Home » Entertainment » Janaki Kalaganaledu 15 July 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 15 July Today Episode : మల్లికకు జ్ఞానాంబ వార్నింగ్.. ఎలాగైనా రామాతో శోభనం జరిపించాలని జానకి ప్లాన్.. సక్సెస్ అవుతుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 15, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 15 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 345 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి శోభనం జరుపుకుందామని జానకి, రామా అనుకునేలోపే.. రామా తనకు ముద్దు పెట్టే సమయానికి జానకి ఐపీఎస్ పుస్తకం కింద పడుతుంది. ఆ సౌండ్ విని రామా.. తనకు ముద్దు పెట్టకుండా వెళ్లి ఆ పుస్తకాన్ని అక్కడ పెడతాడు. ఆ పెన్ను పుస్తకం మరోసారి నా బాధ్యతను నాకు గుర్తు చేయడం కోసమే కింద పడినట్టున్నాయి అని అంటాడు రామా. ఐపీఎస్ కోసం మీరు కన్న కలలను నెరవేర్చేలా నా బాధ్యతను గుర్తు చేసింది.. అంటాడు రామా. ఇష్టాలు, కష్టాలు అన్నీ అత్తవారింటికి వచ్చిన భార్యకు భర్తే అన్ని. మీ ఇష్టాలు, కష్టాలు అన్నీ ఐపీఎస్ కలే.. అంటాడు. కానీ.. జానకి మాత్రం ఏం కాదు. నేను నా సంసార బాధ్యతలను, ఐపీఎస్ ను రెండింటినీ చూసుకుంటాను అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం మీ ఐపీఎస్ చదువుకు ఆటంకం ఏర్పడితే మీరు తట్టుకుంటారా? తల్లి అయ్యాక ఇప్పటిలా.. రాత్రి పూట మీరు అకాడెమీకి వెళ్లి రాగలరా? తల్లి అయిన వాళ్లకు అసలు శిక్షణ ఇస్తారా అని అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం నేను అవన్నీ చూసుకుంటాను అని రామాతో చెబుతుంది.

Advertisement

janaki kalaganaledu 15 july 2022 full episode

ఎంత చెప్పినా వినకపోవడంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లను బాధపెట్టడం అంత మంచిది కాదు. ఆ హక్కు నాకు లేదు అంటుంది జానకి. మీరు కంటతడి పెడుతూ ఎదుటి వాళ్ల కళ్లలో ఆనందం చూడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు జానకి గారు అంటాడు రామా. నా భార్య జీవితాంతం కంటితడి పెట్టుకుంటుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అంటాడు రామా. ఓ రెండేళ్లు ఆగితే మీరు ఐపీఎస్ అవుతారు. అప్పుడు ఖచ్చితంగా అమ్మకు ఇచ్చిన మాటను నెరవేరుద్దాం అంటాడు రామా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది జానకి తెల్లారాక.

Advertisement

ఇప్పుడు అత్తయ్యకు ఏం సమాధానం చెప్పాలి అని టెన్షన్ పడుతుంది జానకి. అత్తయ్య గారు బాధపడతారని అబద్ధం చెప్పాను. కానీ.. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడతారు అని అనుకుంటుంది జానకి. అత్తయ్య గారు నన్ను క్షమిస్తారా? అసలు నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటుంది జానకి.

Janaki Kalaganaledu 15 July Today Episode : రామాకు ఫోన్ చేసి సరసాలు ఆడిన జానకి

మరోవైపు రామా మాత్రం ఏదో జరిగింది అని అనుకుంటాడు. నాకు గుర్తున్నంతవరకు అలా జరగలేదు అని కొట్టులో ఉండి తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటాడు రామా. నా మనసును చాలా అదుపులో పెట్టుకున్నాను కదా అని అనుకుంటాడు. ఇంతలో జానకి ఫోన్ చేస్తుంది.

Advertisement

ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. దీంతో ముందు మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అని అడుగుతాడు. దీంతో గుర్తొస్తున్నారు మీరు పదే పదే. మీ చిలిపి అల్లరి. మీ ముద్దు మురిపాలు అన్నీ గుర్తొస్తున్నాయి.. అంటుంది జానకి. ఇంతకీ నేను చెప్పేది ఒకసారి వినండి అంటాడు రామా.

రాత్రి మన మధ్య ఏం జరగలేదు అని అంటాడు. చెయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని అమాయకుడిలా మాట్లాడుతున్నావా అని అంటుంది జానకి. ఇంటికి వచ్చేటప్పుడు ఒక 5 మూరల మల్లెపూలు తీసుకురా. కొన్ని విడిపూలు కూడా తీసుకురా అంటుంది.

మరోవైపు రామా.. మల్లెపూలు తీసుకొని ఇంటికి వస్తాడు. వీళ్లను చాటుగా గమనిస్తూ ఉంటుంది జానకి. ఎలాగైనా ఇవాళ అయినా వాళ్ల ఏకాంతాన్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది మల్లిక. విష్ణు వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నీకెందుకు పో అంటుంది మల్లిక.

ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. చేయి వస్తే.. విష్ణు అనుకొని అటువైపు వెళ్లు అంటుంది. విసిగించకు అంటుంది. తిరిగి చూసి షాక్ అవుతుంది. అలా చూడకండి అత్తయ్య గారు అంటుంది మల్లిక. భయంతో ఇప్పుడే పోయేలా ఉన్నాను. ప్లీజ్ అత్తయ్య గారు అంటుంది మల్లిక.

Advertisement

విష్ణు వేడినీళ్లు పెట్టమంటే వాడి మీద ఎందుకు అంత చిరాకు పడుతున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఇది కోపం కాదు.. సరసం అంటుంది మల్లిక. ఇప్పటి వరకు చేసిందే పనికిమాలిన పని. మళ్లీ దానికి సమర్థింపు ఒకటి. ఇంకోసారి నువ్వు విష్ణు చెప్పిన పని వినలేదనుకో.. అంటూ వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి