Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన జ్ఞానాంబ.. జానకి చదువు విషయం తెలిసి అందరూ షాక్
Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 11 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శని, ఆదివారాల్లో జానకి కలగనలేదు సీరియల్ ప్రసారం కాదు. అయితే.. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జానకి చదువు విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా తెలుసుకున్న జ్ఞానాంబ చాలా బాధపడుతుంది. అసలు.. నాకు తెలియకుండా జానకి చదువు విషయాన్ని ఎందుకు దాచారని మధనపడుతుంది జ్ఞానాంబ. అసలు.. జానకి చదువు విషయం దాచి తన పెళ్లి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని తెగ ఆలోచిస్తుంది జ్ఞానాంబ. వెంటనే ఇంటికి వెళ్లకుండా… పొలం దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది.

janaki kalaganaledu 11 october 2021 episode highlights
పొలం దగ్గరికి వెళ్లి కూర్చోగానే.. మల్లిక ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు జానకి ఇన్నిరోజులు మనల్ని మోసం చేసింది. తను చదివింది 5వ తరగతి కాదు.. డిగ్రీ అని చెబుతుంది. ఏంటి నువ్వు చెప్పేది. నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇల్లూ ఊకుతుంటే తన డిగ్రీ సర్టిఫికెట్లు కింద పడ్డాయి అత్తయ్య. అవి వేరే వాళ్లకు చూపిస్తే జానకివే అని చెప్పారు అని చెబుతుంది. దీంతో జ్ఞానాంబ.. జానకి చదువు విషయంపై ఓ క్లారిటీ తెచ్చుకుంటుంది.
Janaki Kalaganaledu 11 Oct Today Episode : జానకి పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన రామా, జానకి
ఇంతలో జానకి, రామా… తన పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్తారు. అక్కడ సరదాగా కాసేపు గడుపుతారు. సరదాగా గడిపిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. మనిద్దరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. జీవితాంతం కలిసి ఉండాలి. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.. అని ఒకరికి మరొకరు అనుకుంటారు.

janaki kalaganaledu 11 october 2021 episode highlights
కట్ చేస్తే.. సరదాగా గడిపి ఇంటికి వచ్చిన రామా, జానకిని చూసిన జ్ఞానాంబ.. ఆగండి అంటుంది. దీంతో షాక్ అవుతారు. జానకి సూట్ కేస్ ను విసిరేస్తుంది జ్ఞానాంబ. దీంతో షాక్ అవుతుంది జానకి. జానకి వెళ్లిపో అని అంటుంది జ్ఞానాంబ. అమ్మ ఏమైందమ్మా అని అడుగుతాడు రామా. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్లేదు అంటుంది జ్ఞానాంబ. ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు.. అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.