
janaki kalaganaledu 11 january 2022 full episode
Janaki Kalaganaledu 11 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జనవరి 2021, మంగళవారం ఎపిసోడ్ 211 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోడలును మనం కనీసం స్టేషన్ కు వెళ్లకుండా కూడా ఆపలేకపోయాం. ముందు తనను త్వరగా బయటికి తీసుకురావాలి.. అంటాడు గోవింద రాజు. దీంతో ముందు మనం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని జ్ఞానాంబ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో జానకి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో రామా వస్తాడు. కానీ.. రామాను పంపించరు. రెండు నిమిషాలు నా భార్యతో మాట్లాడాలి అంటాడు. ముందు కానిస్టేబుల్ వెళ్లనీయదు. తర్వాత రామా పర్మిషన్ తీసుకొని జానకి వద్దకు వెళ్తాడు.
janaki kalaganaledu 11 january 2022 full episode
జానకి గారు అని పిలుస్తాడు. పోలీస్ డ్రెస్ లో ఐపీఎస్ టోపీ పెట్టుకొని డ్యూటీ చేస్తున్న మిమ్మల్ని చూడాలని కలలు కన్నానండి.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి తట్టుకోవడం నావల్ల కావడం లేదు జానకి గారు.. అంటాడు రామా. ప్రాణం విలవిలలాడిపోతోందండి అంటాడు. మీ కంట్లో కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటానని మీకు మాటిచ్చాను. కానీ.. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా రాకుండా ఆపలేకపోయానండి.. నా మీద నాకే చాలా కోపంగా ఉందండి అంటాడు రామా. ప్రతి విషయం నాకు చెబుతారు కదా. కన్నబాబుతో గొడవ జరిగిన విషయం కూడా నాకు చెప్పాల్సింది అంటాడు. ఎలా చెప్పాలి మీకు రామా గారు అంటూ తనలో తానే బాధపడుతుంది జానకి. వెన్నెల విషయాన్ని మాత్రం అస్సలు చెప్పదు జానకి. తనలో తానే కుమిలిపోతుంది.
చెప్పండి.. ఏం జరిగింది అని అడుగుతాడు. ఎందుకు చెప్పలేదండి అంటాడు. కానీ.. జానకి మాత్రం ఏం చెప్పదు. ఇంతలో జ్ఞానాంబ, గోవింద రాజు కూడా వస్తారు. నీ మౌనానికి కారణం ఏంటి జానకి అని అడుగుతుంది. దీంతో అత్తయ్య గారు మీరెందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు అని అంటుంది జానకి.
వెళ్లండి అత్తయ్య గారు.. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అంటుంది జానకి. నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. మరి నా కోడలును పోలీసులు అరెస్ట్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది. అసలు.. ఏం జరిగింది. కన్నబాబుతో నీకేంటి గొడవ అని జ్ఞానాంబ అడుగుతుంది. కానీ.. జానకి నోరు విప్పదు.
జానకి నువ్వు ఏం జరిగిందో చెప్పి తీరాలి.. అంటుంది. కన్నబాబు మీద ఎందుకు చేయి వేసుకున్నానో చెబితే.. వెన్నెల ప్రేమ విషయం కూడా తెలిసిపోతుంది. దీంతో అత్తయ్య గారు వెన్నెల మీద ఏదైనా కోపం చూపిస్తే వెన్నెల ఏదైనా చేసుకుంటే ఎలా? అని అనుకుంటుంది.
క్షమించండి అత్తయ్య గారు నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అంటుంది జానకి. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అరె ఏంటి జానకి నువ్వు.. పరిస్థితి ఏంటో కూడా నీకు అర్థం కావడం లేదు.. అని జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. కానీ.. జానకి నోరు మాత్రం విప్పదు.
అందరినీ అక్కడి నుంచి పోలీసులు పంపించేస్తారు. మరోవైపు సునంద దగ్గరికి గోవింద రాజు, జ్ఞానాంబ వెళ్తారు. ఏం జ్ఞానాంబ.. ఎండన పడి వచ్చినట్టున్నావు. మజ్జిగ చెప్పాలా? బాగా వేడిగా ఉన్నట్టున్నావే.. కాఫీ, టీ ఏమైనా తాగుతావా? వద్దా అయితే ఓకే అంటుంది సునంద.
ఏంటి.. కోడలును పోలీస్ స్టేషన్ నుంచి విడిపించమని బతిమిలాడటానికి వచ్చావా అంటుంది సునంద. నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు జ్ఞానాంబ. అందుకే నాకు బయటికి వెళ్లే ముఖ్యమైన పని ఉన్నా సరే… క్యాన్సిల్ చేసుకొని నీకోసమే ఇంట్లో వెయిట్ చేస్తున్నాను అంటుంది సునంద.
జ్ఞాన ప్రసుమాంబ అంటే.. పరువుకు పెట్టింది పేరు.. అంటుంది సునంద. అలాంటి జ్ఞానాంబ కోడలును అరెస్ట్ చేసి ఆత్రేయపురంలో నడిపించుకుంటూ తీసుకెళ్తే తట్టుకోలేకపోయావా? స్వీటు కొట్టు నడిపించుకునే నీకే అంతుంటే.. కార్పొరేటర్ ను.. నాకెంత ఉండాలి అంటుంది సునంద.
నా కొడుకును కొడితే నేను ఊరుకుంటానా.. అంటుంది సునంద. చూడు.. కేసు వెనక్కి తీసుకో అని నిన్ను బతిమిలాడటానికి నేను ఇక్కడికి రాలేదు. వెనక్కి తీసుకోకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని చెప్పడానికి వచ్చాను అంటుంది జ్ఞానాంబ.
నీకొడుకును నా కోడలు కొట్టింది అంటే.. వాడు ఏదో వెదవ వేషాలు వేసి ఉంటాడు. తప్పు చేసిందే కాకుండా నీకు అధికారం ఉందని వాడితో కేసులు పెట్టించావా? వాడితో పాటు నువ్వు కూడా తప్పు చేశావు సునంద.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
మరోవైపు జానకిని పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు.. అని అనుకుంటుండగానే స్వీట్ కొట్టుకాడికి శ్రావణి వస్తుంది. కార్పొరేటర్ కొడుకు కన్నబాబును కొట్టిందని జానకిని కోర్టుకు తీసుకెళ్తున్నారు..అని చెబుతాడు రామా.
దీంతో తను కోర్టుకు వెళ్లిందంటే.. తను ఐపీఎస్ కాలేదు అని చెబుతుంది శ్రావణి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఫిర్యాదు ఇచ్చిన వాళ్లను ఎలాగైనా ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయండి అని శ్రావణి.. రామాతో చెబుతుంది. దీంతో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు రామా.
ఇంతలో కన్నబాబు సిట్టింగ్ వేస్తాడు. తనకు ఫోన్ చేస్తాడు రామా. కన్నబాబు ఎక్కడున్నావు అని అడుగుతాడు రామా. రా.. నువ్వు నేను కలిసి పెగ్గేద్దాం అంటాడు. నీతో మాట్లాడాలి అంటాడు రామా. నిన్ను కలిసి మాట్లాడాలి అంటాడు. అయ్ బాబోయ్ అంత సీరియస్సా.. సరే.. నీ సరదాను ఎందుకు కాదనడం.. మా తోట్లో ఉన్నాం వచ్చేయ్ అంటాడు.. సరే వస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.