janaki kalaganaledu 13 december 2021 episode highlights
Janaki Kalaganaledu 13 Dec Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 13 డిసెంబర్ 2021, సోమవారం 191 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని కేకులు నేర్పించడం కోసం పంపించడానికి జ్ఞానాంబ అస్సలు ఒప్పుకోదు. కానీ.. ఒక్కతీరుగా రామా బతిమిలాడే సరికి.. తప్పని పరిస్థితుల్లో జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. దీంతో మా మంచి అమ్మ అంటూ జ్ఞానాంబకు చెప్పి రామా వెళ్తాడు. వస్తాను అత్తయ్య గారు అని చెప్పి జానకి కూడా వెళ్తుంది. ఇద్దరూ బైక్ మీద వెళ్తుంటారు. వీళ్లు కేకుల పేరుతో రాజమండ్రిలో ఏదో చేస్తున్నారు అని మల్లికకు అనిపిస్తుంది. దీంతో మన జానకి కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్న షాపు అడ్రస్ చెప్పండి అని అడుగుతుంది.
janaki kalaganaledu 13 december 2021 episode highlights
అడ్రస్ తీసుకొని వెంటనే రాజమండ్రికి బయలుదేరుతుంది మల్లిక. మరోవైపు జానకికి భయం వేస్తుంటుంది. ఏమండి.. ఒకవేళ అత్తయ్య గారు నేను కేకుల ఎలా నేర్చుకుంటున్నానో అని కేకుల షాపునకు చేస్తే ఎలా అని అడుగుతుంది రామాను. దీంతో రామా ఏం కాదు లేండి.. నేను అన్నీ సెట్ చేశాను. షాపు అతడికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆయన అన్నీ చూసుకుంటాడు. మీరు ఏం టెన్షన్స్ తీసుకోకుండా.. ప్రశాంతంగా కోచింగ్ కు వెళ్లండి అంటాడు రామా. దీంతో జానకి మనసు కాస్త కుదుటపడుతుంది. మరోవైపు మల్లిక.. రాజమండ్రికి వెళ్లి అక్కడ కేకుల షాపునకు వెళ్తుంది. అక్కడ జానకిని పిలవమని అడుగుతుంది. దీంతో ఓ ముసలావిడ వస్తుంది. ఈమె కాదు.. ఆత్రేయ పురం నుంచి వచ్చే జానకి అని చెబుతుంది మల్లిక.
అక్కడి నుంచి వచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు అంటాడు కేకుల యజమాని. దీంతో మల్లికకు అర్థం అయిపోతుంది. ఓహో.. జానకి రాజమండ్రికి వచ్చి కేకులు నేర్చుకోవడం లేదన్నమాట అని అనుకొని జ్ఞానాంబ ముందు అడ్డంగా జానకిని బుక్ చేయాలని అనుకుంటుంది మల్లిక.
మరోవైపు పల్లవికి సంబంధం చూస్తాడు గోవింద రాజు. అప్పుడే అమ్మమ్మ ఇంటి నుంచి వస్తుంది వెన్నెల. వెన్నెల పరీక్ష ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి అని అడుగుతాడు. ఆ తర్వాత పల్లవి పెళ్లి గురించి జ్ఞానాంబతో మాట్లాడుతాడు గోవింద రాజు. మంచి పెళ్లి సంబంధం వచ్చిందని చెబుతాడు. ఆ విషయాన్ని వింటుంది పల్లవి. కాస్త ఇబ్బంది పడుతుంది.
ఇంతలో మల్లిక వచ్చి.. ఆత్రేయపురంలో రేపు కేకుల పోటీలు పెడుతున్నారు. జానకి ఎలాగూ కేకులు నేర్చుకుంటోంది కదా.. ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయిద్దాం జానకిని అంటుంది మల్లిక. దాని వల్ల జానకికి, మన షాపునకు పేరు వస్తుంది అని చెప్పి ఎలాగోలా ఆ పోటీలో జానకి పాల్గొనేలా చేస్తుంది మల్లిక.
మరోవైపు రామా.. తన భార్య జానకి కోసం స్పెషల్ స్వీట్లు తయారు చేస్తాడు. రజనీకాంత్ కు ఇచ్చి వాటిని ఇచ్చి రాపో అంటాడు. కానీ.. అప్పుడే వేరే కస్టమర్లు తీసుకున్న స్వీట్ బాక్స్ తో ఈ బాక్స్ మారిపోతుంది. ఆ స్వీట్లలో మత్తు మందు కలపడంతో ఆ స్వీట్లు తిన్న జానకి రెచ్చిపోతుంది.
రాత్రి పూట పడుకోవడానికి రామా రాగానే అస్సలు ఆగదు. ముద్దుల మీద ముద్దులు పెడుతుంది అతడికి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. రామాకు పిచ్చి ఎక్కుతుంది. జానకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో రామాకు అర్థం కాదు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.