Yashoda Movie Review : నటీనటులు… సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ
దర్శకుడు హరి – హరీష్
నిర్మాతలు.. శివలెంక కృష్ణ ప్రసాద్
సంగీతం మణిశర్మ
సినిమాటోగ్రఫీ ఎం. సుకుమార్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హైలీ ఎమోషనల్, యాక్షన్ అంశాలతో కలబోసవిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం హరీ, హరీష్ రూపొందించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన అద్దె గర్బం (సర్రోగసి) అనే యూనివర్సల్ కాన్సెప్ట్‌ను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, పలు వాయిదాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ : మధ్య తరగతి అమ్మాయిగా సమంత.. యశోద పాత్రలో నటిస్తుంది. అయితే డబ్బు కోసం ఆమె సరోగసికి అంగీకరిస్తుంది. అయితే గర్భవతి అయిన తర్వాత వైద్యులు ఆమెకు నియమ నిబంధనలు పెడతారు. ఇక సరోగసి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియడంతో సమంత జీవితం పూర్తిగా తలకిందులు అవుతుంది. ఆ పరిస్థితులలో సమంత ఒడిదుడుకులని తట్టుకొని ఎలా ముందుకు సాగిదంనేదే మిగతా కథ.
పర్‌ఫార్మెన్స్ : యశోదగా సమంత అద్భుతంగా నటించింది. ఎప్పటి మాదిరిగానే ఆమె నటనలో తన సత్తా చూపింది, యశోద పాత్రలో భావోద్వేగాన్ని అద్భుతంగా పండించింది మరియు ఆమె యాక్షన్ సన్నివేశాలు చేయడం తెరపైన చాల బాగుంది, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ మరియు రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో తమ సత్తా చాటారు.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకులు హరి – హరీష్ ఒక అద్భుతమైన కథతో అలరించే ప్రయత్నం చేశారు. కొంత థ్రిల్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. భావోద్వేగాలని అందించడంతో కూడా ఇది విఫలం అయినట్టు అనిపిస్తుంది. సరోగేట్ మోసాలు ఎలా జరుగుతున్నాయో మరియు అమాయక మహిళలు ఎలా బాధితులవుతున్నారో అద్భుతంగా చూపించారు ., ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది .మణిశర్మ పాటలు అంతగా లేవు కానీ నేపథ్య సంగీతంలో తన అనుభవాన్ని చూపించాడు, అతను తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్తో మనల్ని థ్రిల్‌కి గురి చేశాడు.
ప్లస్ పాయింట్స్ : కథ
స్క్రీన్ ప్లే
నటన
యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్లు:
సంగీతం
కొన్ని సాగదీసిన సన్నివేశాలు
ఫైనల్‌గా.. ‘సరోగసీ’ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా వేరే యాంగిల్‌లో ఉండడం, ఇది కొంత మన జీవిన విధానానికి సంబంధించినవి కావడం వల్లనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. యశోదలొ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, యశోద ఈ సరోగేట్ స్కామ్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చాల ఆసక్తి కరంగా అనిపించినా ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అంతా పోతుంది. సినిమా సమంత అభిమానులకి మాత్రమే అని చెప్పాలి.
రేటింగ్ 2/5
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.