Home » Entertainment » Janaki Kalaganaledu 10 June 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 10 June Today Episode : థర్డ్ రౌండ్ లో రామాకు చుక్కెదురు.. జ్ఞానాంబ వచ్చినా రామా గెలవలేకపోయాడా?

Authored By
Varun G
The Telugu News | Updated on: June 10, 2022, 11:32 am
Advertisement

Janaki Kalaganaledu 10 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 320 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ సడెన్ సర్ ప్రైజ్ ఇస్తుంది. మీరేంటి ఇక్కడ. మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు రామా. దీంతో నువ్వు ఇక్కడ కంగారు పడుతుంటే జ్ఞానం ఉండలేకపోయింది. అందుకే వెంటనే వచ్చేశాం అంటాడు గోవిందరాజు. నువ్వు రాగానే నాకు కంగారు పోయింది. గుండెల నిండా దైర్యం వచ్చింది అంటాడు. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. పోటీల్లో ఇష్టమైన వంట చేయమన్నారు. కానీ.. నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వే చెప్పమ్మా అని అడుగుతాడు. దీంతో సిరి ధాన్యలతో చిన్నప్పుడు నేను వంట చేసేవాడిని గుర్తుందా అని అడుగుతుంది. సిరి ధాన్యాలతో నువ్వు వంట చేయి. అవి పాత కాలపు జీవితాలలో భాగం కాబట్టి.. అది అందరినీ ఆకర్షిస్తుంది.. అని చెబుతుంది. దీంతో సరే అంటాడు.

Advertisement

janaki kalaganaledu 10 june 2022 full episode

అప్పుడే రామాను పిలుస్తారు. మీ సమయం స్టార్ట్ అవుతుంది. అందరూ వంటలు చేయడం ప్రారంభించండి అంటారు. దీంతో తన తల్లి చెప్పినట్టుగా సిరి ధాన్యాలతో వంట చేస్తుంటాడు రామా. మరోవైపు బట్టల షాపులో ఉండి టీవీ చూస్తూ ఉంటుంది మల్లిక. అప్పుడే కరెంట్ పోతుంది. దీంతో వెంటనే నీలావతిని అర్జెంట్ గా రమ్మంటుంది. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు అని అడుగుతుంది నీలావతి. మొన్న నా అంతట నేనే వచ్చి అడిగితే కొరుకుతా అని వెంటపడ్డావు. కానీ.. ఇప్పుడు నీ అంతట నువ్వే పిలిచి ఇస్తానంటున్నావు. ఎందుకు అని అడుగుతుంది నీలావతి. నేను మంచిదాన్ని కాబట్టి.. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను అంటుంది.

Advertisement

టైమ్ అవుతోంది గాయ్స్.. హర్రీ అప్ అంటుంది యాంకర్. తర్వాత టైమ్ అయిపోయింది అందరూ వంట వండటం ఆపేయండి అంటుంది. ఇప్పుడు మీరు చేసిన ఈ వంటలన్నీ బయట ఫుడ్ ఫెస్టివల్ లో సేల్ చేయాలి. ఎవరి ఫుడ్ అయితే ఎక్కువగా సేల్ అవుతుందో వాళ్లకే ఎక్కువ మార్కులు వస్తాయి.. అని చెబుతుంది.

మీరు మీ రెసీపీతో రెడీగా ఉన్నారు కదా అంటుంది. అందరూ అమ్మడానికి రెడీగా ఉంటారు. కాసేపట్లో టూరిస్టులు ఇక్కడికి వస్తారు అంటుంది యాంకర్. రామా.. మొక్కజొన్న పాయసం చేస్తాడు. చాలామంది అతడి దగ్గరికి వస్తారు కానీ.. ఎవ్వరూ టేస్ట్ చేయరు.

Advertisement

దీంతో రామాకు టెన్షన్ పట్టుకుంటుంది. మరోవైపు అందరూ అక్కడ నిలబడి చూస్తుంటారు. అందరికీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఒక కప్పు ఇవ్వండి అంటుంది. కానీ.. దాని వాసన చూసి తాగదు. ఇంతలో మరో అమ్మాయి కూడా వచ్చి తాగకుండానే వెళ్లిపోతుంది.

Janaki Kalaganaledu 10 June Today Episode :  ఉచితం అని చెప్పినా ఎవ్వరూ రామా పాయసం తాగరు

అందరూ వాసన చూసి వెళ్తారు తప్పితే ఎవ్వరూ తాగరు. దీంతో ఏం చేయాలా అని రామా.. జానకిని సైగలు చేసి అడుగుతాడు. దీంతో డబ్బులు లేకుండా ఫ్రీగా ఇచ్చేయండి.. అంటుంది. దీంతో పాయసం ఉచితం అండి.. తీసుకోండి అంటాడు రామా.

దీంతో ఉచితం అని చెప్పినా ఒక్కరు కూడా తన దగ్గరికి రారు. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. ఇంతలో ఓ పిల్లాడు అక్కడికొచ్చి నిలబడతాడు. అంకుల్.. ఇదేంటి అని అడుగుతాడు. తాగుతావా బాబు. పాయసం బాగుంటుంది అంటాడు.

దీంతో ఆ పిల్లాడు దాన్ని తాగుతాడు. ఇంతలో వాళ్ల అమ్మ వచ్చి ఏది పడితే అది తాగుతావా అని కోప్పడుతుంది. అది మంచిది కాదు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. నాకు ఇదే కావాలి అంటాడు పిల్లాడు. అది పిల్లలకు మంచిది బలం కూడా అంటాడు.

Advertisement

అందులో ఏం వేశారో చెప్పండి అని అడుగుతుంది. దీంతో అందులో సిరి ధాన్యాలు, పాలు, మొక్కజొన్న, బెల్లం అన్నీ బలమైనవే వేశానండి అంటాడు రామా. ముందు నాకు అది ఇవ్వండి. నేను తాగి చూస్తా. అది బాగుందో లేదో నేను తాగి చెబుతా అంటుంది ఆ యువతి.

దీంతో బాగుంది అంటుంది. మీరు ఒకటి తాగండి అని తన భర్తతో చెబుతుంది. దీంతో అతడు కూడా తాగుతాడు. బాగుంది అంటాడు. వాళ్లకు నచ్చి రూ.500 ఇస్తారు. దీంతో అందరూ సంతోషిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి