Janaki Kalaganaledu 12 May Today Episode : స్వీటు కొట్టు కన్నబాబు సొంతం కాబోతోందనే నిజం.. రామా జ్ఞానాంబకు చెబుతాడా? ఇంతలో జ్ఞానాంబకు పెద్ద షాక్

Janaki Kalaganaledu 12 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 మే 2022, గురువారం ఎపిసోడ్ 299 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మదర్స్ డే మళ్లీ వచ్చే సంవత్సరం వచ్చేవరకు సంవత్సరం అంతా ఆ సంతోషం గుర్తుండాలని మీకోసం ఈ మదర్స్ డే వేడుకలు ఏర్పాటు చేశాం అంటుంద జానకి. మాకు ఎప్పటి నుంచో మదర్స్ డే ఏర్పాట్లు చేయాలని మేము అనుకున్నాం కానీ.. ఈ సారి జానకి వదిలనే ఈ ఆలోచన చేసింది అమ్మ అంటారు పిల్లలు. నీకు ప్రాణానికి ప్రాణమైన స్వీటు షాపు దగ్గర ఈ వేడుకలు జరిపిస్తే నువ్వు సంతోషపడతావని జానకి వదినే ఈ ఏర్పాట్లు చేయించింది అని అంటాడు విష్ణు. దీంతో జ్ఞానాంబ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతుంది.

Advertisement
janaki kalaganaledu 12 may 2022 full episode
janaki kalaganaledu 12 may 2022 full episode

తర్వాత ఈ కొట్టు గురించి.. ఈ కొట్టుకు ఉన్న ప్రాముఖ్యత గురించి జ్ఞానాంబ అందరికీ చెబుతుంది. మీరందరూ ఇలా అమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ అమ్మ పండుగ రోజున అమ్మ లాంటి ఈ కొట్టును అలంకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది జ్ఞానాంబ. రామా.. అంటూ అతడి వైపు సంతోషంగా చూస్తుంది జ్ఞానాంబ. కానీ.. రామాకు మాత్రం లోపల టెన్షన్ గా ఉంటుంది. నీకు ఈ స్వీటు కొట్టు బాధ్యతను నీకు ఎందుకు అప్పగించానో తెలుసా.. ఈ అమ్మ విలువ.. అమ్మ లాంటి కొట్టు విలువ నీకు తెలుసు. నీ చిన్నప్పటి నుంచి ఈ అమ్మను ఎంత బాగా చూసుకున్నావో.. ఈ స్వీటు కొట్టును కూడా అంతే బాగా చూసుకున్నావు.. అని అంటుంది.

ఆ రోజు నీ భవిష్యత్తును త్యాగం చేసి ఈ కుటుంబాన్ని నిలబెట్టావు. భవిష్యత్తులో కూడా నీ తమ్ముళ్లు, చెల్లెలుతో పాటు స్వీటు కొట్టును కూడా చాలా బాగా చూసుకోవాలి అంటుంది. ఆ రాముల వారిని నీ లాంటి కొడుకును ఇవ్వు అంటే.. ఆయన గుణగణాలు ఉన్న కొడుకునే ఇచ్చాడు. నీకు ఏ ముహూర్తాన రామచంద్ర అని పేరు పెట్టానో కానీ.. ఆ రాముడు అయోధ్యను కంటికి రెప్పలా కాపాడుకున్నట్టు.. నువ్వు ఈ కుటుంబాన్ని కాపాడుతున్నావు.

నాది ఒకే కోరిక.. నేను ఉన్నా లేకున్నా.. ఈ స్వీటు కొట్టును మాత్రం వదిలిపెట్టకు. ఈ స్వీటు కొట్టు మనకు జ్ఞాపకంగా ఉండాలి అంటుంది జ్ఞానాంబ. తర్వాత జ్ఞానాంబకు అందరూ సన్మానం చేస్తారు. తనకు కాళ్లు కడుగుతారు. పండుగలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు.

Janaki Kalaganaledu 12 May Today Episode : పోలేరమ్మ కాళ్లు పట్టుకోవాలా అని చిరాకు పడ్డ మల్లిక

మనం కోడళ్లం కదా.. అత్తగారి కాళ్లు కడగడం ఏంటి అని జానకితో అంటుంది మల్లిక. దీంతో మనకు అమ్మ అయినా.. ఎవరైనా అన్నీ అత్తయ్య గారే. ఆవిడ కాళ్లు కడిగి నెత్తి మీద జల్లుకుంటే మనకు అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేం ఉంటుంది అని అంటుంది జానకి.

ఇంతలో మల్లిక.. నీలావతికి ఫోన్ చేసి.. ఇక్కడికి వచ్చి మంట పెట్టాలి అంటుంది. దీంతో ఇప్పుడే వస్తున్నాను ఆగు.. మంట కాదు.. కార్చిచ్చు పెడతాను చూడు అంటుంది. ఇంతలో నీలావతి అక్కడికి వస్తుంది. నాకు పూతరేకులు కావాలి అంటుంది.

ఇంతలో కన్నబాబు, రామా మధ్య జరిగిన గొడవ గురించి జ్ఞానాంబకు చెబుతుంది నీలావతి. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ గొడవను అందరూ చూశాను. నిజమో కాదో.. తెలియాలంటే మీ రామచంద్రానే అడగండి అంటుంది నీలావతి.

ఆ కన్నబాబు రామా కాలర్ పట్టుకొని మరీ గొడవ పడ్డాడు అంటుంది నీలావతి. దీంతో రామాను జ్ఞానాంబ అడుగుతుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. రామాకు ఏం చెప్పలో అర్థం కాదు. స్వీటు కొట్టు అంటే అమ్మకు ప్రాణం. ఇది పోయే పరిస్థితి వచ్చిందంటే అమ్మ తట్టుకోగలదా అని అనుకుంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement