Janaki Kalaganaledu 15 Feb Today Episode : వెన్నెల నిశ్చితార్థం ఆపేందుకు జానకి, రామా ప్రయత్నాలు.. ఈ విషయం జ్ఞానాంబ‌కు తెలిసి షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 15 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 237 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి. లేకపోతే వెన్నెల మనకు దక్కదు అని రామాతో జానకి చెప్పగానే.. ఇంతలోనే జ్ఞానాంబ‌.. రామా, జానకిని పిలుస్తుంది. ఇదేంటి.. అమ్మ మనల్ని పిలుస్తుంది అని అనుకుంటారు. వెంటనే తన దగ్గరకి వెళ్తారు. ఏంటమ్మా అంటారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్నా అంటుంది. ఏంటమ్మా అంటే వెన్నెలకు ఎల్లుండి నిశ్చితార్థం అని చెబుతుంది జ్ఞానాంబ‌. ఆరామచంద్రాపురం సంబంధం ఓకే అయింది. వాళ్లు పదే పదే క్షమాపణలు చెప్పి బతిమిలాడారు. మంచి సంబంధం.. అందుకే నేను, మీ నాన్న మాట్లాడుకొని ఖాయం చేశాం. ఈరోజే ముహూర్తం పెట్టించాం. నువ్వు జానకి దగ్గరుండి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అంటుంది.

janaki kalaganaledu 15 february 2022 full episode

దీంతో రామా, జానకి షాక్ అవుతాడు. ఇంతలో జానకి ఆ విషయం చెప్పండి అని అంటుంది. దీంతో అమ్మ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు రామా. నిశ్చితార్థం దగ్గరపడుతోంది. పనులన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. పనులన్నీ అయిపోయాక మాట్లాడుకుందాం అని అంటుంది. రామా చెప్పేది అస్సలు వినదు జ్ఞానాంబ‌. దీంతో రామా, జానకికి ఏం చేయాలో అర్థం కాదు. పరిస్థితులు మన చేయి దాటి పోయాయేమో అని నాకు చాలా కంగారుగా ఉంది అంటాడు రామా. ఇంతలో జానకికి ఒక ఐడియా వస్తుంది. మీ దగ్గర రామచంద్రాపురం వాళ్ల నెంబర్ ఉందా అని అడుగుతుంది జానకి. దీంతో ఉంది అంటాడు. వెంటనే ఫోన్ చేయండి అంటుంది జానకి. వెంటనే ఫోన్ చేస్తాడు రామా.

నేను జ్ఞానాంబ‌ గారి పెద్ద కోడలును మాట్లాడుతున్నాను. మీరు ఇంట్లో ఉంటే మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాం అంటుంది జానకి. దీంతో సరే.. రండి ఇంట్లోనే ఉన్నాను అంటాడు సుబ్బరాజు. వెంటనే ఇద్దరూ రామచంద్రాపురం బయలుదేరుతారు.

మరోవైపు ఈ ముసలిది వచ్చి నన్ను టార్చర్ పెడుతోంది అని అనుకుంటుంది మల్లిక. ఒంటి కాలిపై నిలబెడుతుంది మల్లికను. లేకపోతే నువ్వు నన్ను చంపేస్తావా.. చచ్చిపోయానని అబద్ధం చెబుతావా అని సీరియస్ అవుతుంది తలుపులమ్మ.

మరోవైపు జానకి, రామా ఇద్దరూ రామచంద్రాపురం వెళ్తారు. వాళ్ల ఇంటికి వెళ్తారు. చెప్పండి బాబు ఏదో అర్జెంట్ గా మాట్లాడాలి అని చెప్పారు అంటాడు. దీంతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు అంటాడు రామా.

Janaki Kalaganaledu 15 Feb Today Episode : సుబ్బరాజు ఇంటికి వెళ్లి వెన్నెల ప్రేమ విషయం చెప్పిన రామా, జానకి

దేని గురించి బాబు అంటాడు. మా చెల్లెలు నిశ్చితార్థం గురించి అండి అంటాడు రామా. ఈ నిశ్చితార్థం జరగదండి అంటాడు రామా. దీంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు నిశ్చితార్థం జరగకపోవడం ఏంటి అంటాడు సుబ్బరాజు. మా చెల్లెలు ప్రాణాలు నిలబడాలంటే ఈ నిశ్చితార్థం ఆగాల్సిందే అంటారు వాళ్లు.

మా వెన్నెల ఒక అబ్బాయిని ప్రేమించింది అంటుంది జానకి. ప్రేమించిన వాడితో పెళ్లి జరగకపోతే మా చెల్లి ప్రాణాలతో ఉండదు.. అంటాడు రామా. ఈ విషయం గురించి మా అత్తయ్య గారితో చెప్పే ధైర్యం మాకు లేదు అంటుంది జానకి. అందుకే.. మీ అంతట మీరే ఈ సంబంధం ఇష్టం లేదని నిశ్చితార్థాన్ని ఆపేయండి అంటారు.

పిల్లలు అన్నాక ఇవన్నీ కామన్. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ కామన్. అన్నయ్యగా తప్పు అని మీరు చెప్పాలి కానీ.. ఇలా చేయడం ఏంటి అంటాడు సుబ్బరాజు. సార్.. మీరే అర్థం చేసుకోండి. తను ఈ నిశ్చితార్థం జరిగితే ప్రాణాలతో ఉండదు అంటుంది జానకి.

కానీ.. సుబ్బరాజు మాత్రం వాళ్ల మాట వినడు. నన్ను బతిమిలాడటం మానేసి.. వెళ్లి మీ ఆడపడుచుకు నచ్చజెప్పుకోండి అని జానకితో అంటాడు సుబ్బరాజు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి. ఇక్కడ నుంచి వెళ్లకపోతే మీరు మాట్లాడిన విషయాన్ని జ్ఞానాంబ‌ గారికి చెప్పాల్సి ఉంటుంది అంటాడు సుబ్బరాజు. దీంతో వద్దండి.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు ఫంక్షన్ హాల్, వంట వాళ్ల విషయాలు అన్నీ జ్ఞానాంబ‌, గోవిందరాజు మాట్లాడుకోవడం వింటుంది వెన్నెల. అమ్మ ఓవైపు నిశ్చితార్థం పనులు చేస్తోంది. వదిన వాళ్లేమో నిశ్చితార్థాన్ని ఆపుతామని వెళ్లారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. వదిన వాళ్లు ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతారో అని చాలా భయంగా ఉంది అని వెన్నెల అనుకుంటుంది.

అంతలోనే జ్ఞానాంబ‌ వెన్నెలను చూసి ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ భయపెట్టి పెంచలేదు. పిల్లలు తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడతారు. అంటే.. ఈ అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసి తప్పు చేసినట్టు కదూ అంటుంది జ్ఞానాంబ‌.

అది కాదు అమ్మ. నేను ప్రాణంగా ప్రేమించాను అమ్మ అంటుంది వెన్నెల. నేను నా కూతురును ప్రాణంగా పెంచుకోలేదా అంటుంది. ఆ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు అంటుంది జ్ఞానాంబ‌.  2 ఏళ్లు అంటుంది. నేను నీకు ఎన్నేళ్ల నుంచి తెలుసు అంటుంది. 20 ఏళ్లు అంటుంది వెన్నెల.

అంటే.. 20 ఏళ్ల ప్రేమ కంటే నీకు 2 ఏళ్ల ప్రేమ ఎక్కువైందా. ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా. నువ్వు అడిగిన ప్రతిదీ ఇచ్చాను. దేన్నీ కాదనలేదు. కానీ.. మొదటి సారి నీ ప్రేమను కాదన్నాను. అది కోపంతో కాదు. నీ భవిష్యత్తు కోసం.. అంటుంది జ్ఞానాంబ‌.

నీకు ఏది మంచో.. ఏది చెడో నాకు తెలియదా. నీ పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే పెద్దదానివి అయ్యావా.. జడ వేయడానికే నా దగ్గరికి వస్తావు. కానీ.. ఈ విషయంలో మాత్రం నీ సొంత నిర్ణయం తీసుకున్నావు అంట జ్ఞానాంబ‌.. వెన్నెలకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago