
janaki kalaganaledu 15 december 2021 full episode
Janaki Kalaganaledu 15 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2021, బుధవారం 193 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే జానకి నార్మల్ గా ఉండటం చూసి రామా షాక్ అవుతారు. రాత్రి మాత్రం తను చేసిన అల్లరి గుర్తుకుతెచ్చుకుంటాడు. రామా గారు ఇక బయలుదేరుదామా అని అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం రాత్రి విషయానే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రామా గారు అని గట్టిగా జానకి అరిచేసరికి.. అప్పుడు తేరుకుంటాడు. రామా గారు బయలుదేరుదామా అంటే.. ఏంటి అలాగే చూస్తున్నారు అంటుంది. దీనికి కారణం రాత్రి మీరు చేసిన జోరు అంటాడు రామా. మిమ్మల్ని ఎప్పుడు అంత కొత్తగా, వింతగా చూడలేదండి అంటాడు రామా. మళ్లీ ఏం తెలియనట్టు అలా ముఖం పెట్టకండి అంటాడు రామా. నేను ఏం చేశానో కాదు.. రాత్రి మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండి.. అంటుంది జానకి.
janaki kalaganaledu 15 december 2021 full episode
నేను కాదు మీరే చాలా అల్లరి చేష్టలు చేశారు. ఆడపిల్లను చెప్పుకోవడానికి నాకే సిగ్గు అడ్డొస్తుంది అంటుంది జానకి. వెళ్దాం పదండి అంటుంది జానకి. అన్ని పుస్తకాలు సంచిలో పెట్టుకున్నారా అని చెక్ చేసుకుంటారు జానకి, రామా. ఇంతలో మల్లిక బయటికి వచ్చి.. వీళ్లు ఎప్పుడు బయటికి వస్తారా అని చూస్తుంటుంది. వాళ్లిద్దరు రాగానే.. వెంటనే జానకి అని పిలుస్తుంది మల్లిక. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఎక్కడికి అని అడుగుతుంది. అంటే.. ఈరోజు కూడా రాజమండ్రికి వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తుంది మల్లిక. అంటే.. అత్తయ్య గారు నీకు విషయం చెప్పలేదా జానకి అంటుంది. ఏ విషయం గురించి అంటుంది జానకి. నేను చెప్పడం ఎందుకులే.. స్వయంగా అత్తయ్య గారే చెబితే బాగుంటుంది. అత్తయ్య గారు అని పిలుస్తుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. అత్తయ్య గారు నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే జానకి, రామా.. ఇద్దరూ బండెక్కి ఎప్పుడో వెళ్లిపోయేవారు అంటుంది మల్లిక.
లేదంటే పోటీలో మన పరువు పోయేది అంటుంది మల్లిక. దీంతో రామా, జానకికి ఏం అర్థం కాదు. పోటీ ఏంటి అంటాడు రామా. ఈరోజు కేకుల పోటీలు ఉన్నాయి. మన షాపు తరుపున జానకి పేరు ఇచ్చాం.. అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి షాక్ అవుతారు.
నాకు తెలసి ఈపాటికి జానకి ఎన్ని రకాల కేకులు ఉన్నాయో.. అన్ని రకాల కేకులు నేర్చుకొని ఉంటుంది జానకి అంటుంది మల్లిక. నీ మీద ఉన్న నమ్మకంతో నిన్ను అడగకుండానే నీ పేరు ఇచ్చాను జానకి అంటుంది జ్ఞానాంబ. దీంతో తప్పని పరిస్థితుల్లో జానకి.. కేకుల పోటీకి రావాల్సి వస్తుంది.
కేకుల పోటీలు ప్రారంభం అవుతాయి. మల్లికకు ఫుల్ సంతోషం వేస్తుంది. జానకి ఈరోజు నీకు మూడింది. కేకులు ఎలా చేస్తావో నేనూ చూస్తాను కదా అంటుంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్లు ఉంటే త్వరగా రావాలని అనౌన్స్ చేస్తారు.
జానకి, రామాతో పాటు.. జ్ఞానాంబ, గోవింద రాజు, చికిత, మల్లిక అందరూ పోటీలకు వస్తారు. మల్లిక కేకుల పోటీ దగ్గర తెగ ఆవేశపడుతుంటే.. ఏయ్.. నువ్వెందుకు ఇలా గొడవ చేస్తున్నావు. గోల చేస్తున్నావు అంటంది జ్ఞానాంబ. ఇది గోల కాదండి అత్తయ్య గారు ఆనందం అంటుంది మల్లిక.
మనం తప్పు చేశాం అండి. మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. కానీ మనకు అంత సమయం కూడా లేదు. మీకు కేకు తయారు చేయడం రాదని అమ్మకు తెలిసిపోతుంది. మీరు రాజమండ్రికి వెళ్లేది కేకులు నేర్చుకోవడానికి కాదని తెలుస్తుంది అంటాడు రామా.
ఇంతలో కేకుల పోటీలు ప్రారంభం అవుతాయి. పోటీల పాల్గొనే వారికి నిబంధనలు చెబుతారు. గంట మాత్రమే సమయం ఇస్తారు. ఎవరి సహాయం లేకుండా సొంతంగా కేకు తయారు చేయాలని చెబుతారు. దీంతో జానకి షాక్ అవుతుంది. మరోవైపు వెన్నెల తన బాయ్ ఫ్రెండ్ ను కలుస్తుంది. తనకు పెళ్లి సంబంధం చూశారని చెబుతుంది. వాళ్లను ఓ వ్యక్తి చూసి తన ఫోన్ లో రికార్డు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.