Janaki Kalaganaledu 13 Oct Today Episode : మల్లికపై రామా సీరియస్.. జ్ఞానాంబకు ఈ విషయం తెలిసి మల్లికను ఇంట్లో నుంచి పంపించేస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: October 13, 2022, 9:30 am

Janaki Kalaganaledu 13 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 409 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ అన్న మాటలకు జానకి బాగా బాధపడుతుంది. రూమ్ కు వచ్చి అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తను నిద్రపోతుంది. అప్పుడే వచ్చిన రామా ఏమైంది.. ఈ సమయంలో పడుకున్నారు అని జానకిని నిద్రలేపుతాడు. దీంతో అఖిల్ అన్న మాటలను రామాకు చెప్పకూడదని అనుకుంటుంది జానకి. ఏం లేదు.. కాస్త తలనొప్పిగా ఉంది అంటుంది జానకి. దీంతో ఉండండి.. కాఫీ పెట్టి తీసుకొస్తా అంటాడు. మరోవైపు చికిత కూడా జానకి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనను మల్లిక ఎందుకు డిస్టర్బ్ చేస్తోంది అని అనుకుంటుంది. ఇంతలో రామా కిచెన్ లోకి వెళ్తుండగా.. చికిత చూసి.. రామాను పిలిచి అన్ని విషయాలు చెబుతుంది. జానకి అమ్మ గారికి ఉన్నది తలనొప్పి కాదు అని మల్లిక, అఖిల్ గురించి చెబుతుంది చికిత. జానకి అమ్మ గారిని తిట్టించడానికి, చదవకుండా అడ్డుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు అంటుంది చికిత.

janaki kalaganaledu 13 october 2022 full episode

janaki kalaganaledu 13 october 2022 full episode

దీంతో నేను ఇప్పుడే మల్లికతో మాట్లాడుతాను. నువ్వు వెళ్లి జానకి గారికి కాఫీ ఇవ్వు అంటాడు రామా. ఇంతలో రామా మల్లిక దగ్గరికి వస్తాడు. మీ తమ్ముడు ఇంకా షాపు నుంచి రాలేదు అంటుంది. దీంతో మీ బావ గారు ఇంకా షాపు నుంచి రాలేదు అంటుంది మల్లిక. నీది తెలియని తనమో.. ఆకతాయి తనమో తెలియదు కానీ.. నేను నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. ఇంట్లో సమస్యలు సృష్టించాలని చూస్తున్నావు. జానకి గారి చదువును ఆపాలని ప్రయత్నిస్తున్నావు అంటాడు. అందరినీ ఆవేశానికి గురి చేసి నువ్వే మనశ్శాంతి కోల్పోయి సాధించేది ఏముంది. జానకి గారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం చాలా ముఖ్యం. తన నాన్న గారి కల అది. ఆయన ఈ లోకంలో లేకపోయినా దాన్ని సాధించడం జానకి గారి కల.. అంటాడు రామా.

అంటే ఏంటి బావ గారు.. ఈ ఇంట్లో గొడవలు, సమస్యలు అన్నీ నావల్లే వస్తున్నాయా? ఇదంతా జానకే నీకు ఎక్కించి నా మీద చెప్పి ఉంటుంది.. అని అంటుంది మల్లిక. జానకి గారు నిన్ను అన్ని విధాలా మంచిగా చూసుకుంటారు.. నిన్ను ఎందుకు అలా అంటారు అంటాడు రామా.

మీతో కాదు.. జానకితోనే నేను తేల్చుకుంటాను అని జానకి అంటూ గట్టిగా పిలుస్తుంది. దీంతో ఇంతలో జానకి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. బావ గారికి అన్ని లేనిపోనివి చెప్పి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా? అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 13 Oct Today Episode : అఖిల్ గురించే టెన్షన్ పడ్డ జ్ఞానాంబ

ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది గొడవ అంటుంది. బుద్ధి లేదా నీకు.. అంతలా అరుస్తున్నావు ఎందుకు. జానకి చదువుకు ఎందుకు భంగం కలిగిస్తున్నావు అంటుంది జ్ఞానాంబ.

ఆ తర్వాత రామాతో మాట్లాడుతుంది జానకి. మీరు ఎందుకు మల్లికతో ఆ విషయం మాట్లాడుతున్నారు. మల్లికతో ఎందుకు గొడవ పెట్టుకున్నారు అని అడుగుతుంది జానకి. నేను అవన్నీ చూసుకుంటాను. మీరేం టెన్షన్ పెట్టుకోకండి అంటుంది జానకి.

తర్వాత అఖిల్ గురించి జ్ఞానాంబ టెన్షన్ పడుతుంది. వాడు ఏదో చిన్న చిన్న తప్పులు చేశాడు కదా అంటాడు రామా. నువ్వు మాట్లాడకుండా దూరం పెట్టేసరికి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. వాడికి నువ్వే లోకం అమ్మ.

చిన్నప్పటి నుంచి వాడు నీ ముందు పెరిగాడు. నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే..వాడు చిన్నబోతున్నాడు అని రామా, జానకి కలిసి జ్ఞానాంబకు నచ్చజెప్పుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp