Janaki Kalaganaledu 15 August 2022 Episode : మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. జానకిని చూసి బాధపడుతున్న రామ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 15 August 2022 Episode : మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. జానకిని చూసి బాధపడుతున్న రామ..

Janaki Kalaganaledu 15 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు తాజాగా విడుదలైంది. 366 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. మల్లిక భోజనం ప్లేట్లు చాటుగా పెట్టుకొని ఎంతసేపటికి తీయకపోతే అప్పుడు గోవిందరాజు తన వెనక ఏదో ఉంది అని చూస్తూ ఉంటాడు. గోవిందరాజు తనని ఒక ప్లాన్ వేసి అది మౌనవ్రతం కాదు.. దొంగతనంగా భోజనం చేస్తుంది అని బయట […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 August 2022,11:00 am

Janaki Kalaganaledu 15 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు తాజాగా విడుదలైంది. 366 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. మల్లిక భోజనం ప్లేట్లు చాటుగా పెట్టుకొని ఎంతసేపటికి తీయకపోతే అప్పుడు గోవిందరాజు తన వెనక ఏదో ఉంది అని చూస్తూ ఉంటాడు. గోవిందరాజు తనని ఒక ప్లాన్ వేసి అది మౌనవ్రతం కాదు.. దొంగతనంగా భోజనం చేస్తుంది అని బయట పెట్టేస్తాడు. అప్పుడు జ్ఞానాంబ మల్లికను తిడుతూ నేను తిండికి చంపేంత మూర్ఖురాలు కాదు. ఇప్పుడు వచ్చి నిన్ను తినమని చెబుదామని అనుకున్న. ఇంతలో నువ్వు దొంగసాటుగా తింటావా.. ఇక ఈ రెండు రోజుల తో పాటు ఇంకొక రోజు ఎగస్ట్రా నువ్వు తిండి తిప్పల మానేయాలి అని అంటుంది. అప్పుడు గోవిందరాజు సంతోష్ పడిపోతూ ఉంటారు. మల్లిక ఏడుస్తూ మళ్లీ అలాగే అన్నం తింటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లిక అని గట్టిగా పిలుస్తుంది. కట్ చేస్తే జెస్సి జ్ఞానాంబ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి వచ్చి జెస్సిని పరిచయం చేసుకుంటుంది.

ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అవును నువ్వు ఎందుకు చిరాగ్గా ఉన్నావు అని అంటుంది జానకి. అప్పుడు జెసి ఒక ఆవిడ ఇలా మొండిగా బిహేవ్ చేసింది అని చెప్తుంది. జానకి పెద్దవాళ్లు ఏది చెప్పిన మన మంచికే చెప్తారు అని చెప్తుంది. జానకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మల్లిక పిండి ఇసురుతూ నా జీవితం ఏంట్రా ఇలా తగలబడింది ఏంటి.. పెద్ద కోడలు జీవితమేమో సంతోషాలతో వెలిగిపోతుంది అని అంటుండగా.. జానకి ఇంటికి వస్తుంది. జానకి పై సెటైర్ వేస్తుంది. అప్పుడు జానకి మల్లికకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. జానకి జ్ఞానంబ కి, గోవిందరాజుకి కాఫీ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు గోవిందరాజు నువ్వు పెట్టిన షరతులు ఎలా పాటిస్తుందో చూడు అని అంటాడు. కట్ చేస్తే జానకి ఇంట్లో వంట అన్ని పనులు చకచక చేస్తుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మల్లిక అదంతా చూస్తూ ఆకలితో మండిపోతూ ఉంటుంది. అప్పుడు జానకి మల్లికను చూసి.. జానకి అత్తయ్య గారు పాపం మల్లికా అస్సలు ఆకలికి భరించలేదు.

Janaki Kalaganaledu 15 August 2022 Full Episode

Janaki Kalaganaledu 15 August 2022 Full Episode

మీరు అనుమతిస్తే తనని కూడా భోజనానికి పిలుస్తాను అని అంటుంది. అప్పుడు ఈ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చేస్తాను. రేపు నువ్వైనా అంతే జానకి అని అంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఇంట్లో ఎవరైనా తప్పు చేయాలి అంటే భయపడాలి అని అంటుంది. కట్ చేస్తే జానకి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రామ్మా వచ్చి జానకి గారు మీరు ఉదయమంతా వంట, ఇంటి పనులు చేశారు. చదువు కోసం అంత దూరం వెళ్లి వచ్చారు. ఇప్పుడేమో నిద్రపోకుండా చదువుకుంటున్నారు. ఇక రండి పడుకుందురు గాని అని అంటాడు.

అప్పుడు ఇప్పుడు పరీక్షలు ఉన్నాయండి కొద్ది సమయం ఉంది నాకు ఇది వృధా చేయకూడదు మీరు వెళ్లి పడుకోండి అని అంటుంది. నేను అమ్మతో మాట్లాడతాను ఈ చదువు అయిపోయే వరకు ఇంటి పనులు మీకు చెప్పవద్దు అని చెప్తాను అని అంటాడు రామ. వద్దండి అత్తయ్య గారు నాకు పెట్టిన నియమాలతో పాటు నేను చదువుకుంటాను. ఈ చదువు ఎంత ముఖ్యమో అత్తయ్య గారు చెప్పిన షరతులు కూడా అంతే ముఖ్యం అండి అని అంటుండగా జ్ఞానంబ అక్కడినుంచి వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటుంది. జానకి అత్తయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలని రామాతో అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది