Janaki Kalaganaledu 11 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మే 2022, బుధవారం ఎపిసోడ్ 298 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ జ్ఞానాంబ తన స్వీటు షాపును నీకు తెచ్చి ఇస్తుంటే ఆ ఆనందం ఎంతో బాగుంటుంది అంటాడు కన్నబాబు. రేపు ఆ జ్ఞానాంబ స్వీటు షాపునకు వెళ్లి 10 రోజుల్లో ఆ స్వీటు షాపు నా సొంతం కాబోతోందని ఆ రామా గాడికి స్వీటు వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటాడు కన్నబాబు. మరోవైపు తమ స్వీటు షాపును డెకరేట్ చేస్తుంటారు అందరూ. రామా, జానకి, మల్లిక, విష్ణు.. అందరూ కలసి డెకరేట్ చేస్తుంటారు. ఇంతలో వెన్నెల.. థాంక్యూ సోమచ్ అంటూ జానకికి చెబుతుంది. దీంతో థాంక్స్ ఎందుకు అంటే.. ఈ మదర్స్ డే సెలబ్రేట్ చేద్దామని సలహా ఇచ్చింది నువ్వే కదా అంటుంది వెన్నెల.
ఈ సడెన్ సర్ ప్రైజ్ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అంటుంది వెన్నెల. వదిన ఎప్పుడూ మనమంతా సంతోషంగా ఉండాలని చూస్తుంది వెన్నెల అంటాడు అఖిల్. నీకు గుర్తుందా.. వదిన వచ్చిన కొత్తలో అమ్మ బర్త్ డే వేడుకలు జరిపించింది. మొన్నటికి మొన్న అమ్మానాన్న మ్యారేజ్ యానివర్సరీని కూడా జరిపించింది. అమ్మకు చెందిన జ్ఞాపకాలను జానకి వదిన అస్సలు మరిచిపోదు అంటాడు అఖిల్. పెద్ద కోడలును అమ్మ తర్వాత అమ్మ అంటారు. అమ్మ తర్వాత అంత బాధ్యతగా ఇంటి గురించి మీరే ఆలోచిస్తారు వదిన అంటాడు విష్ణు.
ఇంతలో మల్లిక కల్పించుకొని మరి నేనేం చేస్తాను.. కొంపను కొల్లేరు చేద్దామని ఆలోచిస్తానా అంటుంది మల్లిక. దీంతో నీ గురించి నువ్వు కరెక్ట్ గా చెప్పుకున్నావు అంటాడు విష్ణు. దీంతో మల్లికకు కోపం వస్తుంది. ఏదో మాట్లాడబోతుంటే.. మల్లిక అందరం సంతోషంగా ఉన్నాం కదా అంటాడు రామా.
అందరూ ఇంటికెళ్లి జ్ఞానాంబ, గోవింద రాజును స్వీటు షాపునకు తీసుకొచ్చేందుకు వెళ్తారు. అప్పుడే కన్నబాబు వస్తాడు. అదిరిందయ్యా రామయ్య.. బాగా డెకరేట్ చేస్తున్నారు అని రామాతో అంటాడు. దీంతో ఏం కావాలి అని అడుగుతాడు రామా.
దీంతో ఈ షాపు కావాలి అంటాడు. దీంతో రామా షాక్ అవుతాడు. అదేంట్రా వారం తర్వాత ఈ షాపు మనదే కదరా అని నూకాలుతో అంటాడు. జ్ఞానాంబ పేరును తీసేసి.. సునంద అని వారం తర్వాత పేరు పెట్టిద్దాం అంటాడు కన్నబాబు. దీంతో రామాకు కోపం వస్తుంది.
తన గల్ల పట్టుకుంటాడు రామా. దీంతో ఒరేయ్ నూకాలు.. ఒకసారి ఆ నోటు మీద ఉన్నది చదవరా.. మనోడు వినిపెడతాడు అని నూకాలుతో చెబుతాడు కన్నబాబు. ఆ నోటులో ఉన్నది విని షాక్ అవుతాడు రామా. 10 రోజుల్లో అప్పు తీర్చకపోతే ఈ షాపు కన్నబాబు సొంతం అవుతుందని నేను సంతకం పెడుతున్నాను అని అందులో రాసి ఉండటంతో రామా షాక్ అవుతాడు.
నేను అప్పు తీసుకున్నది వీరేంద్ర గారి దగ్గర. నీ దగ్గర కాదు. నా షాపును కొట్టేసేందుకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించావా.. నీ అంతు చూస్తా అంటాడు. దీంతో వీరేంద్రను పిలుస్తాడు కన్నబాబు. చూడు.. ఏంటండి ఇది అంటాడు కన్నబాబు.
దీంతో ఆ ఫైనాన్స్ ఆఫీసు కన్నబాబు గారిదే.. కాకపోతే నేను నడిపిస్తున్నాను అంటాడు వీరేంద్ర. ఫైనాన్స్ షాపు అతడిదని నాకు ముందెందుకు చెప్పలేదు అంటాడు. దీంతో నువ్వు అడగలేదు కదా బాబు. ఊరందరికీ తెలుసు. అలాగే నీకు కూడా తెలుసు అనుకున్నాను అంటాడు వీరేంద్ర.
మీరందరూ కలిసి కుట్ర చేసి నన్ను మోసం చేశారని అర్థం అయింది అంటాడు రామా. దీంతో ఇది మోసం కాదు.. వ్యాపారం అంటాడు కన్నబాబు. నేను ఎవరి దగ్గర అయినా సరే.. షూరిటీ పెట్టుకొనే డబ్బులు ఇస్తాను. నీ షాపు షూరిటీ పెట్టుకొనే డబ్బులు ఇచ్చాను అంటాడు.
ఇవన్నీ అక్కడికొచ్చిన నీలావతి వింటుంది. నేను అప్పు తీసుకునేటప్పుడు నాకు షూరిటీ విషయం చెప్పలేదు అంటాడు రామా. నీకు ఇంకా 8 రోజలు సమయం ఉంది. దర్జాగా నా లక్ష నాకివ్వు. అంతే దర్జాగా నీ కాగితాలు నీకు ఇచ్చేస్తాను. దీనికి ఇంత గొడవ ఎందుకు చెప్పు అంటాడు కన్నబాబు.
రామచంద్రా గుర్తుపెట్టుకో. గడువు 8 రోజులు. ఆలోపు నువ్వు డబ్బులు కట్టకపోతే ఈ షాపు నా సొంతం అని చెప్పి అక్కడి నుంచి కన్నబాబు వెళ్లిపోతాడు. అన్నీ విన్న నీలావతి వెంటనే మల్లిక దగ్గరికి వెళ్లి కన్నబాబు, రామాకు మధ్య జరిగిన గొడవ గురించి చెబుతుంది.
చూస్తుంటే.. షాపు గురించే గొడవ జరుగుతోందని అర్థం అయింది అంటుంద నీలావతి. ఇది చాలు నాకు.. మ్యాటర్ లాగేస్తాను కదా అంటుంది మల్లిక. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జ్ఞానాంబను స్వీటు కొట్టు దగ్గరికి తీసుకెళ్తారు. దీంతో తనకు ఏం అర్థం కాదు.
స్వీటు కొట్టు దగ్గర డెకరేషన్ చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ. అందరూ తనకు హ్యాపీ మదర్స్ డే చెప్పడంతో తెగ సంతోషిస్తుంది జ్ఞానాంబ. మదర్స్ డే అంటే ఏంటి అని అడుగుతుంది. దీంతో అమ్మను, అమ్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది అంటుంది వెన్నెల.
దీంతో మనకు ఇవన్నీ ఎందుకురా రామా అంటుంది జ్ఞానాంబ. కానీ.. జానకి మాత్రం అమ్మ ప్రతిరోజు దేవతే అత్తయ్య గారు. ఆ దేవతలను ప్రతి రోజు గుండెల్లో పెట్టుకొని పూజిస్తూనే ఉంటాం అంటుంది జానకి. కాకపోతే అమ్మ మీద పిల్లలకు ఉన్న ప్రేమనంతా పిల్లలంతా కలిసి జరుపుకోవడానికి ప్రత్యేకంగా ఒక సందర్భం కావాలి. ఆ సందర్భమే ఈ మదర్స్ డే అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.