Janaki Kalaganaledu 12 August 2022 Episode : అఖిల్ ఒక అమ్మాయి తో పార్కులో కూర్చుని ఉండగా.. జానకి, రామ చూస్తారా.. జానకి ఏం చేస్తుంది.?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 August 2022, 11:00 am

Janaki Kalaganaledu 12 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదలైంది. 365 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి, రామాలు జ్ఞానాంబ వాళ్లు అకాడమీకి వెళ్లిపోతారు. ఇంట్లో మల్లికకు బాగా అయింది అని చికిత అనుకుంటుంది. అప్పుడు మల్లికా భోజనం చేయాలని చూస్తూ ఉంటుంది కానీ చికిత ఒప్పుకోదు. అయినా చికెన్ బిర్యాని రెండు రోజులు మందం తిన్నాను ఇంకేం బాధ లేదు అని అనుకుంటుంది. కట్ చేస్తే కాలేజీలో జ్ఞానంబ జానకి చదువు గురించి మాట్లాడుతుంది. కట్ చేస్తే అఖిల్ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు తనతో చాటింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది జానకి చూస్తుంది. అప్పుడు జానకి అఖిల్ ని ఏంటి నువ్వు చదువు మీద దృష్టి పెట్టకుండా ఎవరితోనో మాట్లాడుతున్నావు, చాటింగ్ చేస్తున్నావ్ ఏంటి అఖిల్ అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ ఏం లేదు వదిన అని కంగారుపడుతూ ఉంటాడు.

అప్పుడు జానకి ఏదో జరుగుతుంది కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విష్ణు మల్లిక ఆకలితో మండిపోతూ ఉంటారు. మల్లిక ఇంట్లో వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత కిచెన్ లోకి వెళ్లి తినడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడు చికిత లేచి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు అందరూ వచ్చి లైట్లు వేస్తారు. కిచెన్లో మల్లిక కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు అందరూ తనని చూసి నవ్వుతారు. జ్ఞానాంబ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటావు. శిక్ష వేస్తే మళ్లీ దాన్ని పాటించవు అని తిడుతుంది. గోవిందరాజు అమ్మ మల్లిక ఆకలేస్తుందా చిన్నగా తిను అని తనపై సెటైర్లు వేస్తాడు. అక్కడినుంచి అందరూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే రామ జానకి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రామాకి ,జానకి పిల్లల గురించి చెప్తుంది మనం ఎలాగైనా పిల్లల్ని కనాలి అత్తయ్య గారిని సంతోష పెట్టాలి అత్తయ్య గారు దానికోసమే ముభావంగా ఉంటున్నారు మీరు అది అర్థం చేసుకోండి అని అంటుంది.

Janaki Kalaganaledu 12 August 2022 Full Episode

Janaki Kalaganaledu 12 August 2022 Full Episode

అప్పుడు రామ అది ఎలా కుదురుతుంది జానకి గారు, మీరు చదువు మీద దృష్టి పెట్టుకోండి. ఇదంతా నేను చూసుకుంటాను. నేను అమ్మతో మాట్లాడుతాను అని అంటాడు. అయినా సరే జానకి వినదు తనని గట్టిగా హాగ్ చేసుకుంటుంది. తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. తనని ఎలాగైనా కాన్వెంట్స్ చేసి పిల్లలు నీ కనాలి అని అనుకుంటుంది. కట్ చేస్తే ఒక పార్కులో అఖిల్ ప్రేమించిన అమ్మాయితో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది జానకి, రామ చూస్తారు. అప్పుడు జానకికి అర్థమవుతుంది. ఓహో ఇది జరుగుతుంది అందుకే అఖిల్ ఫోన్ మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ ఉన్నాడు అని రామా కి చెప్తుంది. అత్తయ్య గారికి తెలిస్తే మళ్లీ పెద్ద గొడవ అవుతుంది అండి ఎలాగైనా అఖిల్ కి నచ్చి చెప్పాలి అని రామతో అంటుంది. అవును జానకి గారు వీడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని జానకితో అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి