Janaki Kalaganaledu 12 April Today Episode : రామా కోసం జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకిని కలిసిన యోగి ఏం చేస్తాడు? జ్ఞానాంబ విషయంలో యోగి మరో షాకింగ్ నిర్ణయం

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 12 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 277 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరోవైపు ఊర్మిల.. జ్ఞానాంబ ఇంటికి వెళ్తుంది. వెన్నెల చూసి వద్దు అక్క.. నువ్వు ఇక్కడికి రావద్దు. అమ్మ చాలా కోపంగా ఉంది అని అంటుంది. దీంతో లేదు వెన్నెల.. నేను ఎలాగైనా అమ్మతో మాట్లాడుతా అంటుంది. ఈ పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు అంటుంది వెన్నెల. అయినా సరే ఊర్మిల వినదు. ఇంతలో జ్ఞానాంబ కారులో ఇంటికి వస్తుంది. వెన్నెల.. జ్ఞానాంబను చూసి షాక్ అవుతుంది. అమ్మ వచ్చేసింది. ఎటువంటి గొడవలు జరుగుతాయో ఏంటో అని టెన్షన్ పడుతుంది. ఇంతలో ఊర్మిల వెళ్లి అమ్మ అంటుంది. ఊర్మిల చేతుల్లో ఉన్న బిడ్డను చూస్తుంది జ్ఞానాంబ.

Advertisement

janaki kalaganaledu 12 april 2022 full episode

ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి వచ్చిందేంటి అని అనుకుంటాడు గోవిందరాజు. నిప్పుకు పెట్రోల్ పోసినట్టు పోలేరమ్మ కోపానికి ఇంకాస్త మనం తాలింపు వేయాలి అని అనుకుంటుంది మల్లిక. అన్నయ్య అయిపోయాడు.. ఇప్పుడు వదిన గారిని సీన్ లోకి దించింది అని అంటుంది మల్లిక. మా ఆయన చేసింది క్షమించరాని తప్పే. నిజానిజాలు తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించారు. నాకు ఇదంతా తెలియదు. మీరు ఎంత గాయపడ్డారో.. మీ మనసు ఎంత బాధపడిందో అని అంటుంది ఊర్మిల. అమ్మ.. మీ పరువుకు నా భర్త భంగం కలిగించారు. నా భర్త తరుపున నేను వేడుకుంటున్నాను. దయచేసి నా భర్తను క్షమించండి అంటుంది ఊర్మిల.

Advertisement

దీంతో వెళ్లి మంచి చీర తీసుకొని కుంకుమ సారె తీసుకొనిరా అని మల్లికతో చెబుతుంది జ్ఞానాంబ. ఇంతలో పాపా.. బాబా అని అడుగుతుంది. బాలింతవు ఎక్కువ సేపు నిలబడకూడదు. కూర్చుందువు కానీ పదా అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. నేను చెప్పేది ఒకసారి వినండి అంటుంది.

పాపా.. బాబా అంటే ఏం చెప్పనేలేదు అంటుంది. బాబేనండి అంటుంది. మా జానకి ఏం తప్పు చేయలేదండి. మా ఆయన చేసిన తప్పును మీరు క్షమించేయండి అమ్మ అంటుంది. మల్లిక ఎంత సేపు అంటుంది. మల్లిక.. అంటూ అరుస్తూనే ఉంటుంది. దీంతో లేమ్మ అని చెప్పి మల్లిక తెచ్చిన చీర, సారెను తనకు ఇస్తుంది.

నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అంటుంది. ఏవండి.. ఒక 5000 ఇవ్వండి అంటుంది. ఆ డబ్బులు కూడా ఇస్తుంది జ్ఞానాంబ. అనుకోకుండా వచ్చావు కదా.. బాబుకు బట్టలు తీసుకోవడానికి వీలు పడలేదు. మంచి బట్టలు తీసుకో అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 12 April Today Episode : జానకి గురించే మాట్లాడటానికి అయితే ఇంకోసారి ఇక్కడికి రాకు అని ఊర్మిలకు జ్ఞానాంబ వార్నింగ్

మా ఆయన మీ పరువు పోయేలా ప్రవర్తించినందుకు మీరు నా మీద కోప్పడుతారనుకున్నాను. చాలా పెద్ద గొడవ జరుగుతుందని భయపడ్డాను. కానీ.. మీ కడుపున పుట్టిన బిడ్డకు సారె పెట్టినట్టుగా నన్ను దీవించారు. మీ అమ్మ మనసు గురించి చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి.

ఇదే మనసుతో నా భర్తను క్షమించి.. జానకిని కూడా అర్థం చేసుకుంటే అంటుంది ఊర్మిల. కానీ.. తను చెప్పిన విషయాలు ఏవీ పట్టించుకోదు. ఈ విషయం గురించే మాట్లాడటానికే అయితే ఇంకెప్పుడూ రాకు అని వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ.

పదా.. గేటు దాకా వదిలిపెడతాను అంటుంది జ్ఞానాంబ. బాబును తీసుకొని ఊర్మిల వెళ్తుండగా.. జానకి, రామా ఇద్దరూ తనను చూస్తారు. జానకి.. తనను చూసి సంతోషిస్తుంది. మీ నాన్న జాను అంటూ తన చేతుల్లో ఉన్న పిల్లాడిని చూపిస్తుంది.

దీంతో పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని ఎత్తుకొని మురిసిపోతుంది జానకి. వదిన.. అచ్చం నాన్నలాగానే ఉన్నాడు వీడు అంటుంది జానకి. ఇంతలో శభాష్ అంటుంది జ్ఞానాంబ. వయసుకు మించిన తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర. నీ దగ్గర చదువుకున్న తెలివితేటలు చాలా ఉన్నాయని తెలుసు కానీ.. ఈ స్థాయిలో ఉన్నాయని తెలియదు అంటుంది జ్ఞానాంబ.

అత్తయ్య గారు మీరు ఏమంటున్నారో నాకు తెలియదు అంటుంది. మీ అన్నయ్యను అమెరికా నుంచి పిలిపించి.. నా మీద కేసు పెట్టించి ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్ కు వచ్చి మీ అన్నయ్యను తిట్టినట్టే తిట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేశావు. దీంతో నా కోడలు చాలా మంచిది అని నేను అనుకుంటానని నీ ఆలోచన అంటుంది జ్ఞానాంబ.

మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్న విషయం నాకు తెలియదు అంటుంది జానకి. నీ తెలివితేటలు ఏంటో చూశాక కూడా ఇంకా నిన్ను నేను నమ్మలేను.. అంటుంది జ్ఞానాంబ. ఆఖరికి పసిపిల్లాడిని అడ్డం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతుంటే బాధతో గుండె తరుక్కుపోతోంది అంటుంది జ్ఞానాంబ.

నువ్వు ఇంత చేసినా కూడా మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నా. ఎందుకో తెలుసా.. నా కొడుకు కోసం. వాడు పడుతున్న ఇబ్బందులను చూడలేక. కానీ.. నువ్వు మీ అన్నయ్యతో కలిసి ఆడిన నీ నాటకంతో నా మనసు విరిగిపోయింది అంటుంది జ్ఞానాంబ.

ఇప్పుడు మీ వదినను రాయబారిగా పిలిపించడంతో నీ మీద ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారింది. నా ప్రేమ నీకు పిచ్చితనంలా కనిపించింది. ఇక నుంచి అత్తలా ఉంటాను. ఒక సగటు అత్త కోడలు విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తాను. ఈలోకంలో ఉండే నిజమైన అత్తను చూస్తావు నువ్వు అంటుంది జ్ఞానాంబ.

ఏమండి పదండి అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత రామా వచ్చి.. ఊర్మిల భోం చేసి వెళ్లు కానీ.. నా భార్యను వాళ్ల అన్నయ్యకు దగ్గర చేసే ప్రయత్నం మాత్రం చేయకు. ఆ ప్రయత్నాలు నాకు నచ్చవు అంటాడు రామా. ఆ తర్వాత జానకి, ఊర్మిల ఇద్దరూ ఏడుస్తారు.

తర్వాత జానకిని కలుస్తాడు యోగి. జానకి బాధపడటం చూసి.. తట్టుకోలేక.. వెళ్లి జ్ఞానాంబ కాళ్లు పట్టుకుంటాడు. జానకిని క్షమించమని వేడుకుంటాడు. అయినా కూడా జ్ఞానాంబ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

46 minutes ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

3 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

4 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

4 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

6 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

7 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

8 hours ago

Hero Electric Splendor EV: హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ EV విడుదల.. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల..!

Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్‌(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…

9 hours ago