనకు కొత్త జీవితాన్ని బహుమతిగా ఇస్తుందనుకున్నాను. కానీ.. చావును బహుమతిగా ఇస్తోంది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది వెన్నెల. మరోవైపు జ్ఞానాంబ‌.. గుడికి వస్తుంది. ఏం చెప్పాను అని జానకిని ప్రశ్నిస్తుంది. ఏమని చెప్పాను నేను నీకు. నువ్వు నాకు ఏమని చెప్పావు. నువ్వు చెప్పిందేంటి.. చేస్తున్నదేంటి. అంటే.. నా మాటంటే నీకు విలువ లేదా. నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడవా అని జానకిని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ‌.

janaki kalaganaledu 10 february 2022 full episode

మాట్లాడకు.. నా దృష్టిలో మాటంటే ప్రాణం.. అంటుంది. అది కాదు అత్తయ్య గారు అంటుంది జానకి. ఏం చెప్తావు.. నైవేద్యాన్ని ఇంట్లో మరిచిపోయానని చెప్తావా? అంటుంది జ్ఞానాంబ‌. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించండి అని అన్నిసార్లు చెప్పాను. అయినా కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీకు ఏం చెప్పాలి. ఇదేనా నీకు పూజ మీద ఉన్న గౌరవం అంటుంది జ్ఞానాంబ‌. క్షమించండి అత్తయ్య గారు.. మీరు ఇచ్చిన ప్రసాదాన్ని బ్యాగులో పెట్టుకున్నాననే అనుకున్నా కానీ.. ఎలా మరిచిపోయానో నాకు అర్థం కాలేదు అంటుంది జానకి. మీరిద్దరూ క్షేమంగా ఉండాలనే కదా.. నేను ఈ పూజ చేయాలని చెప్పింది. ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టకపోతే ఎంత అరిష్టమో తెలుసా.. అని అంటుంది జ్ఞానాంబ‌.

ఏదో పొరపాటున మరిచిపోయారు తప్ప కావాలని కాదమ్మా అంటాడు రామా. దీంతో చాలులే ఆపరా.. నీకు ఈ అమ్మ కన్నా భార్యే ఎక్కువైందిరా. నీ భార్యను వెనుకేసుకురావడం కోసం నాకు అబద్ధం చెప్పావు. ఈ అమ్మ నమ్మకాన్నే వమ్ము చేశావు అంటుంది జ్ఞానాంబ‌.

ప్రసాదం లేదని చెబితే నువ్వు కంగారు పడతావని అలా చెప్పానమ్మా అంటాడు రామా. ఈ పూజ పరిపూర్ణం కాకపోతే నేను బాధ పడతాను. ఈ విషయం మీకు అర్థం కాలేదా. ఇలాంటి నమ్మకాల విషయంలోనా మీరు అబద్ధాలు చెప్పేది.. అంటుంది జ్ఞానాంబ‌.

ఇంతలోనే పంతులు గారు వస్తారు. వాళ్లతో కులదేవత ఆరాధన పూజ చేయిస్తాడు పూజారి. జానకి.. దేవుడికి పూజ చేస్తుంది. అమ్మా.. మీరు తలపెట్టిన మీ కులదేవత ఆరాధాన దిగ్విజయంగా పూర్తయింది.. అంటాడు. అమ్మా.. కోనేటిలో ఈ దీపాన్ని వదిలి అమ్మవారికి నమస్కరించండి. ఈ పూజ పరిపూర్ణం అవుతుంది అంటాడు పంతులు.

Janaki Kalaganaledu 10 Feb Today Episode :  నన్ను, నా కొడుకును విడదీయాలని అనుకుంటున్నావా అంటూ జానకిపై సీరియస్ అయిన జ్ఞానాంబ‌

జానకిని కోనేరు దగ్గరికి తీసుకెళ్తుంది జ్ఞానాంబ‌. ఏం జానకి నా నుంచి నా కొడుకును దూరం చేయాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ‌. నాకొడుకుకు, నాకు మధ్య మనస్పర్థలు సృష్టించాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది.

మన మధ్య జరిగిన విషయాన్ని నువ్వు రామాతో ఎందుకు చెప్పబోయావు. నేను నీ చదువు కాగితాలు తీసుకున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రామాకు చెప్పకూడదని చెప్పాను కదా. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయినా నువ్వు రామాకు చెప్పేదానివి. నాకు, నా కొడుకు మధ్య దురం పెంచాలని నువ్వు అనుకోకపోతే నువ్వు వాడికి ఎందుకు చెప్పబోయావు అంటుంది.

దీంతో మీకు ఇచ్చిన మాటకు, ఆయన కోపానికి మధ్య నేను నలిగిపోతున్నాను. అయినా సరే.. మౌనంగా భరించాను తప్పితే నేను నోరు విప్పలేదు. చివరకు ఆయన దేవుడి ముందు ఆయన మీద ఒట్టు పెట్టుకునే సరికి.. నా భర్త క్షేమం కోసం చెప్పక తప్పలేదు అంటుంది జానకి.

భరించు.. భరించాలి. నీ విషయంలో నేను బాధను భరించలేదా. నీ చదువును వదిలేస్తున్నట్టు మొక్కుకొని ఆ దీపాన్ని కోనేరులో వదిలేయ్ అని చెబుతుంది జ్ఞానాంబ‌. దీంతో జానకి.. కోనేరులో ఏడుస్తూనే దీపాన్ని వదిలేస్తుంది. అప్పుడే రామా అక్కడికి వస్తాడు.

కానీ.. జ్ఞానాంబ‌ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జానకి మాత్రం అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది. జానకి గారు.. ఏమైంది అని అడుగుతాడు. దీంతో వదిలేశానండి అంటుంది. దీపాన్ని వదిలేశాను అంటుంది జానకి. ఇక ఎలాంటి సమస్యలు ఉండవు అంటుంది జానకి.

అందరం సంతోషంగా ఉంటాం అంటుంది జానకి. మరోవైపు రిసార్ట్ లో విష్ణు, మల్లిక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో విష్ణు వచ్చి ఒసేయ్.. త్వరగా ఇంటికి వెళ్దాం పదవే అంటాడు విష్ణు. ఎహె.. ఎప్పుడూ ఇంటికి ఇంటికి అంటున్నారు. ఏముంది అక్కడ. వట్టి చాకిరి చేయడం తప్పితే. నేను ఇక్కడ ఎంజాయ్ చేయాలి.. ఎంజాయ్ చేయనీయండి అంటుంది మల్లిక.

చేయ్.. చేయ్.. నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావని మా అమ్మకు తెలియాలి.. నీకు ఉంటది అని అంటాడు విష్ణు. మీ అమ్మ నన్ను పట్టుకోవాలంటే చాలా అప్ డేట్ అవ్వాలి. మీ అమ్మ బుర్ర 2జీ. నా బుర్ర 4జీ. కాబట్టి ఇప్పట్లో నన్ను పట్టుకోలేరు అంటుంది మల్లిక.

మరోవైపు వెన్నెల.. జానకికి ఫోన్ చేస్తుంది. నిన్ను ఏదైనా బాధపెడితే క్షమించు వదిన అంటుంది వెన్నెల. అది జరిగిపోయిన విషయం ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు అంటుంది జానకి. ఇక.. నేను ఉండను కదా వదిన. చివరి సారిగా నీకు సారీ చెప్పాలనిపించింది అంటుంది వెన్నెల.

వెన్నెల మాటలు రామా వింటాడు. ఏమైందమ్మా. నువ్వు ఎక్కడున్నావు. నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు అంటాడు. దీంతో చావుకు దగ్గర్లో ఉన్నాను అన్నయ్య అంటుంది వెన్నెల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

15 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

16 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

16 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

18 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

19 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

20 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

21 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

21 hours ago