Home » Entertainment » Janaki Kalaganaledu 12 January 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 12 Jan Today Episode : కన్నబాబు కాళ్లు పట్టుకున్న రామా.. అయినా కనికరించని కన్నబాబు.. కోర్టుకు జానకి.. తను ఐపీఎస్ అవ్వలేదా?

Authored By
Varun G
The Telugu News | Published on: January 12, 2022, 12:00 pm
Advertisement

Janaki Kalaganaledu 12 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 213 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటలో ఉన్న కన్నబాబును కలుసుకోవడానికి రామా వెళ్తాడు. మరోవైపు జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి సీఐ గారికి ఫోన్ చేయండి. ఈ విషయంలో సీఐ గారు ఏదైనా సాయం చేయొచ్చు అంటుంది జ్ఞానాంబ. దీంతో వెంటనే సీఐకి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది జ్ఞానాంబ. మా కోడలును ఎలాగైనా విడిపించేలా మీరు కాస్త సాయం చేయాలంటే.. నేను ఈ విషయంలో ఏం చేయలేను అంటాడు సీఐ. ఏసీపీ గారు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు కాబట్టి.. నేను ఏం చేయలేను. మీరు కోర్టుకు వెళ్లి బెయిల్ తెప్పించుకోవడం తప్పితే మరో మార్గం లేదు అంటాడు సీఐ. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు.

Advertisement

janaki kalaganaledu 12 january 2022 full episode

మరోవైపు రామా.. కన్నబాబు తోటకు వెళ్తాడు. అక్కడ కన్నబాబు మందు కొడుతూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కన్నబాబు దగ్గరికి వెళ్తాడు. కన్నబాబుకు ఏదో చెప్పబోతుండగా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అంటాడు కన్నబాబు. నా భార్య చేసిన తప్పుకు నేను క్షమాపణ చెబుతున్నాను అంటాడు రామా. మొదటి సారి నీ పెళ్లాం కొట్టినప్పుడు నా గురించి తెలియక చేయి చేసుకుంది అనుకున్నా. నేను కార్పొరేటర్ కొడుకును అని తెలిశాక కూడా నీ పెళ్లాం కొట్టింది అంటే ఎంత ధైర్యం నీ పెళ్లానికి. నా ఈగో హర్ట్ అయింది. నేను ఊరుకుంటానా అంటాడు కన్నబాబు. ఈ ఒక్కసారికి క్షమించండి కన్నబాబు.. ప్లీజ్ అర్థం చేసుకో. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను అంటాడు. కానీ.. కన్నబాబు మాత్రం వినడు.

Advertisement

ఒక పెగ్గేసి ఆలోచించి నిర్ణయం చెబుతాను. సరదాగా గ్లాస్ లో పెగ్గు కలుపు అంటాడు కన్నబాబు. దీంతో పెగ్గు కలిపి కన్నబాబుకు ఇస్తాడు రామా. కన్నబాబు.. నా భార్య బంగారం లాంటి భవిష్యత్తు కష్టాల్లో పడుతుంది. దయచేసి అర్థం చేసుకొని వెనక్కి తీసుకో కన్నబాబు. నీకు దండం పెడతా ప్లీజ్ అంటాడు రామా.

నువ్వు ఎంత బతిమిలాడినా నా కోపం తగ్గడం లేదు అంటాడు. దీంతో నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు.. నేను చేస్తాను అంటాడు. ఏం చెప్పినా చేస్తావా అంటాడు. దీంతో కేసు వెనక్కి తీసుకుంటానంటే ఏం చెప్పినా చేస్తాను అంటాడు రామా. దీంతో నా కాళ్లు పట్టుకో అంటాడు కన్నబాబు.

Advertisement

Janaki Kalaganaledu 12 Jan Today Episode : రోజంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్న జానకి

దీంతో రామా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమైంది. కాళ్లు పట్టుకోమనే సరికి.. నోరు ఆగిపోయింది అంటాడు కన్నబాబు. దీంతో వెంటనే కిందికి వంగి.. రామా కన్నబాబు కాళ్లు పట్టుకుంటాడు. జానకి ఐపీఎస్ అవ్వాలి అంటే కన్నబాబు కేసు వెనక్కి తీసుకోవాలి అనుకొని కాళ్లు పట్టుకుంటాడు.

కన్నబాబు ఫుల్ ఖుషీ అవుతాడు కానీ.. కేసు మాత్రం వెనక్కి తీసుకోనంటాడు. ఎంత చెప్పినా వినడు. రేపు నీ భార్య కోర్టుకు వెళ్లాల్సిందే.. అని చెప్పి కారులో వెళ్లిపోతాడు. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చెక్కుతుంది. జానకి ఐపీఎస్ కల గురించే ఆలోచిస్తూ ఉంటాడు రామా.

పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు. రామా పోలీస్ స్టేషన్ బయట.. పోలీస్ స్టేషన్ లోపల జానకి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో విష్ణు పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అన్నయ్య అని పిలుస్తాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు. నువ్వు వెళ్లు ఇంటికి అంటాడు రామా. నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అన్నయ్య. పదా.. ఇంటికి వెళ్దాం అంటాడు.

మీ వదిన ఇక్కడుంటే నేను ఇంటికి ఎలా వస్తాను అంటాడు రామా. విష్ణు ఎంత చెప్పినా రామా వినడు. నువ్వు వెళ్లు అని చెబుతాడు. మరోవైపు జానకి లేచి మంచినీళ్లు తాగుతూ ఉంటుంది. తనను బయటి నుంచి చూస్తుంటాడు రామా. మీరు ఇక్కడెందుకు ఉన్నారు. ఇంటికి వెళ్లండి అంటుంది జానకి.

Advertisement

నేను వెళ్లను అంటాడు. భోం చేశారా అంటే చేయలేదు అంటాడు. నువ్వు తిన్నావా అని అడిగితే నేను కూడా తినలేదు అంటుంది జానకి. మీరు వెళ్లిపోండి.. లేకపోతే నేను వెళ్లిపోతాను అంటుంది జానకి. దీంతో రామా అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి