Janaki Kalaganaledu 13 May Today Episode : కన్నబాబు వల్ల రామా డిస్టర్బ్.. రామా పరిస్థితి చూసి జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. అంతా జానకి వల్లేనా?

Janaki Kalaganaledu 13 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 300 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు.. కన్నబాబుతో ఎందుకు కొట్టు ముందు గొడవ పెట్టుకున్నావు అని జ్ఞానాంబ.. రామాను ప్రశ్నిస్తుంది. దీంతో ఏం లేదమ్మా.. పాత గొడవలు అని చెబుతాడు. కానీ.. జ్ఞానాంబ నమ్మదు. తనకు ఏదో అనుమానం కలుగుతుంది. సెలబ్రేషన్స్ అయ్యాక.. సరే పదండి అని అంటుంది. మరోవైపు జానకికి కూడా అనుమానం వస్తుంది. ఎందుకు రామా గారు అంతలా టెన్షన్ పడుతున్నారు.. ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటుంది జానకి. మరోవైపు మల్లికకు కూడా ఏం అర్థం కాదు. అసలు.. వీళ్ల మధ్య ఎందుకు గొడవ జరిగిందో తెలుసుకోవాల్సిందే అని అనుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో నీలావతి తనను చూసి పిలుస్తుంది.

janaki kalaganaledu 13 may 2022 full episode

రెండు వేలు ఇస్తానన్నావు కదా అంటుంది. దీంతో నువ్వు ఏం వెలగబెట్టావు అక్కడ.. అసలు గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోకుండా.. ఏం చేయాలి అంటుంది. దీంతో లేదమ్మా.. గొడవకు కారణం ఖచ్చితంగా కొట్టే అంటుంది. దీంతో సరే.. వెళ్దాం పదా అంటుంది. ఎక్కడికి అంటే.. కన్నబాబు దగ్గరికి వెళ్దాం అంటుంది. డైరెక్ట్ గా కన్నబాబబు దగ్గరే తేల్చుకుందాం అంటుంది. ఇద్దరూ కన్నబాబు దగ్గరికి వెళ్తారు. అక్కడ టీ షాపు ఉండటంతో రెండు టీ చెబుతుంది మల్లిక. చూడమ్మ కన్నబాబు నీతో ఒక విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది. దీంతో చిరాకు తెప్పించకుండా విషయం ఏంటో చెప్పు అంటాడు కన్నబాబు.

వీడు కన్నబాబు కాదు.. దున్నబాబు అని మనసులో అనుకుంటుంది. ఏయ్.. ఏంటలా చూస్తున్నావు అంటాడు కన్నబాబు. ఏంలేదు.. ఈరోజు టీ ఎలా ఉందా అని అంటుంది. చేతుల్లో పెట్టుకున్నావు కదా తాగు నీకే తెలుస్తుంది అంటుంది. ఆ తర్వాత చూడు కన్నబాబు అంటుంది.. ఏంటి నీ నస అంటాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి మల్లిక వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో అందరూ భోంచేస్తుంటారు. రామా మాత్రం ఆ స్వీటు కొట్టు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జానకి రామానే గమనిస్తూ ఉంటుంది. రామా టెన్షన్ పడటం చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది.

Janaki Kalaganaledu 13 May Today Episode : రామా టెన్షన్ గా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన జ్ఞానాంబ

అందరూ అన్నం తిన్నా.. రామా మాత్రం అన్నం తినకుండానే వెళ్లిపోతాడు. దీంతో జ్ఞానాంబతో పాటు అందరూ షాక్ అవుతారు. అదేంటి.. రాముడు అన్నం ఇలా వదిలేసి వెళ్లిపోయాడు. ఎప్పుడూ అన్నం వదిలిపెట్టడే.. ఏమైంది వీడికి అని అనుకుంటాడు గోవింద రాజు.

రామా తినకుండా వెళ్లేసరికి.. జ్ఞానాంబ కూడా తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రామా బయటికి వెళ్లి కట్టెలు కొడుతూ ఉంటాడు. నా కొడుకు ఇలా కట్టెలు కొట్టడం ఏంటి.. వాడికి అంత కోపం ఎందుకు వస్తుంది.. అని అనుకొని జానకి దగ్గరికి వెళ్తుంది.

నా కొడుకు ఎక్కడ అని జానకిని అడుగుతుంది. దీంతో పేరట్లో ఉన్నట్టున్నాడు అని చెబుతుంది జానకి. అక్కడ ఎందుకు ఉన్నాడు అని అడుగుతుంది. దీంతో తెలియదు అని అంటుంది. వాడు అక్కడ ఎందుకు ఉన్నాడో నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది జ్ఞానాంబ.

దీంతో ఆయన బాగానే ఉన్నారు అని అంటుంది జానకి. దీంతో ఒకసారి బయటికి వెళ్లి చూడు. వాడు బాగున్నాడో ఎలా ఉన్నాడో తెలుస్తుంది అంటుంది జానకి. నేను ఆయనతో మాట్లాడుతాను. కన్నబాబుతో గొడవ అయింది అన్నారు కదా.. బహుషా.. ఆ కోపంలో ఉండి ఉంటారు అంటుంది జానకి.

దీంతో వాడిది కోపం కాదు.. బాధ.. ఆ బాధకు కారణం నువ్వే.. అంటుంది జ్ఞానాంబ. వాడి మనసులో అగ్నిపర్వతం అంత దు:ఖాన్ని మోయడానికి కారణం ఏంటో నీకు తెలియదా.. అంటుంది జ్ఞానాంబ. వాడెందుకు బాధపడుతున్నాడో నీకు అర్థం కావడం లేదా. నువ్వు ఏం భార్యవు.

మొదట్లో నిన్ను చూసి నా కొడుకుకు తగ్గ భార్య వచ్చిందని సంబురపడ్డాను కానీ.. నిన్ను నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో జానకి అక్కడే కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఇంతలో రామా లోపలికి వస్తాడు. రామా రాగానే ఏమైంది అని అడుగుతుంది జానకి. కానీ.. రామా మాత్రం ఏం చెప్పడు. తను కంటిన్యూగా అడుగుతుండటంతో రామాకు కోపం వస్తుంది. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

18 minutes ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

1 hour ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

2 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

3 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

4 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

5 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

6 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

7 hours ago