Janaki Kalaganaledu 13 April Today Episode : జ్ఞానాంబకు క్షమాపణలు చెప్పిన యోగి.. అయినా క్షమించని జ్ఞానాంబ.. రామా కోసం జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 13 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 278 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భోజనం చేయకుండా అలాగే పడుకోవడంతో గోవిందరాజు జ్ఞానాంబను అడుగుతాడు. అయినా కూడా భోజనం చేయకుండానే జ్ఞానాంబ అలాగే పడుకుంటుంది. దీంతో గోవిందరాజుకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు తన అమ్మ మీద తనకు ఉన్న ప్రేమ గురించి పాట పాడుతాడు రామా. వెంటనే కిటికీ తలుపులు తీస్తుంది జ్ఞానాంబ. దీంతో ఇంకా హుషారుగా పాటపాడుతూ డ్యాన్స్ చేస్తుంటాడు రామా. మరోవైపు ఇంట్లో తను ఏడుస్తూ ఉంటుంది.

janaki kalaganaledu 13 april 2022 full episode

జానకి గారు.. అమ్మ నన్ను చూడటానికి వచ్చిందండి అని చెప్పి మురిసిపోతాడు రామా. ఎందుకు జ్ఞానం నీ అమ్మ ప్రేమను చంపుకుంటూ అటు వాడిని బాధపెడుతూ.. ఇటు నువ్వు బాధపడుతున్నావు. నీకు తెలియదా.. నువ్వు ఇలా తిండితిప్పలు లేకుండా ఉంటే వాడు ఎంత బాధపడతాడో నీకు తెలియదా? నువ్వు ఇలాగే చేస్తే వాడు కూడా తిండి తిప్పలు మానేసి పిచ్చోడు అయిపోతాడు జ్ఞానం అని అంటాడు గోవిందరాజు. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు.

కట్ చేస్తే తెల్లారుతుంది. ఉదయం కూడా తన ఇంటి గుమ్మం వైపే చూస్తాడు రామా. రామా గారు.. టీ తాగండి అని జానకి టీ తెచ్చి ఇస్తుంది. దీంతో వద్దు జానకి గారు అంటాడు రామా. నిన్నటి నుంచి మీరు ఏం తినలేదు. రాత్రంతా నిద్రపోకుండా బాధపడుతూనే ఉన్నారు. కనీసం టీ అయినా తాగండి అంటుంది జానకి.

మీరు నన్ను అడిగినట్టు.. నేను వెళ్లి మా అమ్మను అడగాలని ఉంద జానకి గారు అంటాడు. అమ్మ నిన్నటి నుంచి నువ్వు ఏం తినకుండా బాధపడుతూనే ఉన్నావు. కనీసం టిఫిన్ అయినా తిను అమ్మ అని అడగాలని ఉంది అంటాడు రామా.

కన్నవాళ్లకు బాధలు వచ్చినప్పుడే పిల్లలు అండగా ఉండాలి అంటారు కానీ.. అమ్మ నా కళ్లముందు బాధపడుతుంటే నేను ఉన్నాను అని చెప్పలేకపోతున్నాను. ఒక కొడుకుగా ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా అంటాడు రామా. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి అంటుంది జానకి.

అమ్మ అక్కడ తిండి తిప్పలు లేకుండా ఉంటే నాకు తిండి ఎలా సహిస్తుంది జానకి గారు అంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది. వాళ్లను చూస్తూ కూర్చుంటుంది. మల్లిక అని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అంటుంది.

Janaki Kalaganaledu 13 April Today Episode : రామా కోసం అతడి ముందే టిఫిన్ తిన్న జ్ఞానాంబ

వెళ్లి టిఫిన్ తీసుకురా అంటుంది. దీంతో హోటల్ నుంచా అత్తయ్య గారు అంటుంది. ఈ ఎకసెకాలే వద్దు అంటుంది. నోర్మూసుకొని చెప్పిన పని చేయి వెళ్లు అంటుంది. ఇక్కడే తింటారా.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారా అంటుంది. దీంతో ఏయ్ వెళ్లు.. వెళ్లి తీసుకురా అంటుంది.

దీంతో మల్లిక వెళ్లి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అక్కడే కూర్చొని జ్ఞానాంబ టిఫిన్ తింటుంది. జానకి, రామా చూస్తుండగా టిఫిన్ తింటుంది జ్ఞానాంబ. నాకు జరిగిన అవమానాన్ని తలుచుకొని తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ ఉంటానని కొందరు అనుకొని ఉంటారు.

జానకి గారు అమ్మ తింటుంది అంటాడు రామా. కడుపున పుట్టిన వాళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్నవాళ్లు.. కడుపు మీద తన్నినంత మాత్రాన ఇంకా కడుపు మాడ్చుకొని కూర్చోవాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే ఇక్కడ కూర్చొని తింటున్నాను అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో గోవింద రాజు వచ్చి.. నువ్వు కూడా తిండి తిప్పలు మానేయకు. మీ అమ్మ తట్టుకోలేదు అంటాడు గోవింద రాజు. నువ్వు కడుపు నిండా తింటే మీ అమ్మ మనసు నిండా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఖాళీ కడుపుతో ఉండకు అంటాడు గోవిందరాజు.

దీంతో వెంటనే తను ఇచ్చిన టీ తాగుతాడు రామా. మరోవైపు ఊర్మిల.. తన భర్త యోగిని తిడుతుంది. మీ వల్లనే జానకికి కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి అంటుంది ఊర్మిల. మీ చెల్లెలి కాపురం సమస్యల్లో పడటానికి మీ చేజేతులారా మీరే ఆజ్యం పోశారు అంటుంది.

దీంతో లేదు.. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటుంది ఊర్మిల. కాస్త మీ ఆలోచనను మార్చుకోండి అంటుంది ఊర్మిల. ఆవిడను మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించి అవమానించినా సరే.. ఆవిడ మాత్రం నాకు సారె పెట్టి నిండు నూరెళ్లు జీవించు అని దీవించింది అంటుంది ఊర్మిల.

ఇంతలో యోగికి జానకి ఫోన్ చేసి నీతో అర్జెంట్ గా మాట్లాడాలి.. త్వరగా అమ్మ వారి గుడి దగ్గరికి వచ్చేయ్ అంటుంది జానకి. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి మా అత్తయ్య గారికి నీతో క్షమాపణలు చెప్పించడానికి వచ్చాను అంటుంది జానకి. నేను మీ అత్తయ్య మీద కేసు పెట్టింది ఆవిడ నిన్ను ఇబ్బందులు పెట్టకుండా ఉండటం కోసం అంటాడు యోగి.

నేను సంతోషంగా ఉండాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా అని అడుగుతుంది జానకి. నాకు నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? నేను మా ఆయన, మా అత్తయ్య గారితో కలిసి ఉన్నప్పుడు అంటుంది. కానీ.. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మా అత్తయ్య గారు నన్ను ద్వేషిస్తున్నారు అంటుంది.

నీ మంచి కోసమే నా తపన అంటాడు యోగి. దీంతో నా మంచి కోసం కాదు.. నా భవిష్యత్తును నాశనం చేయడానికి అంటుంది జానకి. నా చదువు విషయం అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. దీంతో సరే.. నీ కోసం జ్ఞానాంబకు క్షమాపణ చెబుతాను అని చెప్పి జానకిని తీసుకొని స్వీటు షాపునకు వెళ్తాడు యోగి.

తనను క్షమించాలని వేడుకుంటాడు అయినా కూడా జ్ఞానాంబ అతడిని పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

4 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

5 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

6 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

7 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

8 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

9 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

10 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

11 hours ago