Karthika Deepam 10 Nov Today Episode : ఆనందరావు, హిమను మోనిత ఇంట్లో చూసి కార్తీక్ షాక్.. దీప కూడా అక్కడే ఉందని కార్తీక్ వాళ్లకు చెబుతాడా?

Advertisement
Advertisement

Karthika Deepam 10 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1506 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి గుడి అంతా ఊడ్చుతుంది దీప. నువ్వు ఇలాగే రోజూ ఊడ్చితే నీకు అంతా మంచే జరుగుతుంది అంటాడు పూజారి. అలాగే ఇవాళ కార్తీక పౌర్ణమి.. ఇవాళ 365 వత్తులు వెలిగిస్తే మంచిది అని చెబుతాడు. దీంతో సరే పంతులుగారు అంటుంది జానకి. అసలు ఉదయమే లేచి ఎక్కడికి వెళ్తుంది దీప అని తననే ఫాలో అవుతుంది మోనిత. తీరా చూస్తే ఇది ఇవన్నీ చేస్తుందా అని అనుకుంటుంది. మరోవైపు దీప ఎక్కడికి వెళ్లింది అని కార్తీక్ అనుకుంటాడు. వెళ్లి పంతులును అడుగుతుంది కానీ.. పంతులు చెప్పడు. 365 వత్తులు వెలిగిస్తే ఏంటి ఉపయోగం అని అడుగుతుంది.

Advertisement

karthika deepam 10 november 2022 full episode

దీంతో కార్తీక పౌర్ణమి నాడు వత్తులు వెలిగితే సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి అంటాడు పూజారి. అదా సంగతి. నేను కూడా దీపాలు వెలిగిస్తా. అప్పుడు కార్తీక్ నా దగ్గర ఉంటాడో.. ఈ వంటలక్క దగ్గరికి వెళ్తాడో చూస్తా అని అనుకుంటుంది మోనిత. కార్తీక్ ను నాకు దక్కేలా చేయి దేవుడా అని మొక్కుకుంటుంది మోనిత. దీపకు ఫోన్ చేస్తాడు కార్తీక్. కానీ.. దీప ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. మరోవైపు బాబు ఏడుస్తుండటంతో మోనిత ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు. ఇంతలో పని అమ్మాయి వస్తుంది. దీంతో వెళ్లి బాబును ఎత్తుకో అంటాడు. ఇంతలో మోనిత వస్తుంది. ఎక్కడికి వెళ్లావు మోనిత. బాబు ఏడుస్తున్నాడు. అలా వదిలి వెళ్లిపోవడమేనా అంటాడు.

Advertisement

దీంతో నువ్వు ఉన్నావు కదా. ఏడిస్తే నువ్వు చూసుకోవచ్చు కదా అంటుంది. చేతిలో ఇవన్నీ ఏంటి అని అడుగుతాడు. దీంతో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. అందుకే పూజ సామాగ్రి తెచ్చాను. మనం కార్తీక పౌర్ణమి పూజ చేద్దాం అంటుంది మోనిత.

మోనిత ఇంత హుషారుగా ఉందేంటి. దీప అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుందా?  అని అనుకుంటాడు కార్తీక్. వంటలక్క ఎక్కడ. చూశావా అని అడుగుతాడు. దీంతో చూశాను. గుడి దగ్గర. అక్కడ గుడి ఊడుస్తూ కనిపించింది అంటుంది మోనిత.

గుడి అంతా ఊడ్చి నీళ్లతో కడుగుతోంది అంటుంది మోనిత. వచ్చి పోయే భక్తులు ఇచ్చే చిల్లరతో కాలం గడిపేయొచ్చు. ఆల్ మోస్ట్ అడుక్కుతినే పరిస్థితి అనుకో కార్తీక్ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

Karthika Deepam 10 Nov Today Episode : ఆటో అమ్మేసిన ఇంద్రుడు మీద శౌర్యకు అనుమానం

ఏంటి కార్తీక్ అలా అయిపోయావు అనగానే ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. దీప అవసరాలు తీరుస్తున్నాడు. కష్టంలో ఉందంటే ఆలోచిస్తున్నాడు. డౌటే లేదు కార్తీక్ కు గతం గుర్తొచ్చినట్టుంది అని అనుకుంటుంది.

మరోవైపు బాబాయి సంగారెడ్డి వెళ్దామా అని అడుగుతుంది శౌర్య. దీంతో రేపు ఉదయమే మొదటి బస్సుకు వెళ్దాం అంటాడు. ఎందుకు ఆటో ఉంది కదా అంటుంది శౌర్య. దీంతో ఆటో అమ్మేశాను అంటాడు.

ఎందుకు అమ్మాయి అంటుంది. దీంతో ఆటో తోలడం వల్ల నడుము నొప్పి వచ్చింది. దీంతో ఆటో తోలడం ఆపేయ్ అని డాక్టర్ చెప్పాడు అంటుంది. వీళ్లు అమ్మానాన్నలను వెతుకుదాం అంటే ఎందుకు ఇలా మారిపోయారు అని అనుకుంటుంది శౌర్య.

మరోవైపు ఇంటికి వస్తుంది దీప. ఇంతలో డాక్టర్ బాబు వస్తాడు. నువ్వు గుడి దగ్గర ఊడుస్తున్నావా అని అడుగుతాడు కార్తీక్. దీంతో నిజమే డాక్టర్ బాబు. నా బిడ్డ కనిపించే వరకు నేను దేవుడి గుడిని ఊడుస్తా అని మొక్కుకున్నాను అంటుంది దీప.

కార్తీక పౌర్ణమి కదా. గుడిలో 365 వత్తులు వెలిగించేందుకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతుంది. దీంతో నువ్వు ఇంకోసారి బాధపడకు. డబ్బుల విషయంలో మొహమాట పడకు. ప్రస్తుతానికి ఈ డబ్బులు ఉంచు అంటూ డబ్బులు ఇవ్వబోతుండగా వచ్చిన మోనిత ఆ డబ్బులను లాక్కుంటుంది.

బంగారం తాకట్టు పెట్టింది ఇందుకోసమేనా కార్తీక్. ఈ వంటలక్కకు తగిలేసేందుకేనా అంటుంది. అసలేం చేస్తున్నావో అర్థం అవుతోందా కార్తీక్. నన్ను డబ్బులు అడిగితే ఎందుకు అడుగుతానని చెప్పి బంగారం తాకట్టు పెట్టి ఈవిడకు ఇస్తున్నావా?

అంత దూరం వెళ్లిపోయిందా మీ మధ్య సంబంధం అంటుంది మోనిత. కావాలని కార్తీక్ ను రెచ్చగొడుతుంది మోనిత. నువ్వెందుకు వంటలక్కకు డబ్బులు ఇవ్వాలి. ఇది అడుక్కుంటే నీకేంటి.. ఏమైపోతే నీకేంటి అని అంటుంది మోనిత.

దీంతో మోనిత చెంప చెళ్లుమనిపిస్తాడు కార్తీక్. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా. నువ్వు ఈరోజు పూజ చేస్తున్నావు కదా. ఎవరి కోసం నీ భర్త కోసం. అంటే ఎవరి కోసం నాకోసమే కదా.

నువ్వు నీ భర్త కోసం చేస్తున్నట్టు.. తన భర్త కోసం చేస్తోంది. ఇందులో తప్పేముంది అంటాడు కార్తీక్. పూజ కోసం డబ్బులు లేకపోతే ఎదురు బదురు ఉన్నవాళ్లం కదా అని కాస్త డబ్బు ఇస్తే లేనిపోని సంబంధం అంటగడతావా? అంటాడు కార్తీక్.

ఇంతలో దుర్గ వస్తాడు. మోనిత నువ్వు ఇక్కడున్నావా? నీకోసం అక్కడ వెతుకుతున్నా అంటాడు. ఈ షూ ఎలా ఉన్నాయి అంటాడు. దీంతో నీ షూ ఎలా ఉంటే నాకేంట్రా.. అని అడుగుతుంది.

దీంతో నీ చెప్పులు బాగోలేవు.. షూ కొనుక్కో అని పది వేలు ఇచ్చావు కదా. చూపిస్తే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు దుర్గ. దీంతో కార్తీక్ కు కోపం వస్తుంది. షూ కొనడానికి నువ్వు దుర్గ గారికి 10 వేలు ఇవ్వొచ్చు కానీ.. పూజ చేసుకోవడానికి వంటలక్కకు నేను 10 వేలు ఇవ్వకూడదా అంటాడు కార్తీక్.

మోనిత వంటలక్కకు ఆ డబ్బులు ఇవ్వు. నీ చేతితోనే ఇవ్వు అంటాడు కార్తీక్. దుర్గ కూడా ఇవ్వు అంటాడు. దీంతో తన చేతులతోనే డబ్బులు దీపకు ఇస్తుంది మోనిత. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే ఆనంద్ ను చూడటానికి హిమ, ఆనంద రావు వస్తారు. తమ్ముడిని మాతో పాటు తీసుకెళ్తాం అంటారు. ఇంతలో కార్తీక్ బయటి నుంచి రావడం చూసిన మోనిత ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది.

ఎవరు ఉన్నారు లోపల. ఎందుకు నన్ను రానివ్వడం లేదు అంటూ లోపలికి వెళ్లబోతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

48 mins ago

China Discovers : భారీ బంగారు నిల్వల‌ను క‌నుగొన్న చైనా.. విలువ ఎంతో తెలుసా ?

China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వ‌ల‌ను కనుగొంది. ఈ నిల్వ‌ల యొక్క అంచనా విలువ…

2 hours ago

TTD : కీల‌క అప్‌డేట్ ఇచ్చిన టీటీడీ.. న‌వంబ‌ర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…

3 hours ago

Elon Musk : భార‌త ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై ఎలాన్ మ‌స్క్ ప్ర‌శంస‌లు

Elon Musk : టెస్లా అధినేత‌, బిలియ‌నీర్‌ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…

4 hours ago

Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ కి మొదటి షాక్.. 33 కథలు అవుట్ డేటేడేనా..?

Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…

6 hours ago

Heels Cracked : కాళ్ళ మాడమలు పగలడంతో ఇబ్బంది పడుతున్నారా… వీటిని రాసుకోండి…??

Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…

7 hours ago

Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!

Hero Splendor Plus  : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…

8 hours ago

Acidity : అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే… ఈ నాలుగు ఆహారాలు బెస్ట్…??

Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…

9 hours ago

This website uses cookies.