Janaki Kalaganaledu 11 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 430 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీస్ స్టేషన్ లో అఖిల్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ నడుచుకుంటూ వెళ్లబోతూ స్పృహ తప్పి కింద పడబోతుండగా రామా పట్టుకుంటాడు. ఏమైందమ్మా అంటాడు. నీరసంగా ఉందని తెలుసుకొని వెంటనే తనకు కొన్ని నీళ్లు తాగించి ఎందుకమ్మా ఏం తినకుండా ఉంటున్నావు అంటాడు. నేను ఇప్పుడు తిని మాత్రం చేసేది ఏముంది అంటుంది జ్ఞానాంబ. దీంతో ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం నేను చేస్తాను అని చెప్పి జానకి దగ్గరికి వెళ్తాడు రామా. జానకి గారు ఎంతో చదువుకున్న మీకు బాగా బాధ్యతగా మసులుకునే మీకు, కుటుంబ బంధాలు కాపాడుకోవాలన్న ఉద్దేశం ఉన్న మీకు, ఇంటి మర్యాదలు కాపాడాలని ఆరాటం ఉన్న మీకు, ముఖ్యంగా ఈ ఇంటి పెద్ద కోడలుగా ధర్మాన్ని కాపాడాలనే ఆరాటం ఉన్న మీకు వాటి గురించి మీకు నేను నా నోటితో చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటాడు రామా.
జానకి గారు.. పెద్దగా చదువుకోని నేను ఎప్పుడో విన్న కథలు నాకు తోచిన విధంగా మీకు అర్థం అయ్యేలా చేస్తాను. శత్రువు తమ్ముడి సూచనల వల్లే రాముడు.. రావణాసూరుడి కుంభస్థలాన్ని ఢీకొట్టగలిగాడు. పాండవులు కూడా ధర్మాన్ని పట్టుకొని కూర్చొంటే అన్యాయాన్ని గెలిచేవారా? అఖిల్ విషయం మీరు చేస్తున్నది అదే. కోడలుగా మీరు పాటించే ధర్మానికి నోరు కట్టేస్తున్నారు. మీ వైపు నుంచి మీరు చేసేది కరెక్టేనేమో. మీరు తప్పు చేస్తున్నారని నేను అనడం లేదు కానీ.. అందరి వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన ఈ ఒక్క పని వల్ల మన ఫ్యామిలీ భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి వెళ్తుంది. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎన్నో కష్టనష్టాలు వస్తాయి.. అంటాడు రామా.
మీరు మీ తమ్ముడి మీద మమకారంతో మాట్లాడుతున్నారు. నేనేమో ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలని చూస్తున్నాను. అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది జానకి. ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయమని నేను కూడా చెప్పడం లేదు. మీరేంటో పూర్తిగా తెలిసిన నేను నిజాయితీ తప్పి ప్రవర్తించండి అని కూడా నేను అనడం లేదు అంటాడు.
నేనేమీ మూర్ఖంగా కేసు పెట్టలేదు. అన్నీ ఆలోచించాకే కేసు పెట్టాను అంటుంది. దీంతో వాడిని సంపాదన విషయంలో మీరు ఎంత టార్చర్ పెట్టాడో నాకు అన్నీ చెప్పాడు అంటాడు రామా. కోడలుగా మీ బాధ్యత ఇంట్లో వాళ్లను ఎప్పటికీ సంతోషంగా ఉంచేలా ఉండాలి కానీ.. మనలో మనకు గొడవలు వచ్చేలా ఉండకూడదు అంటాడు.
మీరు ఎంత సేపు కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అవన్నీ వదిలేయండి. కేసు రాసే లోపు మీరు పెట్టిన కేసును వెనక్కి తీసుకొందురు రండి అంటాడు రామా. తన చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. తను ఆగు అన్నా కూడా ఆగడు. ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటే అఖిల్ లో పచ్చాతాపం రాదు. ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాడు అనుకుంటుంది.
అందుకే రామా చేయి వదలండి అంటుంది జానకి. నేను కంప్లయింట్ వెనక్కి తీసుకోలేను రామా గారు. క్షమించండి అంటుంది జానకి. దీంతో రామా తన చేయి వదిలేస్తాడు. దీంతో తను లోపలికి వెళ్లబోతుండగా జానకి గారు మీ ఈ నిర్ణయం మనింట్లో చాలామంది బాధలకు కారణం అవుతుంది అంటాడు.
దయచేసి నా మాట విని స్టేషన్ కు వెళ్దాం రండి అంటాడు. ఇంతలో అక్కడికి అందరూ వస్తారు. జానకి గారు మిమ్మల్నే అడిగేది అంటే క్షమించండి రామా గారు అంటుంది. నేను కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ గా మాట్లాడటం లేదు. ఒక మనిషిగా నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేను అంటుంది జానకి.
మంటంటుకోకపోతే కట్టెను, అంటుకున్నాక కొరివిని అన్నట్టు పెద్దకోడలుగా బాధ్యతలు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. జానకి ఆశయం నిలబడాలని చెప్పి వెంటపడి మరీ చదివిస్తున్నారు. తనేమో ఒక కోడలుగా బాధ్యతలు మరిచిపోయి పోలీస్ ఆఫీసర్ లా ఆలోచించి అఖిల్ మీద కేసు పెట్టింది. ఆవిడగారు ఏ తప్పు చేసినా వెనకేసుకొచ్చి గుండెల మీద పెట్టుకొని చూసుకున్నారు కదా.
దీంతో మీ గుండెల మీదనే తన్నింది. ఇప్పటికైనా అర్థం అయిందా అత్తయ్య గారు అసలు మన జానకి మనస్తత్వం ఏంటో అని అంటుంది మల్లిక. దీంతో చదువు భవిష్యత్తుకు బాటలు వేయాలి కానీ.. ఇలా కుటుంబంలో గొడవలు తీసుకురావద్దనే ఆరోజు నేను చదువును వ్యతిరేకించాను.
ఇప్పుడు పాముకు పాలు పోసినట్టే అయింది. నువ్వు చదువుకొని పద్దతిగా ఉంటాను అన్నావు..అంటుంది జ్ఞానాంబ. జానకి గారు మీరిప్పుడు నీతి, నియమం అని మాట్లాడుతున్నారు కదా.. మరి ఎన్నోసార్లు అమ్మకు చెప్పకుండా ఏ పని చేయని నేను మీకోసం చాలా చేశాను. మీకోసం నేను, అమ్మ, మిగితా వాళ్లం అందరం ఏం చేసినా సహాయపడాల్సింది పోయి మీరు ఇలా చేయడం నమ్మక ద్రోహంలా అనిపిస్తోంది అంటాడు రామా.
మీరు కేసు వాపస్ తీసుకోకపోయినా మాకు తెలుసు అఖిల్ ను ఎలా కాపాడుకోవాలో.. ఒరేయ్ విష్ణు పదరా అంటాడు రామా. దీంతో మేము కూడా వస్తాం అని అందరూ అంటారు. అందరూ స్టేషన్ కు వెళ్తారు. జానకిని వదిలేసి అందరూ వెళ్తారు. దీంతో జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
పోలీస్ స్టేషన్ లో ఉన్న అఖిల్.. అందరినీ చూసి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్తారు. అఖిల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏదైనా సరే మీరు కోర్టులో తేల్చుకోవాల్సిందే అంటాడు ఎస్ఐ. అలా అనకండి సార్.. నా తమ్ముడు కోర్టుకు వెళ్లకూడదు. వాడిని ఇట్నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో మార్గం చెప్పండి సార్ అంటాడు రామా.
మీకు దండం పెడతాను. ఎలాగైనా సరే నా తమ్ముడు బయటికి వచ్చే మార్గం చెప్పండి సార్. ఊర్లో పరువుగల కుటుంబం సార్ మాది. అర్థం చేసుకొని నా తమ్ముడిని బయటికి పంపించండి సార్ అంటాడు. దీంతో రూల్స్ ను నేను బ్రేక్ చేయలేను. మీరు లాయర్ ను పెట్టుకొని కోర్టులో చూసుకోవాల్సిందే అంటాడు పోలీస్.
ఒకసారి మా అబ్బాయితో మాట్లాడి వెళ్తాం ఇన్ స్పెక్టర్ గారు అంటారు. అఖిల్ దగ్గరికి వెళ్లి అఖిల్ తో మాట్లాడుతారు అందరూ. ఏంట్రా ఇది. నీ మీద ఈ నిందలు ఏంటి. అసలు నిజం ఏంటి.. నిన్ను ఇలా చూడటానికా గుండెల్లో పెట్టుకొని పెంచుకుంది అని అడుగుతుంది జ్ఞానాంబ.
అమ్మ నిన్ను తెలిసో తెలియకో బాధ పెట్టాను తప్ప నువ్వు తలదించుకునే పని ఎప్పుడూ చేయను. ఒక ఆడపిల్లను చంపాలనుకునే దుర్మార్గుడిని కాదు అంటాడు అఖిల్. నన్ను ఎలాగైనా బయటికి తీసుకురా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.