Karthika Deepam 12 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1324 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేమో నా శత్రువు అన్నావు. నామీద చాలా కోపంగా ఉన్నావు… అంటూ శౌర్యతో ఉన్న ఫోటోను పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది తింగరి. మళ్లీ మనం ఎప్పటిలా కలవాలి. నీ కోపం పోవాలి. సంతోషంగా ఉండాలి శౌర్య అని అనుకుంటుంది తింగరి. ఉంటాం.. నేనెవరో తెలియకుండానే నువ్వే నాకు తింగరి అని పేరు పెట్టావు.. అని అనుకుంటుంది హిమ. నేనెవరో తెలియకనే నాకు అన్నం తినిపించావు. నీ కోపం పోయాక ఇంకెంత బాగా చూసుకుంటావో కదా నన్ను. నీ కోపం తగ్గాలంటే నేను ఏం చేయాలి. నీ కోపం తీరకుండా నువ్వు రావు.. పైగా ఆ కోపంలో మళ్లీ పారిపోతే ఇక దొరకవు. అందుకే.. ఇఫ్పుడు నీ గురించి ఎవ్వరికీ చెప్పను. మెల్లమెల్లగా నీ కోపాన్ని ప్రేమగా మార్చుకుంటాను.. సరేనా అంటూ తింగరి.. నేను తింగరి అనుకుంటూ ఎగురుతుంటూ ఉంటుంది హిమ.
ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. ఏంటి హిమ.. ఏంటిది అని అడుగుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది. దీంతో శౌర్యతో అంటుంది. తింగరి అంటున్నావేంటి అని అడుగుతుంది. దీంతో పేరు బాగుంది కదా.. నేను తింగరి.. నువ్వు ముసలి తింగరి అంటుంది హిమ. ఇంత ముసలిదానివైనా ఇంత అందంగా కనిపించేందుకు ఏం చేస్తున్నావు. నీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటి అని అడుగుతుంది. ఏంటి నువ్వు ఇంత హుషారుగా ఉన్నావు.. అని అడుగుతుంది. దీంతో అడగొద్దు.. ఆనందంగా ఉంటే ఆనందంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. తను ఇంత ఆనందంగా ఉండటం చూసి సౌందర్య కూడా సంతోషిస్తుంది.
మరోవైపు నిరుపమ్.. ఆనంద రావు దగ్గరికి వస్తాడు. మనిషిని బాగానే ఉన్నాను కానీ.. మనసు ఏం బాగోలేదు అంటాడు ఆనంద రావు. శౌర్య కలిస్తేనే హిమ ముఖంలో సంతోషం చూడగలం అంటాడు ఆనంద రావు. ఈ మధ్య హిమ హుషారుగా కనిపిస్తోంది దానికి కారణం నువ్వేనా అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో నేను కాదులే వేరే వాళ్లు ఉన్నారు అంటాడు నిరుపమ్.
హిమలో మార్పు వచ్చినట్టే.. మీ అమ్మలో కూడా మార్పు వస్తే బాగుంటుంది అని అంటాడు ఆనంద రావు. దీంతో నాకు తెలుసు తాతయ్య.. నువ్వు ఇక్కడికి వచ్చింది అందుకే కదా అని అంటాడు. హిమలో మార్పును తెచ్చినట్టే.. అమ్మను మార్చేందుకు జ్వాల సాయం ఎందుకు తీసుకోకూడదు అని అనుకుంటాడు నిరుపమ్.
ఇంతలో స్వప్న వచ్చి కోపంగా మాట్లాడుతుంది. హిమ చేసిన పాపానికి శిక్ష పడుతుంది. నువ్వు మాత్రం దానికి దూరంగా ఉండు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు జ్వాల.. టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
రవ్వ ఇడ్లీ వచ్చి ఏమైంది జ్వాల అలా ఉన్నావు అని అడుగుతాడు. ఒరేయ్ నీ పని నువ్వు చూసుకో. మంచిగా చదువుకొని డాక్టర్ అవ్వు అంటంది. ఇంతలో నిరుపమ్, తింగరి వస్తారు. ఏంటి సడెన్ గా ఇలా వచ్చారు అని అడుగుతుంది జ్వాల.
నాతో మీకేం పని వచ్చింది చెప్పండి అని అడుగుతుంది జ్వాల. నీ హెల్ప్ కావాలి. నీ హుషారు కొంచెం అప్పు కావాలి. మా డాక్టరమ్మ.. ఈ తింగరిని స్ట్రాంగ్ గా మార్చేయవా అని అడుగుతాడు నిరుపమ్. తన చేయిని తీసుకొని నీలా తనను మార్చు అని జ్వాల, హిమ చేతులను కలుపుతాడు నిరుపమ్.
ఆ తర్వాత తింగరిని తీసుకొని జ్వాల ఆటోలో వెళ్తుంటుంది. నీ పేరు బాగుంది. ఈ పేరు ఎవరు పెట్టారు నీకు అని అడుగుతుంది తింగరి. దీంతో నీకు అవసరమా అంటుంది. మీ అమ్మానాన్నలు పెట్టారా లేక అంటూ తింగరి ఏదో అడగబోతుంది.
దీంతో ఆటో ఆపి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకు.. అని సీరియస్ అవుతుంది. మీ అమ్మానాన్నల గురించి అంటే లేరు.. అంటుంది. నోరు మూసుకొని కూర్చో.. నన్ను అడగకు అంటుంది. చెప్పను నన్ను అడగొద్దు అంటుంది జ్వాల. కోపంతో మళ్లీ ఆటో స్టార్ట్ చేసి అక్కడి నుంచి తనను తీసుకెళ్తుంది.
నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదిగో అంటూ తన చేతి మీద ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూపిస్తుంది జ్వాల. ఇదే.. అన్నింటికీ జవాబు అంటుంది. ఇదే ప్రశ్నకు జవాబు. ఇదే జవాబు దొరకని ప్రశ్న అంటుంది జ్వాల. ఇంకోసారి పొరపాటున కూడా నన్ను ఏమీ అడగొద్దు అంటుంది జ్వాల.
తనను అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు. నేను నీకు దగ్గరవుదాం అనుకుంటే.. నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావా శౌర్య అని అనుకుంటుంది హిమ. నువ్వు ఎంత దూరం వెళ్లినా నీ నీడలా నీ వెంటే వస్తాను. నీకు ఎంత కోపం వచ్చినా నీ కోపాన్ని నేను భరిస్తాను. ఆ కోపం తగ్గేలా నేను చూసుకుంటాను శౌర్య అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.