karthika deepam 11 november 2022 full episode
Karthika Deepam 11 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. ఈరోజు 11 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1507 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద రావు తన ఇంటికి రావడం చూసి షాక్ అవుతుంది మోనిత. హిమ ఆనంద్ తో ఆడుకుంటోంది. బాబును తీసుకెళ్లాలని అనుకుంటోంది. లోపలికి రా..అని వెళ్తాడు ఆనంద రావు. మరోవైపు మోనితకు కార్తీక్ ఎక్కడ వస్తాడో అని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. హిమ బాబును కొన్ని రోజులు ఉంచుకుంటాం అంటుంది. బాబును ఇస్తే ఏమయ్యాడని కార్తీక్ అడుగుతాడు. ఇవ్వకపోతే వీళ్లు వదిలేలా లేరు. బాబు గురించి ఏదైనా చెప్పొచ్చు. ముందు వీళ్లను ఇక్కడి నుంచి పంపించేయాలని అని అనుకుంటుంది మోనిత. శివలత బాబు బట్టలు సర్దు అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తుంది.
karthika deepam 11 november 2022 full episode
కార్తీక్, దీప, దుర్గ ముగ్గురిలో ఎవ్వరినీ ఇంటి వైపునకు రానివ్వకూడదు అని అనుకుంటుంది మోనిత. ఇంతలో దీప ఇంటికి వెళ్లి కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. దీంతో వెళ్లిపోయాడు అంటుంది దీప. దీంతో దుర్గ ఎక్కడ అని అడుగుతుంది. దీంతో నీకు దుర్గ కావాలా? కార్తీక్ కావాలా? అని అడుగుతుంది దీప. నాకు సూటిగా సమాధానం చెప్పు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. మీ ఇంట్లోనే ఉంటే మా ఇంట్లోకి వచ్చి వెతుకుతున్నావు ఎందుకు అని అంటుంది దీప. దీంతో మళ్లీ ఇంటి వైపునకు పరుగెడుతుంది మోనిత. ఎక్కడికి వెళ్లింది మీ మేడమ్ అని ఆనంద రావు అడుగుతాడు శివలతను. దీంతో ఇక్కడికే వెళ్లింది అని అంటుంది. ఇంతలో కార్తీక్ ఇంట్లోకి రాబోతుండగా చూసిన మోనిత.. ఫోన్ చేసి ఆగు కార్తీక్ అంటుంది మోనిత. లోపలికి వెళ్లొద్దు అంటుంది మోనిత.
ఏం వస్తే మీ ఏకాంతానికి భంగమా. రెండు మూడు గంటలు బయట తిరిగి రావాలా అంటాడు కార్తీక్. దీంతో మన శివకు యాక్సిడెంట్ అయింది అంటుంది మోనిత. కారు గుద్దేసిందట. చాలా సీరియస్ గా ఉందట పదా అని చెప్పి కార్తీక్ ను కారులో తీసుకెళ్లబోతుంది. ఇంతలో శివ వస్తాడు అక్కడికి. శివను చూసి షాక్ అవుతాడు కార్తీక్.
నీకు ఏం కాలేదు కదా. బాగానే ఉన్నావు కదా అంటాడు. శివ బాగానే ఉన్నాడు కదా. యాక్సిడెంట్ అయిందని చెప్పావేంటి అని మోనితను అడుగుతాడు కార్తీక్. నాకు యాక్సిడెంట్ అవడం ఏంటి మేడమ్.. అయినా లారీ కొట్టడం ఏంటి తలుచుకుంటేనే భయం వేస్తోంది మేడమ్ అంటాడు శివ.
అసలు నీకు ఎవరు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చూపించు అంటాడు కార్తీక్. దీంతో మోనితకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఎవరో అన్ నోన్ నెంబర్ కార్తీక్ అంటుంది మోనిత. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనేది నీ ప్లాన్ కదా. లోపల నేను చూడకూడనిది ఏమైనా ఉందా. ఎవరు ఉన్నారు లోపల అంటాడు కార్తీక్.
దీంతో ఎవరూ లేరు కార్తీక్ అంటుంది మోనిత. కానీ.. కార్తీక్ మాత్రం వినడు. తనను కాదని లోపలికి వెళ్లబోతాడు. లోపలికి వెళ్తాడు. కానీ.. ఎవరూ ఉండరు. శివలత అప్పటికే ఆనంద రావు, హిమ వాళ్లను పంపించేస్తుంది. ఇంతకీ ఆనంద్ ఏడి అని అడుగుతాడు కార్తీక్.
ఇప్పుడు వాడి గురించి ఎందుకు కార్తీక్. వాడిని అడ్డం పెట్టుకొని నన్ను ఏదైనా అందామనా అంటుంది మోనిత. ఇంతలో శివ వచ్చి మేడమ్ నాకు యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు మేడమ్ అంటాడు శివ. దీంతో శివ చెంప చెళ్లుమనిపిస్తుంది మోనిత.
సరిగ్గా టైమ్ కు రాకపోతే.. అరగంట ఆగి వస్తే నీ సొమ్ము ఏం పోయింది. మొత్తం చెడగొట్టావు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. ఆ తర్వాత శివలత అసలు విషయం చెబుతుంది. మీరు కార్తీక్ సార్ చనిపోయారని వాళ్ల నాన్నగారికి చెప్పారు. ఇప్పుడు కార్తీక్ సార్ వస్తే మీరు అడ్డంగా దొరికిపోతారు.
అందుకే బాబును ఇచ్చి అయినా సరే వాళ్లను వెంటనే పంపించేయాలని మీరు అనుకున్నారు. అందుకే కార్తీక్ సార్ వచ్చే లోపు వాళ్లను ఇద్దరినీ వెనుక నుంచి పంపించేశాను అంటుంది శివలత. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని అనుకున్నా కానీ.. దీనికి తెలిసిందా అని అనుకుంటుంది.
ఎవ్వరికీ చెప్పకు అని అంటుంది మోనిత. దీంతో చెప్పను అంటుంది. వీళ్లందరినీ తప్పించుకొని నేను, కార్తీక్ మాత్రమే కలిసి ఉండేలా దారి చూసుకోవాలి అని అనుకుంటుంది మోనిత. మరోవైపు మనం కిరాణ షాపు పెట్టబోతున్నాం అని ఇంద్రుడు, చంద్రమ్మ శౌర్యతో అంటారు.
దీంతో నిజం చెప్పు బాబాయి. ఆటో ఎందుకు అమ్మేశావు. అమ్మానాన్నలను ఎలా వెతుకుతాం. నువ్వు పిన్ని మారిపోయారు అంటుంది శౌర్య. ఈ ఊరు వచ్చిందే నీకోసం కదా అంటాడు ఇంద్రుడు. నాకోసమే ఒప్పుకుంటా కానీ.. మీలో చాలా మార్పు వచ్చింది అంటుంది శౌర్య.
మరోవైపు ఈ టెన్షన్ తట్టుకోలేక దీప, కార్తీక్ ఇద్దరిలో ఒకరిని చంపేస్తే తాను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది మోనిత. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు పెట్టే సమయంలో ప్లాన్ చేస్తుంది మోనిత. అదే విషయాన్ని దీపకు చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.