Allu Arjun turns into a cruel villain for pushpa Movie
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలన విజయం నమోదు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించారు బన్నీ. అలాంటి సంక్లిష్టమైన పాత్రలో జీవించారని సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ అయిన తీరును చూసి అందరు ఆశ్యర్య చకితులయ్యారు. తాజాగా పుష్ప టీం ఆయన మేకొవర్‌కి సంబంధించి ఓ వీడియో విడుదల చేసింది.
అల్లు అర్జున్ ఇందులో కూలీగా లారీ డ్రైవర్ గా స్మగ్లర్ గా మూడు కోణాల్లో కనిపించారు. అయితే పుష్పరాజ్ గా తనను తాను మలచుకోడానికి బన్నీ తీవ్రంగా శ్రమించాడు. పుష్పరాజ్ పాత్రకి తగ్గట్టుగా మేకప్ వేసుకోవడానికి అంకితభావంతో తీవ్రంగా శ్రమించాడని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. మేకప్ కోసమే డైలీ కొన్ని గంటల సమయం కేటాయించారు. మేకప్ వేయడానికి రెండు గంటలు పడితే.. దాన్ని తొలగించడానికి అర గంటపైనే పట్టేదని ‘పుష్ప’ మేకర్స్ ఆ మధ్య తెలిపారు.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు బన్నీ నిబద్ధతపై కామెంట్స్ చేయడం పక్కా.
Allu Arjun turns into a cruel villain for pushpa Movie
పుష్ప సినిమా కోసం చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడానికి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు బన్నీ. అడవుల్లో స్మగ్లింగ్ చేసే క్లిష్టమైన పుష్పరాజ్ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని.. రెండేళ్ల పాటు షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. మొదటి భాగానికి మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే అమెజాన్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. ఏపీలో మాత్రం ఫ్లాప్‌గా నిలిచిన ‘పుష్ప’ మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.