janaki kalaganaledu 14 july 2022 full episode
Janaki Kalaganaledu 14 July Today Episode: జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జులై 2022, గురువారం ఎపిసోడ్ 344 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా, జానకి దగ్గర దగ్గర పడుకుంటారు. ఇంతలో తెల్లవారుతుంది. డోర్ కొట్టిన శబ్దం వినబడి జానకి లేస్తుంది. వెళ్లి డోర్ తీస్తుంది. ఎదురుగా జ్ఞానాంబ ఉంటుంది. జానకి అవతారం చూసి రాత్రి శోభనం జరిగిందని అనుకుంటుంది జ్ఞానాంబ. ప్రతి తల్లి కూతురును అడిగే విషయమే ఇది. నేను కూడా అత్తలా కాకుండా తల్లిలా అడుగుతున్నాను. మీ మధ్య అన్యోన్యత కలిసిందా. మీరు ఏకమయ్యారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి ముసి ముసి నవ్వులు నవ్వుతుంది. సరే సరే నేను పాయసం చేసుకొని వస్తాను. మీరు త్వరగా రెడీ అవండి అని అంటుంది జ్ఞానాంబ. ఇదంతా చాటుగా విన్న మల్లిక.. అమ్మో.. అమ్మో నా ఐదు సెంట్ల స్థలం పోయినట్టే అని అనుకుంటుంది మల్లిక.
janaki kalaganaledu 14 july 2022 full episode
మరోవైపు మల్లిక రూమ్ ను కూడా కొడుతుంది జ్ఞానాంబ. దీంతో రూమ్ తీసి రాత్రంతా నిద్రలేదు అంటూ నాటకాలు ఆడుతుంది. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. జ్ఞానాంబ ముందు తెగ సిగ్గుపడిపోతుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. మరోవైపు రాత్రి ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు రామా. తనను చూసి జానకి నవ్వుతూ ఉంటుంది. జానకి గారు నా బట్టల మీదికి ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అలా సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తున్నారు ఏంటి అని అడుగుతాడు రామా. దీంతో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చేయలేదన్నట్టు మాట్లాడుతున్నారా అంటుంది జానకి.
అది కాదు జానకి గారు.. నాకంతా అయోమయంగా, ఆశ్చర్యంగా ఉంది అంటాడు. మీరు ముందు ఐపీఎస్ పూర్తి చేయండి.. ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పానా. కానీ ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అప్పటి వరకే నాకు గుర్తుంది అంటాడు రామా.
మా ఆయన్ను చూసి సిగ్గుకు పర్యాయిపదం అనుకున్నా కానీ.. చిలిపికి చిరునామా. రొమాంటిక్ రామా.. ప్రేమ యాత్ర చేద్దామా అని అంటుంది జానకి. దీంతో సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. తర్వాత అందరూ రెడీ అవుతారు. జ్ఞానాంబ పిలుస్తుంది.
పాయసం చేసి వాళ్లకు పెడుతుంది జ్ఞానాంబ. జానకికి పాయసం తినిపిస్తుంది జ్ఞానాంబ. ఇంతలో అక్కడికి వచ్చిన మల్లిక వింతగా చూస్తుంది. మొన్న నా కోడళ్లు ఇద్దరూ నాకు మాటిచ్చిన తర్వాత నా బాధంతా పోయింది. త్వరలోనే నా కోడళ్ల కడుపు పండుతుందన్న ఆశ నాలో కలిగింది. నాకు ఇంత కన్నా సంతోషం ఇంకేం ఉంటుంది అని అంటుంది జ్ఞానాంబ.
మరోవైపు జ్ఞానాంబకు అసలు నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు విష్ణు. కానీ.. మల్లిక చెప్పనివ్వదు. విష్ణు.. ఇదిగో నువ్వు కూడా తిను అని పాయసం ఇస్తుంది జ్ఞానాంబ. తినండి అని అందరికీ చెబుతుంది. తర్వాత పాయసం తిని అందరూ వెళ్లిపోతారు.
అనంతరం జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తుంది. ఇద్దరికీ ఒకేసారి కడుపు పండాలి అని గోవిందరాజుతో అంటుంది జ్ఞానాంబ. చిన్నకోడలుకు త్వరగా కడుపు పండి.. పెద్ద కోడలుకు లేట్ గా కడుపు పండితే.. చాలామంది చాలారకాలుగా మాట్లాడుకుంటారు అని అంటుంది జ్ఞానాంబ.
ఇవన్నీ జానకి వింటుంది. నా పెద్ద కోడలు నాకు ఇచ్చిన మాట మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఆ విషయం విని జానకి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.