Janaki Kalaganaledu 10 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 429 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరిగిందో రామాకు విడమర్చి అంతా చెబుతుంది జానకి. దీంతో అఖిలే వందకు వంద శాతం ఆ అమ్మాయిని చంపడానికి చూశాడని ఎలా చెబుతారు. మీరు అఖిల్ కు వదిన. అంటే తల్లితో సమానం. అఖిల్ భవిష్యత్తు కోసం ఒక్క అబద్ధం ఆడండి. పదండి పోలీస్ స్టేషన్ కు వెళ్దాం.. మీరు కేసు వాపస్ తీసుకోండి అని జానకికి చెబుతాడు రామా. కానీ.. నేను అలా చేయలేనండి. నా మనసు ఒప్పుకోదు అని అంటుంది జానకి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు అందరూ అఖిల్ గురించే బాధపడుతూ ఉంటారు. ఇంతలో బయటికి జానకి వస్తుంది. చూస్తే ఎవ్వరూ టిఫిన్ కూడా చేయకుండా అలాగే కూర్చొని ఉంటారు. అత్తయ్య గారు మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. భోం చేద్దురు కానీ రండి అంటుంది జానకి.
దీంతో నా పేగు తెంచుకొని పుట్టిన కొడుకు కటకటాల్లో ఉంటే కన్నతల్లిగా నా కడుపు ఎలా నింపుకోగలను. కొన్నాళ్లు పోతే నాన్నా అని మురిపంగా పిలిపించుకోవాల్సిన నా కొడుకు జైలులో ఉంటే ఈ అమ్మ మనసు ఎలా తట్టుకుంటుంది. నాకేమీ తినాలనిపించడం లేదు అంటుంది జ్ఞానాంబ. మామయ్య గారు.. మీరు తింటే అత్తయ్య గారు కూడా తింటారు. రండి మామయ్య గారు భోం చేద్దురు గానీ ప్లీజ్ అంటుంది జానకి. దీంతో అఖిల్ కు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఎక్కువగా నాతోనే ఆడుకునేవాడు. నాదగ్గరే పడుకునే వాడు అని చెబుతాడు. ఒక రోజు నేను ఇంటికి తిరిగి వచ్చే సరికి చాలా రాత్రి అయింది. దీంతో అప్పటి వరకు నాకోసం తినకుండా అలాగే కూర్చొన్నాడు. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఇప్పుడు నాకు తిండి ఎలా సహిస్తుంది అని అంటాడు గోవిందరాజు.
దీంతో జెస్సీ దగ్గరికి వెళ్తుంది జానకి. నువ్వయినా వెళ్లి తిను అంటే నా ప్రాణం అలా పోలీస్ స్టేషన్ లో ఉంటే నాకు తిండి ఎలా సహిస్తుంది అక్క అంటుంది జెస్సీ. దీంతో చేసిందంతా చేసి తినమంటే ఎవరు మాత్రం తినగలరు జానకి అంటుంది మల్లిక.
దీంతో రామా దగ్గరికి వెళ్లి రామా గారు.. అందరినీ ఒప్పించి భోజనానికి తీసుకురండి. తినకుండా ఉంటే ఎలా చెప్పండి అంటే.. మేము తిండి తినకున్నా మీకు ఏం పర్వాలేదు కానీ.. మీ సిద్ధాంతం మీకు ముఖ్యం. మీరు భోం చేయండి అని చెప్పి రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో సెల్ లో ఉంటాడు అఖిల్. రామా స్టేషన్ కు వస్తాడు. రెండు నిమిషాలు నా తమ్ముడితో మాట్లాడుతా అంటాడు. దీంతో కుదరదు అంటాడు ఎస్ఐ. బతిమిలాడటంతో సరే మీరు త్వరగా మాట్లాడి వెళ్లండి అంటాడు పోలీస్.
ఒరేయ్ అఖిల్. నిన్ను ఇలా కటకటాల వెనుక చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నీకు ఏం కాదురా. భయపడకు అంటాడు. నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చావని అనుకున్నాను. కానీ.. ఓదార్చడానికి వచ్చావా అన్నయ్య అంటాడు అఖిల్.
నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య. నీకు దండం పెడతాను. నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అన్నయ్య అంటాడు అఖిల్. వదినకు నా మీద ఎందుకు అంత కోపం. నా మీద అంత మంచి ఒపినియన్ లేదు అంటాడు అఖిల్.
నీకు చేతనమైతే సంపాదించి చూపించు అంటూ నామీద బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. కాబోయే పోలీస్ ఆఫీసర్ కదా అన్నయ్య వదిన. తనేంటో నిరూపించుకోవడం కోసం నన్ను బలిపశువును చేసింది అంటాడు అఖిల్.
దీంతో బాధపడకు. నేను ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తాను. ఇన్ స్పెక్టర్ గారితో మాట్లాడుతాను అంటాడు రామా. కానీ.. కేసు నమోదు అయ్యాక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. మీరు ఏం చేసినా ఈలోపే చేయండి అంటాడు ఎస్ఐ.
మరోవైపు జ్ఞానాంబ.. తన కొడుకు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. గోవిందరాజు తనను ఓదార్చుతాడు. జెస్సీ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక.. జానకి కూడా దీనంగా కూర్చొంటుంది.
కానీ.. రామా తనతో మాట్లాడడు. దూరంగా ఉంటాడు. దీంతో తమ్ముడి మీద కేసు పెట్టానని రామా గారు నాకు దూరంగా ఉంటున్నారు అని అనుకుంటుంది జానకి. ఆ తర్వాత మళ్లీ రామా, జానకి మధ్య గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.